ఘనంగా కొరివి కృష్ణ స్వామి ముదిరాజ్ వర్దంతి జరుపుకున్న ముదిరాజులు
పాత్రికేయుడు హైదరాబాద్ నగర రూపకర్త కొరివి కృష్ణ స్వామి ముదిరాజ్!
కృష్ణ స్వామి ముదిరాజ్ వర్దంతి సందర్భంగా నివాళులు అర్పించిన ముదిరాజులు
జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్
ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు
తేది: 19-12-2023 మంగళవారం
చిన్నకోడూర్ న్యూస్
పాత్రికేయ సంపాదకుడు హైదరాబాద్ మాజీ మేయర్ కొరివి కృష్ణ స్వామి ముదిరాజ్ గారు ప్రజా సేవ చేస్తూనే ముదిరాజ్ హక్కుల సాధన కోసం పోరాటం చేసిన మహోన్నతుడు అని ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ గారు అన్నారు.
కృష్ణ స్వామి ముదిరాజ్ 56వ వర్దంతి సందర్భంగా చిన్నకోడూర్ మండల కేంద్రంలో అయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ కొర్వి కృష్ణ స్వామి ముదిరాజ్ గారు 1922లో నిజాం రాజ్య కాలంలో ముదిరాజ్ మహాసభను స్థాపించారు తరువాత 40 సంవత్సరాల పాటుగా మహాసభకు అధ్యక్షుడిగా ఉన్నారు మరియు ముదిరాజ్ సంఘం మరియు నగరంలోని ఇతర బలహీన వర్గాలకు విద్యారంగంలో చాలా శ్రమించారు. అతను అనేక గ్రంథాలయాలను కూడా స్థాపించడమే కాకుండా స్త్రీ అక్షరాస్యతను ప్రోత్సహించడానికి హిందీ కన్యా పాఠశాలను ఏర్పాటు చేశాడు.
ఆయన మేయర్‌గా ఉన్న సమయంలోనే హైదరాబాద్‌కు మాస్టర్‌ప్లాన్‌ను ఖరారు చేశారు. హైదరాబాద్ మేయర్‌గా అప్పటి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూను ఆహ్వానించారు మరియు యుగోస్లేవియా అధ్యక్షుడు మార్షల్ టిటోకు పౌర రిసెప్షన్‌ను నిర్వహించారు.
అంతకు ముందు డక్కన్ స్టార్', ఆంగ్ల వారపత్రిక మరియు 'మసావత్', ఉర్దూ వారపత్రికలకు సంపాదకులుగా పనిచేశారు అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం గ్రామ అధ్యక్షుడు చింతకింది ప్రభాకర్, పిట్ల నాగార్జున, కోరమేన సుధాకర్, దొంతురమేన శ్రీనివాస్, అంబటి కనకయ్య, జంగిటి ప్రభాకర్, గుడిపల్లి వికాస్, గౌరమేన స్వామి, దయ్యాల నాగరాజు తదితరులు వున్నారు.
Dec 22 2023, 13:53