/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png
ఫ్రీ బస్సులో సీటు కోసం మళ్ళీ శిఖలు పట్టుకొని కొట్టుకున్న మహాలక్ష్మిలు
రేషన్ డీలర్ల నియామకాలకు నోటిఫికేషన్.. అర్హతలివే
నల్లగొండ డివిజన్‌లోని 20 గ్రామాల్లో ఖాళీగా ఉన్న రేషన్ డీలర్ల పోస్టుల భర్తీకి ఆర్డీఓ రవి శనివారం నోటిఫికేషన్ జారీ చేశారు.
చిట్యాల మండలంలోని వట్టిమర్తి, తాళ్లవెల్లెంల, వేంబాయి, కనగల్ మండలంలోని తుర్కపల్లి, లచ్చుగూడెం, కట్టంగూర్ మండలంలోని ఊదులూరు, నారగూడెం, పామనుగుండ్ల, యరసానిగూడెం, కేతేపల్లి మండలంలోని ఇనుపాముల, నకిరేకల్ మండలంలోని చందుపట్ల, తాటికల్, నల్లగొండ మండలంలోని పానగల్,
నార్కట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టు, శాలిగౌరారం మండలంలోని అంబారిపేట, ఊట్కూరు, ఉప్పలంచ, తిప్పర్తి మండలంలోని అనిశెట్టి దుప్పలపల్లి, రామలింగాలగూడెం, రాజుపేట గ్రామాల్లో ఖాళీలు ఉన్నట్లు తెలిపారు.
అర్హత ఉన్నవారు రిజర్వేషన్ల వారీగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సంబంధిత గ్రామంలో నివసిస్తూ పదో తరగతి అర్హత ఉండి 18 నుంచి 40ఏండ్ల వయసు వారు, ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఏ ఇతర వ్యాపారాలు లేనివారు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.
బోర్డర్ పోస్టులకు అత్యాధునిక 4జీ సౌకర్యం: కేంద్ర హోంశాఖ
పొరుగుదేశాలతో సరిహద్దులు పంచుకొంటున్న ప్రాంతాల్లోని దాదాపు 1,117 బోర్డర్ పోస్టులకు అత్యాధునిక 4జీ మొబైల్ కమ్యూనికేషన్ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది..
దీనికి సుమారు రూ.1,545.66 కోట్లు ఖర్చవుతాయని ఆ శాఖ తెలిపింది. ఈ మేరకు టెలికాం శాఖ, హోంశాఖ, బీఎస్‌ఎన్‌ఎల్ మధ్య త్రైపాక్షిక ఒప్పందంపై సంతకాలు చేసినట్లు వెల్లడించింది.
ఈ ప్రాజెక్టు వచ్చే ఆరున్నరేళ్లలో పూర్తి కానుంది. వీటిల్లో కొన్ని సాయుధ దళాలకు చెందిన ఇంటెలిజెన్స్ పోస్టులు కూడా ఉండనున్నాయి..
కేంద్రం చేపట్టిన 4జీ సాచురేషన్ ప్రాజెక్టులో భాగంగా లద్దాఖ్‌లో మొత్తం 379 గ్రామాలు, మారుమూల ప్రాంతాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం వీటిల్లో తొమ్మిది గ్రామాల్లోనే పనులు పూర్తయ్యాయి. మరో 34 చోట్ల ప్రారంభ దశలో ఉన్నాయి. మయన్మార్‌తో 2.4 కి.మీ, పాక్‌తో ఉన్న 18 కి.మీ సరిహద్దులో గతేడాది ఫెన్సింగ్ పని కూడా పూర్తి చేశారు..
దేశంలో కొత్తగా 636 కరోనా కేసులు
ఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 636 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,394కు చేరుకుంది..
కరోనా బారినపడి తాజాగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,33,364కు చేరుకుంది.
నిన్నటితో పోలిస్తే కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది. ఆదివారం ఒక్కరోజే 841 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. దేశంలో గత 227 రోజుల గరిష్ఠానికి కేసుల సంఖ్య పెరిగింది.
గత 24 గంటల్లో కోవిడ్ -19 నుండి 548 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 4.44 కోట్లకు పెరిగింది. జాతీయ రికవరీ రేటు 98.81 శాతం కాగా, కేసు మరణాల రేటు 1.18 శాతంగా నమోదైంది..
అటు.. జేఎన్.1 వేరియంట్ దేశంలో వ్యాప్తి చెందుతోంది. ఇప్పటివరకు తొమ్మిది రాష్ట్రాల్లో వెలుగు చూసిన ఈ వైరస్ కేసులు 47కి చేరుకున్నాయి. అత్యధికంగా గోవాలో 78 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కేరళలో 41 కేసులు బయటపడ్డాయి..
PSLV-C58 Launch: నేడు నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ-సీ58!
ISRO to Launch PSLV-C58 Mission Today: న్యూఇయర్ వేళ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్దమైంది. నేడు పీఎస్‌ఎల్‌వీ-సీ58 వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లనుంది..
ఆదివారం ఉదయం 8:10 గంటలకు ప్రారంభమవ్వగా.. 25 గంటల కౌంట్‌డౌన్ అనంతరం సోమవారం ఉదయం 9:10 గంటలకు షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి దూసుకెళ్లనుంది..
పీఎస్‌ఎల్‌వీ-సీ58 ద్వారా మన దేశానికి చెందిన 480 కిలోల బరువు గల ఎక్స్ రే పొలారి మీటర్ శాటిలైట్ (ఎక్స్‌పోశాట్) ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపుతున్నారు. భారత అంతరిక్ష చరిత్రలో తొలి పొలారిమీటర్ మిషన్ ఇదే కావడం విశేషం. ప్రయోగం తర్వాత 21 నిమిషాలకు ఎక్స్‌పోశాట్ నిర్ణీత కక్ష్యలోకి చేరుతుంది.
అనంతరం రాకెట్‌లో నాలుగో స్టేజ్ అయిన పీఎస్4.. అక్కడి నుంచి దిగువ కక్ష్యకు వస్తుంది. ఇందులో విమెన్ ఇంజినీర్డ్ శాటిలైట్ సహా వివిధ ఉపకరణాలు ఉంటాయి. వీటి సాయంతో శాస్త్రవేత్తలు పలు అంశాలపై అధ్యయనం చేయనున్నారు..
తెలంగాణ ఎన్నికల బరిలో బర్రెలక్క నామినేషన్
హాయ్ ఫ్రెండ్స్.. బర్లు కాయనికి వచ్చిన ఫ్రెండ్స్.. ఎంత చదివిన కానీ డిగ్రీలు డిగ్రీలు పట్టాలొస్తున్నాయి గానీ.. జాబులు మాత్రం వస్తలేవ్వు.. నోటిఫికేషన్ వెయ్యరు ఏం వెయ్యరు.. అందుకే మా అమ్మను అడిగి..నాలుగు బర్రెలు కొన్నా..అంటూ ఓ అమ్మాయి చెప్పే వీడియో.. అప్పట్లో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది గుర్తుందా.
బర్రెలక్కగా తెగ ఫేమస్ అయిపోయిన ఈ యువతి ఇప్పడు తెలంగాణలోని ప్రధాన పార్టీలకు సవాల్ విసురుతోంది. నిరుద్యోగ యువతిగా ఇన్‌స్టా గ్రాంలో ఓ చిన్న సెటైరికల్ వీడియోతో ప్రభుత్వంపై తనకున్న అసహనాన్ని వ్యక్తం చేసిన శిరీష అలియాస్ బర్రెలక్క.. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల బరిలో దిగుతోంది.
మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన శిరీష.. అదే నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బుధవారం ఉదయం నామినేషన్ వేసింది.
తెలంగాణ నిరుద్యోగినిగా కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి నామినేషన్ వేసినట్టు బర్రెలక్క తెలిపింది. అయితే.. తాను అన్ని పార్టీల అభ్యర్థులలాగా ఇంటింటికీ తిరిగి ప్రచారం చేయలేకపోవచ్చని.. డబ్బు పంచలేకపోవచ్చని తెలిపింది.
కానీ ప్రజలు ఏది మంచి ఏది చెడు ఆలోచించాలని... తన ప్రజల సపోర్ట్ ఉంటుందని శిరీష విజ్ఞప్తి చేసింది.అయితే.. ప్రభుత్వ ఉద్యోగాలను అప్లై చేసుకుని, కోచింగ్ కూడా తీసుకుని కష్టపడి చదివినా నోటిఫికేషన్లు రాకపోవటంతో.. ప్రభుత్వంపై ఉన్న అసహనాన్ని శిరీష ఓ చిన్న వీడియో ద్వారా చెప్పి దాన్ని ఇన్ స్టాలో సరదాగా పోస్ట్ చేసింది.
అయితే.. ఆ సమయంలో శిరీష వీడియోను నిరుద్యోగులతో పాటు ప్రతిపక్షాలు కూడా వైరల్ చేసి.. ప్రభుత్వాన్ని విమర్శించాయి. దీంతో.. ఆ వీడియోతో పాటు అందులో ఉన్న శిరీష కూడా రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోయింది.
తెలంగాణ రాష్ట్రంలో కరెంటు బాధ లేదు నీళ్ల బాధ లేదు: సీఎం కేసీఆర్
గతంలో వ్యవసాయం చేసుకునే కుటుంబాలకు, ఆ రైతులకు ఎవ్వరూ పిల్లను ఇవ్వకపోయేటోళ్లు అని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అని ముఖ్యమంత్రి కేసీఆర్ కేసీఆర్ అన్నారు.ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నారా..? భూమి ఉందా? అని అడిగి పిల్లను ఇస్తున్నారని కేసీఆర్ పేర్కొన్నారు.
సిర్పూర్ కాగజ్‌నగర్ నియోజకవర్గంలో బుధవారం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు కాగజ్‌నగర్ ఎట్ల ఉండేనో.. తెలంగాణ అట్లనే ఉండే. రైతుల ఆత్మహత్యలు, ఆకలి చావులు, పరిశ్రమలు మూతపడటం రకరకాల ఇబ్బంది చూశాం. పొట్ట చేతపట్టుకుని వలసలు పోయారు. ఈ పదేండ్లలో ఒకటి ఒకటి బాగు చేసుకుంటూ ముందుకు పోతున్నాం. మంచినీళ్ల సమస్య లేదు. సిర్పూర్ గురించి మంచం పట్టిన మన్యం అని వార్తలు వచ్చేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.అన్నారు
తెలంగాణ లో లంబాడీ, ఆదివాసీ గూడెంలకు భగీరథ నీళ్లు వస్తున్నాయి. కరెంట్ బాధ కూడా లేదు. ఇవాళ 24 గంటలు కరెంట్ ఇచ్చుకుంటున్నాం. ఏ ఒక్క రాష్ట్రంలో కూడా 24 గంటల కరెంట్ లేదు. అన్ని వర్గాలకు కరెంట్ ఇస్తున్నది తెలంగాణ రాష్ట్రం మాత్రమే. ఇలా సమస్యలు పరిష్కరించుకున్నాం. పేదలకు అన్ని విధాలుగా ఇప్పుడిప్పుడే అన్ని చేసుకుంటున్నాం.అని అన్నారు.
ఆరోగ్యం దృష్ట్యా కూడా మంచి పనులు చేపట్టాం. గవర్నమెంట్ హాస్పిటల్‌లో కేసీఆర్ కిట్, అమ్మ ఒడి వాహనాలు ఏర్పాటు చేశాం. ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాలు అవుతున్నాయి. ప్రయివేటు ఆస్పత్రుల దోపిడీ తగ్గింది అని కేసీఆర్ తెలిపారు.
గురుకుల పిల్లలు ఇంజినీర్లు, డాక్టర్లు అవుతున్నారు..
విద్యా వ్యవస్థను బాగు చేసుకున్నాం. గురుకుల విద్యాసంస్థలు నెలకొల్పాం. కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేసుకుంటున్నాం. ముస్లిం, బీసీ, ఎస్సీ, ఎస్టీల కోసం గురుకులాలు పెట్టుకున్నాం. ఆ పాఠశాలలో చదువుకునే విద్యార్థుల మీద లక్షా 20 వేలు ఖర్చు పెడుతున్నాం. గురుకులాల్లో చదివిన విద్యార్థులు డాక్టర్లు ,ఇంజినీర్లుగా తయారవుతున్నారు అని కేసీఆర్ పేర్కొన్నారు.
ఇవాళ భూమి విలువ పెరిగింది..
తెలంగాణ అంటేనే వలస పోవుడు. ఇవాళ రైతాంగం బాగుపడాలని, వ్యవసాయాన్ని స్థీరికరించాలని చాలా మంచి పనులు చేశాం. నాలుగైదు సౌకర్యాలు కల్పించాం. గతంలో రైతుకు పిల్లను ఇవ్వకపోయేటోడు. చివరకు చప్రాసీ ఉద్యోగం ఉన్నవారికి ఇచ్చేవారు. ఇవాళ రైతుకు పిల్లను ఇస్తున్నారు.
భూమి ఉందా అని అడుగుతున్నారు. ఎందుకంటే వ్యవసాయం విలువ భూమి విలువ పెరిగింది. నీటి కొరత లేదు. ప్రాజెక్టుల ద్వారా ఇచ్చే నీళ్లకు ట్యాక్స్ లేదు. బకాయిలు రద్దు చేసుకున్నాం. రైతులు దర్జాగా వ్యవసాయం చేసుకుంటున్నారు. పెట్టుబడికి ఇబ్బంది ఉండొద్దని రైతుబంధు ఇస్తున్నాం.ఈ పథకం పేద రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది అని సీఎం స్పష్టం చేశారు.
రైతులు సంతోషంగా ఉన్నారు..
వడ్లు పండితే ఏ ఊరికి ఆ ఊర్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొంటున్నాం. రైతులకు కనీస మద్దతు ధర ఇస్తున్నాం. దళారీ రాజ్యం ఉండొద్దని చెప్పి ధరణి పోర్టల్ తెచ్చి రైతుల భూములను రక్షించాం.
ఈ నియోజకవర్గంలో 16 వేల ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చాం. గిరిజనులపై ఉన్న కేసులు ఎత్తేశాం. రైతుబంధు ఇచ్చాం. గిరిజనేతర బిడ్డలకు కూడా పట్టాలు వస్తాయి. దానికి ఆటంకం కేంద్ర ప్రభుత్వమే. కఠినమైన రూల్స్ పెట్టారు.
లెక్కలు తీసి కేంద్రానికి పంపించాం. ఎన్నికల తర్వాత పోరాటం చేసి గిరిజనేతరులకు కూడా పట్టాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం. మొత్తానికి ఇవాళ రైతుల ముఖాలు తెల్లపడ్దాయి. అప్పులు లేవు. రైతులు సంతోషంగా ఉన్నారు అని కేసీఆర్ తెలిపారు. అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని టిఆర్ఎస్ పార్టీకి మరో అవకాశం ఇవ్వాలని కెసిఆర్ కోరారు..
ట్యాంక్ బండ్ పైన కేక్ కటింగ్ వేడుకలు నిషేధం
హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ట్యాంక్ బండ్‌పై జన్మదిన వేడుకల సందర్భంగా అర్ధ రాత్రి కేక్ కటింగ్ వేడుకలపై జీహెచ్‌ఎమ్ సీ నిషేధం విధించింది.
ఇలా వేడుకలను జరుపుకుంటున్న వారందరు మద్యం బాటిళ్లు, మాంసం, ఇతర వ్యర్థాలను పడేయడం తో అపరిశుభ్రత నెలకొటుంది.
అదే విధంగా నీళల్లో చెత్తా చెదారం వేసినా చర్యలు ఉంటాయని జీహెచ్ ఎమ్‌సీ అధికారులు హెచ్చరిక బోర్డును ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేశారు.
సీసీ కెమెరాలు ఉన్నాయని ఎవరు కూడా ఈ నిషేదాజ్ఞాలు ఉల్లగించినా వారిని రికార్డయినా దృశ్యాలతో గుర్తించి చర్యలు తీసుకుంటామని జీ హెచ్‌ఎమ్‌సీ అధికారులు పేర్కొన్నారు.
తెలంగాణ ఎన్నికల్లో నేపథ్యంలో ఈసీ కీలక నిర్ణయం
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (Telangana Assembly Election) నేపథ్యంలో ఎన్నికల కమిషన్ (Election Commission) కీలక నిర్ణయం (key Decision) తీసుకుంది..
ఓటు వేయలేని వారికి సహాయకుడిగా వచ్చే వారి కుడి చేతి చూపుడు వేలుకు ఇకపై ఇంకు పెట్టాలని నిర్ణయించింది.
సహాయంగా వచ్చే వ్యక్తి కూడా అదే బూత్‌కు చెందిన ఓటరై ఉండాలని, అతను ఓటు వేశాకే మరొకరికి సహాయకుడిగా వెళ్లాలని ఈసీ స్పష్టం చేసింది..
ఓటు వేసేటప్పుడు ఎడమ చేయి చూపుడు వేలుకు ఇంకు పెడతారని వివరించింది. కాగా ఈసారి ఉదయం 5.30 గంటల నుంచే మాక్ పోలింగ్ (Mock Polling) ప్రారంభిస్తారని, పోలింగ్ ఏజెంట్లుగా సర్పంచ్, వార్డు సభ్యులు కూడా కూర్చోవచ్చునని ఎన్నికల కమిషన్ పేర్కొంది..
Jan 01 2024, 19:53