తెలంగాణ తొలి ఉద్యమకారుడు నెల్లి లక్ష్మీనారాయణ ముదిరాజ్! జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు
తెలంగాణ తొలి ఉద్యమకారుడు నెల్లి లక్ష్మీనారాయణ ముదిరాజ్!
జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్
ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు
తేది: 07-11-2023 మంగళవారం
రంగదాంపల్లి సిద్దిపేట న్యూస్
హైదరాబాద్ మాజీ మేయర్ మహారాజ్ గంజి మాజీ శాసనసభ్యులు నెల్లి లక్ష్మీనారాయణ ముదిరాజ్ గారి జయంతి పురస్కరించుకొని పట్టణ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు మిద్దె రవి ముదిరాజ్ గారి అధ్యక్షతన లక్ష్మీనారాయణ ముదిరాజ్ గారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్, సిద్దిపేట నియోజకవర్గ జేఏసీ చైర్మన్ పడిగే ప్రశాంత్ ముదిరాజ్, సోషల్ మీడియా జిల్లా చేర్మెన్ సుతారి రాజు ముదిరాజ్ లు మాట్లాడుతూ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షునిగా, హైదరాబాద్ నగర మేయర్ ఉన్న నెల్లి లక్ష్మీనారాయణ ముదిరాజ్ గారు 1969లో తెలంగాణ ఏర్పాటు కోసం జరిగిన తొలి ఉద్యమంలోనే ఆయన కీలక భూమిక పోషించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమం చేశాడని అప్పటికే హైదరాబాద్ మేయర్ గా ఆయన ఉన్నాడని పదవి సైతం పక్కనపెట్టి తెలంగాణ కోసం పోరాటము చేసిన గొప్ప ఉద్యమకారుడు అని వారు అన్నారు.
అదేవిధంగా ఆయన మహారాజ్ గంజి శాసన సభ్యునిగా ఓ పర్యాయము కూడా ఉన్నాడని ఆ సమయంలోనే ముదిరాజుల హక్కుల కోసం పోరాటం చేస్తూ ముదిరాజులకు రిజర్వేషన్ కల్పించాలని కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మత్స్య శాఖలో ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అప్పటి ప్రభుత్వం పైన పోరాటం చేసిన మహానియుడని అన్నారు.
తెలంగాణ కోసం పోరాటం చేసిన ముదిరాజ్ బిడ్డల విగ్రహాలను ట్యంక్ బండ్ పైన ప్రభుత్వం ఏర్పాటు చేయాలనీ డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పైస రామకృష్ణ, చెంది శ్రీనివాస్, పుల్లూరి సుధాకర్, తోడేంగల నవీన్, యాట రాజేష్, కొంతం శ్రావణ్, ఈర్ల సత్యం ముదిరాజ్, గాడిచర్ల యాదగిరి, జీకురి శ్రీనివాస్, వెంకటస్వామి ముదిరాజ్ సంఘం సభ్యులు పాల్గొన్నారు.
Dec 01 2023, 19:38