పార్లమెంటు ఎన్నికలలోపు కులగణన ప్రకటన చేయాలి: బీసీ సంక్షేమ సంఘం నల్లగొండ
పార్లమెంటు ఎన్నికలలోపు కులగణన ప్రకటన చేయాలి.
• ఫిబ్రవరి 5 - 6 తేదీలలో బీసీ బిల్లు పెట్టాలని చలో ఢిల్లీ
పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టాలని, జనగణలో కులగణన చేయాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో
రిజర్వేషన్లు పెట్టాలని కేంద్ర బడ్జెటులో బి.సి అభివృద్ధికి 2 లక్షల కోట్లు కేటాయించాలి. డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 5,6వ
తేదీలలో చలో ఢిల్లీ కార్యక్రమం ఏర్పాటు చేసి పార్లమెంట్ వద్ద వేలాదిమంది భారీ ఎత్తున ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలంగాణ రాష్ట్ర బీసీ యువజన సంఘం అధ్యక్షులు నీల వెంకటేష్ ముదిరాజ్ తెలిపారు. ఈరోజు నల్గొండ జరిగిన జిల్లా మీటింగ్ కు జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మి నారాయణ ఆధ్వర్యంలో జరిగింది. ఈ చలో ఢిల్లీ ఆందోళన కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి వేలాది మంది బీసీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొంటారని తెలిపారు. ప్రతి బి.సి ఈ ఉధ్యమంలో పాల్గొనాలని పిలుపు. పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టారని గత 30 సంవత్సరాలుగా ఢిల్లీ పార్లమెంటు వద్ద 102 సార్లు ధర్నాలు జరిపాము. 66 సార్లు ప్రధాన మంత్రులను కలిసి చర్చలు జరిపాం. వందలాది పార్లమెంటు సభ్యులను, ప్రతిపక్ష
పార్టీలను కలిసి విజ్ఞప్తి చేశాము. కేంద్ర ప్రభుత్వానికి 18 డిమాండ్లు సమర్పించగా 2 డిమాండ్లను 1. జాతీయ బిసి కమిషన్ కు రాజ్యాంగబద్ధమైన హోదా, 2. కేంద్ర ఓబిసి రిజర్వేషన్లను గ్రూపులుగా వర్గీకరించడానికి అంగీకరించారు. జీవోలు జారీ చేశారు. ఇంకా అంగీకరించిన నాలుగు డిమాండ్లలో రెండు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ, కేంద్ర బడ్జెటు బీసీ విద్యార్ధులకు స్కాలర్ షిప్ పూర్తి ఫీజురియంబర్స్ మెంట్ డిమాండ్లు పరిష్కారం కాలేదు. బీసీ బిల్లుకు మద్దతు ఇవ్వాలని అన్ని రాజకీయ పార్టీలను కోరారు. కేంద్ర ప్రభుత్వం వచ్చే బడ్జెట్ లో 2 లక్షల కోట్లు బడ్జెట్ కేటాయించాలని కోరారు. జాతీయస్థాయి తెలుగు రాష్ట్రాలలో ఉన్న మాదిరిగా పూర్తి ఫీజుల రియంబర్స్ మెంట్, ప్రతి విద్యార్థికి 20 వేల స్కాలర్ షిప్ పథకం పెట్టాలి. అలాగే నాణ్యమైన విద్య కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ రెసిడెన్షియల్ పాఠశాల స్కీం, హాస్టళ్ళు మంజూరు చేయాలని కోరారు. అలాగే ప్రతి బీసీ కుటుంబానికి 10 లక్షల సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని కోరారు. బీసీల అభివృద్ధికి ఎలాంటి పథకం పెట్టకుండా అన్యాయం చేస్తున్నారని విమర్శించారు.
ఇది ప్రజస్వామ్యదేశం అన్ని కులాలకు, సామాజిక వర్గాలకు వారి, వారి జనాభా ప్రకారం వాటా ఇవ్వాలి. అప్పుడ oలో సమైక్యత, సమగ్రత, శాంతి ఉంటుంది. అందుకోసం బి.సి లకు రావలసిన వాటా కోసం మరోసారి అధ్యయనం జరుగా లకు రాజ్యాంగబద్దమైన హక్కులు-వాటా కల్పించవలసిన సమయం ఆసన్నమైనది.
ఏ వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో ఏ రాజకీయ పార్టీ బీసీ కులగణన, పార్లమెంటులో బీసీ బిల్లు పెడతామని ప్రకటిస్తుందో ఆ పార్టీకే బీసీలు మద్దతు ఇస్తారు అన్నారు. కేంద్ర ప్రభుత్వం గత 76 సంవత్సరాలుగా బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించకుండా అన్యాయం చేస్తున్నాయి. 76 సంవత్సరాలుగా బీసీలకు అన్యాయం జరుగుతుంది. బీసీలకు చట్టసభలలో బి.సి బిల్లు పెట్టాలని ఉద్యమాలు చేస్తుంటే బీసీ వర్గానికి చెందిన ప్రధానమంత్రి యుండి కూడా బీసీ బిల్లు పెట్టకపోతే చరిత్రలో ఎవరు కూడా చేయరని అన్నారు. అందుకే బీసీలు ఉద్యమాలను ఉదృతం చేయాలని పిలుపునిచ్చాం. ప్రతి బీసీ బీసీ ఉద్యమాలలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.బిజెపి పార్టీ బీసీ వర్గానికి చెందిన నరేంద్ర మోడీని ప్రధానమంత్రిని చేస్తుంది. కానీ దేశంలోని 75 కోట్ల మంది ప్రజల అభివృద్ధికి చర్యలు తీసుకోవడం లేదు. కనీసం ప్రధానమంత్రి అంగీకరించిన ప్రత్యేక మంత్రిశాఖ ఇంత వరకు బీసి
ఏర్పాటు చేయక పోవడం అన్యాయం. ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వాలు గత 75 సంవత్సరాల గా బీసీలకు ఏ రంగంలో కూడా జనాభా ప్రకారం వాటా ఇవ్వలేదు. ఉద్యోగ రాజకీయ ఆర్థిక సామాజిక రంగాలలో కనీస ప్రాతినిధ్యం లభించలేదు ఇది ప్రజాస్వామ్య దేశం ప్రజాస్వామ్యంలో అన్ని సామాజిక కులాలకు వారి వారి జనాభా ప్రకారం అన్ని రంగాలలో వాటా ఇవ్వాలి కానీ 70 సంవత్సరాలు గడిచిన వాటా ఇవ్వడం లేదు. బి.సి లంటే ఉత్పత్తి కులాలు. దేశ సంపద సృష్టిస్తున్నారు. కాని సంపద అనుభవించే హక్కు లేదు. అవకాశం లేదు. పన్నులు కట్టి దేశ బడ్జెట్ ఇస్తున్నారు. కాని బడ్జెట్ లో కనీస వాటా లేదు. ఓట్లు వేసి అధికారం ఇస్తున్నారు. కాని అధికారులు బి.సి లకు వాటా ఇవ్వడం లేదు. ఈ దేశం లో బి.సిలకు ఇలా
అన్యాయం జరుగుతుందన్నారు.
రాజకీయ రంగంలో బి.సి ల ప్రాతినిద్యం 14శాతం దాటలేదని కేంద్ర ప్రభుత్వం ఇటీవల సేకరించిన గణాంకాల ద్వా
సింది. కేంద్రమంత్రి వర్గంలో, రాష్ట్ర మంత్రి వర్గంలో, లోక్ సభ, రాజ్య సభ, రాష్ట్ర అసెంబ్లీ లు, కౌన్సిల్ల లో 75 సంవత్సరాల బి.
ప్రాతినిధ్యం సర్వే చేసి లెక్కించగా, 14 శాతం దాటలేదంటే బి.సి లకు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎంత అన్యాయం జరిగిం బస్తుంది. ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారింది. డబ్బుల ప్రభావం ఎన్నికల మీద విపరీతంగా ఉంది. ఇలాంటి పరిస్థితులక ్బలు లేని బి.సి లు ఎన్నికలలో గెలవలేరు. 75 సంవత్సరాల ప్రజాస్వామ్య వ్యవస్థలో 56 శాతం జనాభా గల బి.సి ల కీయ రంగంలో 14 శాతం, ఉద్యోగ రంగంలో 9 శాతం. పారిశ్రామిక రంగంలో ఒక శాతం, ప్రైవేటు రంగంలోని ఉద్యోగాలలో దం 27శాతం నుండి 56 శాతంకు పెందాలని కోరారుపంచాయతీరాజ్ సంస్థలో బి.సి. రిజర్వేషన్లను 22 శాతం నుంచి 5
30 ప్రాతినిథ్యం లేదంటే చట్ట సభలలో బి.సి లకు జనాభా ప్రకారం వాటా ఇవ్వవలిసిన ఆవశ్యకతను తెలుపుతుంది. పార్లమెంటులో బి.సి. బిల్లు ప్రవేశపెట్టి, చట్ట సభల్లో బీసీ లకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని. బి.సి ఉద్యోగులక బాషన్లను రిజర్వేషన్లు కల్పించాలి. ఇందుకు రాజ్యాంగ సవరణ చేయాలని, కేంద్ర విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లు బి.సి.ల జనాభ
వంకు పెంచాలి. ఈ రిజర్వేషన్లకు రాజ్యాంగ భద్రత కల్పించాలని కోరారు. బి.సి.ల విద్యా, ఉద్యోగ, రిజర్వేషన్ల పై ఉన్న క్రివి మరు తొలగించాలని కోరారు. బి.సి.లకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి. బీసీల అభివృద్ధికి ప్రత్యేక స్కీములన పొందించాలని కోరారు. ఎస్సీ / ఎస్టీ అట్రా సిటీ యాక్ట్ మాదిరిగా బి.సి.లకు సామాజిక రక్షణ, భద్రత కల్పించడానికి బి.సి క్ట్ను తీసుకురావాలని కోరారు. ప్రపంచీకరణ సరళీకృత, ఆర్ధిక విధానాలు రావడం పారిశ్రామికీకరణ వేగవంతంగా జరగడ టు రంగంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చాయి. అందుకే ఎస్సీ / ఎస్టీ / బి.సి.లకు ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు పెట్టాల
"రు. సుప్రీం కోర్టు- హై కోర్టు జడ్జీల నియామకాలలో ఎస్సీ/ ఎస్టీ బి.సి.లకు రిజర్వేషన్లు పెట్టాలని కోరారు. కేంద్రంలో బి.సి.లక > మెట్రిక్స్ స్కాలర్ షిప్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ స్కీము విధానం సాచురేషన్ పద్ధతిలో ప్రవేశపెట్టాలి. రాష్ట్రాలకు 8.
"చింగ్ గ్రాంట్ ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వ శాఖలలో, ప్రభుత్వ రంగ సంస్థలలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగ ఖాళీలను భ
మాలని కోరారు. కేంద్ర స్థాయిలో 2 లక్షల కోట్ల బడ్జెట్ బి.సి సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలని, జనాభా లెక్కల లో బి.సి. కులా ఏ లెక్కలు సేకరించాలని కోరారు. ఈ 14 డిమాండ్లు పై జాతీయ స్థాయి ఉద్యమామ్ చేపట్టాలని నిర్ణయించారు.
ఈ సమావేశానికి నీల వెంకటేష్
రాష్ట్ర అధ్యక్షులు - బి.సి యువజన సంఘం
పీలం వెంకటేష్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ జిల్లా సంక్షేమ సంఘం అధ్యక్షుడు గుండు వెంకటేశ్వర్లు రాష్ట్ర అధ్యక్షులు సింగం లక్ష్మి మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు కదిరి జిల్లా కార్యదర్శి బక్కతట్ల వెంకన్న యాదవ్ జిల్లా ఉపాధ్యక్షుడు ఖమ్మంపాటి దుర్గా వల్ల కీర్తి శ్రీనివాస్ పగిళ్ల కృష్ణ పున్న వీరేశం వనం లలిత సతీష్ యాదవ్ చెరుపల్లి సదానందు కర్నాటి మచ్చ గిరి గడ్డం దశరథ గోడ శివ కల్లూరి రమణ తదితరులు పాల్గొన్నారు.
Jan 22 2024, 15:02