Chandrababu: ఎల్వీప్రసాద్ ఆస్పత్రికి చంద్రబాబు.. కొనసాగుతున్న కంటి ఆపరేషన్
హైదరాబాద్: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) మంగళవారం ఉదయం ఎల్వీప్రసాద్ ఆస్పత్రికి (LV Prasad Hospital) చేరుకున్నారు..
ప్రస్తుతం చంద్రబాబుకు ఎల్వీప్రసాద్ వైద్యులు కంటికి శస్త్ర చికిత్స చేస్తున్నారు. నిన్న(మంగళవారం) ఏఐజీ ఆస్పత్రిలో (AIG Hospital) టీడీపీ అధినేతకు వైద్యులు చర్మ సంబంధిత పరీక్షలు నిర్వహించారు.
కాగా.. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన అనంతరం చంద్రబాబుకు వైద్య పరీక్షలు అవసరం వైద్యులు సూచించడంతో ఆ తరువాతి రోజు టీడీపీ అధినేత హైదరాబాద్‌కు వచ్చారు.
రెండు రోజుల పాటు ఏఐజీ ఆస్పత్రిలో టీడీపీ చీఫ్ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం ఎల్వీ ప్రసాద్‌కు వెళ్లగా బాబుకు వైద్యులు కంటికి సంబంధించిన పరీక్షలు చేశారు. ఈరోజు బాబు కంటికి శస్త్ర చికిత్స చేస్తామని వైద్యులు తెలిపారు. అలాగే నిన్న మరోసారి ఏఐజీ ఆస్పత్రికి వెళ్లిన చంద్రబాబుకు అక్కడి వైద్యులు చర్మ సంబంధిత పరీక్షలు చేశారు. ప్రస్తుతం నేడు ఎల్వీప్రసాద్ ఆస్పత్రిలో చంద్రబాబు కంటి శస్త్ర చికిత్స కొనసాగుతోంది. జూన్‌లో ఎడమ కంటికి చంద్రబాబు సర్జరీ చేయించుకున్న విషయం తెలిసిందే..












Nov 07 2023, 13:40
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
4.8k