పోలీస్ కిష్టయ్య ముదిరాజ్ ప్రణత్యాగమే నేటి ఆకుపచ్చ తెలంగాణ! జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్
పోలీస్ కిష్టయ్య ముదిరాజ్ ప్రణత్యాగమే నేటి ఆకుపచ్చ తెలంగాణ!
తేది: 01-12-2023 శుక్రవారం
చిన్నకోడూర్ న్యూస్
స్వరాష్ట్రం ఏర్పడి ఆకుపచ్చ పసిడి తెలంగాణగా దూసుకు పోతుందంటే అది పోలీస్ కిష్టన్న ప్రాణ త్యాగ ఫలితమే నని ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ గారు అన్నారు.
పోలీస్ కిష్టన్న14వ వర్దంతి సందర్భంగా చిన్నకోడూర్ ముదిరాజ్ ఫంక్షన్ హాల్లో మండల అధ్యక్షుడు మేడికాయల వెంకటేశం ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో ముదిరాజ్ సభ్యులు కిష్టన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు ఈ సందర్భంగా జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ మాట్లాడుతూ సమాఖ్య రాష్ట్రంలో సీమాంధ్ర పాలకుల నీడన తెలంగాణ నెర్రెలు వారి తలపున గోదావరి గలగలా పారిన తాగడానికి గుక్కెడు నీళ్ళు దొరుకని సమయాన స్వరాష్ట్రం కోరుతు మాలి దశ ఉద్యమం చేస్తున్నపుడు రాష్ట్రం సిద్దించేవరకు పోరాటం అగకూడాని నినదిస్తూ తన సర్వీస్ రివల్ వార్ తో కాల్చుకొని ప్రాణత్యాగం చేసిన తొలి అమరుడు పోలీస్ కిష్టన్న ముదిరాజ్ అయన ప్రాణత్యాగంతో ఉద్యమాన్ని సకలజనుల సమ్మేగా మారిందని అసమ్మే ద్వార కేంద్ర ప్రభుత్వాన్ని ఊపిరాడకుండా చేసిందని తట్టుకోలేక కేంద్రం తెలంగాణ ప్రకటించిందని అన్నారు.
తెచ్చుకున్న తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించుకో తాగు సాగు నీరు తెచ్చుకున్నామని ప్రాజెక్టుల ద్వార నెర్రెలు వారిని బీడు భూములు నేడు సశ్యశమలమై పచ్చని పసిడి తెలంగాణగా మారిందని దీనికి కారణం మీ ప్రణత్యాగమని కిష్టన్న మిమ్ములను జాతి మరువదని అన్నారు.
ఈ కార్యక్రమంలో కోరబోయిన సుధాకర్, కొత్త బాల్ రాజు, ఇట్టబోయిన బాలపోషయ్య, బోయిని ఆనందం, పసుపుల సాయిలు, ముత్తయ్య, బుచ్చెలిరమేష్, దుర్గం ఎల్లం, ఉప్పరమేన శంకర్, రామంచ రాములు, ఇట్టబోయిన లక్ష్మణ్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
Dec 11 2023, 23:05