/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz పరీక్షలు కూడా సరిగ్గా నిర్వహించలేని దద్దమ్మ సర్కార్ మనకెందుకు: బండి సంజయ్ Yadagiri Goud
పరీక్షలు కూడా సరిగ్గా నిర్వహించలేని దద్దమ్మ సర్కార్ మనకెందుకు: బండి సంజయ్

బీఆర్ఎస్ పార్టీని ఈ ఎన్నికలలో చిత్తుగా ఓడిస్తే గాని నిరుద్యోగులకు న్యాయం జరగదని,బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ నిరుద్యోగులకు సూచించారు.

మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిరుద్యోగులు గత పదేళ్లుగా పడ్డ కష్టాలు మర్చిపోవద్దన్నారు. పరీక్షలు కూడా సరిగ్గా నిర్వహించలేని దద్దమ్మ సర్కార్ బీఆర్ఎస్ అని ధ్వజమెత్తారు.

నిరుద్యోగుల కోసం బీజేపీ నేతలు జైలుకు వెళ్లారని గుర్తు చేశారు. రాష్ట్రంలో 50 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు వీరంతా బుద్ధి చెప్పాలని కోరారు. తెలంగాణలో బీజేపీ గెలుస్తుందని సీఎం కేసీఆర్‌కు భయం పట్టుకుందన్నారు.

మంత్రి కేటీఆర్‌కు అహంకారం ఎక్కువైందని విమర్శించారు.కేటీఆర్ జాబ్ క్యాలెండర్‌పై ఇప్పుడు హామీలు ఇస్తున్నాడు.. పది సంవత్సరాల నుండి జాబ్ క్యాలెండర్ ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్నించారు.

బీజేపీ అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని.. సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో నేను గెలవకుండా కేసీఆర్ ప్లాన్ చేశారని ఆరోపించారు.

తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని బండి దీమా వ్యక్తం చేశారు.

నిమ్మకు నీరెట్టినట్టు గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ అధికారులు

•ధర్మారంలో పందులు విచ్చల విడిగా తిరుగుతూ స్స్వైర విహరం

నిమ్మకు నీరెట్టినట్టు గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ అధికారులు అని 16 డివిజన్ ధర్మారం స్థానికుడైన గట్టు నరేష్ గౌడ్ దుయ్యపట్టాడు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీ చట్ట ప్రకారం మున్సిపాలిటి& గ్రామాలలో బహిరంగ (వీదులలో) పందుల పెంపకం అనేది నిషేధం విధిస్తు చట్టం తీసుకొచ్చింది.. ఇప్పుడు గ్రేటర్ వరంగల్ 16 వ డివిజన్ ధర్మారంలో పందులు విచ్చల విడిగా తిరుగుతూ స్స్వైర విహరం చేస్తున్నా చొద్యం చూస్తున్న మున్సిపాలిటి అధికారులు

తక్షణమే పందుల నిర్వహితులపై చర్యలు తీసుకొని పందల నివారణకు చొరువ తీసుకొని సీజన్ వ్యాదుల నుండి డివిజన్ ప్రజలను కాపాడవలసిన బాధ్యత గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటి అధికారులపై ఉంధి అని లేని యడల మున్సిపాలిటి ఆవరణాలో పందులను తీసుకొచ్చి వదులుతామని హెచ్చరించాడు...

నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాకు రానున్న కేటీఆర్

బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు.

ఇవాళ కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తారు. ఈ నేపథ్యంలో ఉదయం సిరిసిల్ల తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీలో చేరికల కార్యక్రమంలో పాల్గొంటారు.

ఉదయం 10.30 గంటలకు వివిధ పార్టీలకు చెందిన ముఖ్యయనాయకులు కేటీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరనున్నారు.

అనంతరం 11 గంటలకు వేములవాడ, మధ్యాహ్నం 2 గంటలకు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నిర్వహించే యువ ఆత్మీయ సమ్మేళనాలకు హాజరుకానున్నారు.

నేడు నాలుగు నియోజకవర్గాల్లో కెసిఆర్ పర్యటన

ఉమ్మడి పాలమూరు జిల్లాలో సోమవారం ఒకే రోజు బీఆర్ఎస్ నాలుగు నియోజకవర్గాలలో ఎన్నికల ప్రచార సభలు నిర్వహించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఇప్పటికే ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొదటి దఫా ఎన్నికల ప్రచారం పూర్తి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ రెండవ విడతగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో రెండవసారి పర్యటనకు రానున్నారు.

ఈ మేరకు దేవరకద్ర, గద్వాల, మక్తల్, నారాయణపేట అసెంబ్లీ నియోజకవర్గాలలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనలు ఖరారు అయ్యాయి. కేసీఆర్ రాక సందర్భంగా స్థానిక ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ అభ్యర్థులు ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

ఉమ్మడి పాలమూరు జిల్లా దేవరకద్ర, గద్వాల, మక్తల్, నారాయణపేట అసెంబ్లీ నియోజకవర్గాలలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనల సందర్భంగా ఎమ్మెల్యేలు సభ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశారు.

ఈ సభలకు ఊహించని విధంగా జనాలను సేకరించేలా ఇప్పటికే ఎమ్మెల్యేలు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేశారు. దేవరకద్రలో జరిగే కార్యక్రమాలను ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు.

ఉదయం 11 గంటల ప్రాంతంలో జరిగే ఈ సభకు జనాన్ని భారీగా తరలించేలా ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఆయా మండలాల ప్రజాప్రతినిధులు పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలకు ఆదేశాలు జారీ చేశారు.

గద్వాలలో ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, మక్తల్‌లో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, నారాయణపేటలో ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి సారథ్యంలో ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఎన్నికల సమయంలో పరిస్థితులను తమకు పూర్తిగా అనుకూలంగా మలుచుకునే విధంగా ఎమ్మెల్యేలు సన్నద్ధం అయ్యారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనే సభలకు జనాన్ని భారీగా తీసుకువచ్చేలా ఇప్పటికే ముఖ్య నాయకులు కార్యకర్తలకు ఎమ్మెల్యేలు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం జరగనున్న సభలను దిగ్విజయం చేయాలన్న సంకల్పంతో ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు...

జగత్ విజేతగా టీమిండియా

స్వదేశంలో జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ వరుసగా ఎనిమిదో విజయం ఖాతాలో వేసుకుంది.

కష్టతరమైన పిచ్‌పై బ్యాటర్ల మొక్కవోని దీక్షకు.. బౌలర్ల సహకారం తోడవడంతో టీమ్‌ఇండియా అజేయంగా నిలిచింది. ఆదివారం కోల్‌కతా ఈడెన్‌ గార్డెన్స్‌లో జరిగిన పోరులో రోహిత్‌ సేన 243 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తుచేసింది.

టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. తన 35వ పుట్టినరోజు నాడు బర్త్‌డే బాయ్‌ విరాట్‌ కోహ్లీ (121 బంతుల్లో 101 నాటౌట్‌; 10 ఫోర్లు) సూపర్‌ సెంచరీతో కదంతొక్కితే.. శ్రేయస్‌ అయ్యర్‌ (77; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) అతడికి అండగా నిలిచాడు.

కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (24 బంతుల్లో 40; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) జట్టుకు మెరుపు ఆరంభాన్నివ్వగా.. రవీంద్ర జడేజా (15 బంతుల్లో 29 నాటౌట్‌; 3 ఫోర్లు, ఒక సిక్సర్‌) అద్భుత ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎంగిడి, జాన్సెన్‌, రబడ, కేశవ్‌ మహరాజ్‌, షంసీ తలా ఒక వికెట్‌ పడగొట్టారు.

అనంతరం లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా 27.1 ఓవర్లలో 83 పరుగులకు ఆలౌటైంది. నలుగురు మాత్రమే రెండంకెల స్కోరు చేయగా.. ఒక్కరు కూడా 15 పరుగుల మార్క్‌ దాటలేకపోయారు.

వరల్డ్‌కప్‌లో సెంచరీల మోత మోగిస్తున్న డికాక్‌ (5), బవుమా (11), డసెన్‌ (13), మార్క్మ్‌ (9), క్లాసెన్‌ (1), మిల్లర్‌ (11), జాన్సెన్‌ (14) ఇలా ఒకరి వెంట ఒకరు పెవిలియన్‌కు క్యూ కట్టారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 5 వికెట్లు పడగొడితే.. మహమ్మద్‌ షమీ, కుల్దీప్‌ యాదవ్‌ చెరో రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నారు.

రికార్డు సెంచరీ బాదిన కోహ్లీకి ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది. టీమ్‌ఇండియా తమ చివరి లీగ్‌ మ్యాచ్‌ వచ్చే ఆదివారం నెదర్లాండ్స్‌తో తలపడనుంది...

నేడు సత్యసాయి జిల్లాలో తెలుగుదేశం బృందం పర్యటన

ఉమ్మడి అనంతపురం జిల్లాలో తెలుగుదేశం బృందం సోమవారం పర్యటించనుంది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో దెబ్బతిన్న పంటలను పరిశీలించడానికి రాష్ట్ర టీడీపీ వ్యవసాయ కమిటీ బృందం నిర్ణయించింది.

వివరాలు

సోమవారం ఉదయం 10:40 గంటలకు ఉరవకొండ నియోజకవర్గం, కూడేరు మండలం, ఇప్పేరు సమీపంలో వేరుశనగ, ఉలవ పంటలను పరిశీలించనున్నారు. మధ్యాహ్నం 1:30 గంటలకు శ్రీసత్యసాయిజిల్లా పెనుకొండ నియోజకవర్గంలో పర్యటిస్తారు. 2:30 గంటలకు రొద్దం మండలం, చోళేమర్రి క్రాస్‌లో వేరుశనగ పొలం పరిశీలిస్తారు.

సాయంత్రం 3:30 గంటలకు మడకశిర మండలం, కోడిగానిపల్లి సమీపంలో పంటలను పరిశీలించి.. వసల వెళ్ళిన వ్యవసాయ కూలీల కుటుంబసభ్యులతో టీడీపీ బృందం సమావేశమై.. వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు.

కాగా అనంత ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌లో కరువు పరిశీలించేందుకు ఆదివారం రాత్రి జిల్లాకు వచ్చిన టీడీపీ రాష్ట్ర బృందం నాయకులకు ఘన స్వాగతం లభించింది.

ఆ బృందంలో మాజీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు, సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ఉన్నారు.

స్థానిక మాసినేని హోటల్‌ వద్ద టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌ చౌదరి, గంజే నాగరాజు, నాయకులు సరిపూటి రమణ, నారాయణస్వామి యాదవ్‌, బ్రహ్మయ్య, షణ్ముఖ, రజాక్‌, సరిపూటి శ్రీకాంత స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.

మంచిర్యాల జిల్లా మాజీ మంత్రి కాంగ్రెస్ కు రాజీనామా?

ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి బోడ జనార్దన్ ఆదివారం కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేశారు.రాజీనామా లేఖను పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కి ఫ్యాక్ ద్వారా పంపారు.

మంచిర్యాల జిల్లా మందమర్రిలో ఈనెల 7న జరిగే బహిరంగ సభలో బిఆర్ఎస్ అధినేత,ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షములో గులాబీ కండువా కప్పుకోనున్నారు.

ఈ విషయమై జనార్దన్ ను మీడియా ప్రతినిధిలు సంప్రదించగా వాస్తవమేనన్నారు. బిఆర్ఎస్ లో రాష్ట్ర అభివృద్ధి కోసమే చేరుతున్నానన్నారు. పదవులపై ఎలాంటి ఆశ లేదన్నారు.కాంగ్రెస్ పార్టీ నుంచి అయన రాజకీయ భవిష్యత్తు పై స్పష్టమైన హామీ రాకపోవడంతోనే పార్టీ కి రాజీనామా చేసినట్టు తెలిసింది.

ముందుగా చెన్నూర్ టికెట్ పై హామీ ఇవ్వడం జరిగిందని, ఆ తరువాత వివేక్ చేరిన తరువాత పెద్దపల్లి పార్లమెంట్ స్తానం పై కూడా పార్టీ నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడంతోనే పార్టీ నుంచి వైదొలుగుతున్నట్టు సమాచారం..

రెండు నెలల పాటు వివేక్ చేరికపై మంతనాలు జరిగాయి.చర్చలు జరుగుతున్న నేపథ్యంలో కూడా జనార్దన్ కె చెన్నూర్ టికెట్ ఇస్తున్నట్టుగా కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలుచెప్పడం ఫలించిన మంతనాలు.

ఈ నెల 1న చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్,మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకార్ రావ్లు స్వయంగా మంచిర్యాల లోని మాజీ మంత్రి బోడ జనార్దన్ ఇంటికి వెళ్లి పార్టీలో చేరాలని ఆహ్వానించారు.

సుమారు నాలుగు గంటలకు పైగా చర్చలు జరిపారు.మరుసటి రోజు ఉదయం అల్పహారం సమయంలో బాల్క సుమన్ జనార్దన్ ఇంటికి వెళ్లి సుమారు రెండు గంటల పాటు మరోసారి మంతనాలు జరిపారు.

వీరితోపాటు బెల్లంపల్లి ఎమ్మెల్యే,జనార్దన్ రాజకీయ శిష్యుడు దుర్గం చిన్నయ్య,పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేతలు సైతం జనార్ధన్ తో పార్టీ లో చేరాలని ఆహ్వానించారు. నలుగురు నేతలు జరిపిన మంతనాల నేపథ్యంలో జనార్దన్ ఎట్టకేలకు గులాబీ తీర్థం పుచ్చుకోబోతున్నారు...

తిరుమలలో నేడు భక్తుల రద్దీ సర్వసాధారణంగా ఉంది

తిరుమలలో నేడు సోమవారం భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది.

నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు 7 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు.

అలాగే టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది.

నిన్న ఆదివారం వీకెండ్ కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.

78,389 మంది భక్తులు నిన్న శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

నిన్న స్వామివారి హుండీ ఆదాయం రూ.3.87 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది...

వాయుకాలుష్యంతో క్యాన్సర్ వచ్చే అవకాశం.. వైద్యనిపుణుల హెచ్చరిక..

ఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీ ప్రజలు తీవ్రమైన వాయు కాలుష్యంతో విలవిల్లాడుతున్నారు. గాలి నాణ్యత తీవ్రంగా పడిపోవడంతో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు..

వాయు కాలుష్యం హానికరమైనదని, మానవ శరీరంపై తీవ్రమైన దుష్ప్రభావాన్ని చూపిస్తుందని వైద్యులు, ఆరోగ్య నిపుణులు హెచ్చరించారు. వాయు కాలుష్యం, వివిధ రకాల క్యాన్సర్ల మధ్య సంబంధాన్ని తెలియజేసే శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయని ఢిల్లీ ఎయిమ్స్ అదనపు ప్రొఫెసర్, డాక్టర్ పీయూష్ రంజన్ తెలిపారు.

వాయు కాలుష్యం శ్వాసకోశ వ్యవస్థకు హాని కలిగించడమే కాకుండా గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాల వ్యాధులకు కూడా దారితీస్తుందని పేర్కొన్నారు. శరీరంలోని వివిధ వ్యవస్థలను ప్రభావితం చేస్తుందని, ఈ విషయాన్ని తెలుసుకోవడం ప్రతి ఒక్కరికీ చాలా ముఖ్యమని అన్నారు.

వైద్య ఎమర్జెన్సీ పరిస్థితుల్లో కడుపులోని పిండానికి కూడా వాయు కాలుష్యం హానికరమేనని, పిండంపై దుష్ప్రభావాలు చూపుతుందని వైద్యనిపుణులు చెబుతున్నారు.

అన్ని వయసులవారి మెదడు, గుండెను కాలుష్యం దెబ్బతీస్తుందని, ముందు జాగ్రత్తతో వ్యవహరించకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కాగా ఢిల్లీలో వాయు నాణ్యత దారుణంగా పడిపోతోంది. వరుసగా నాలుగో రోజు ఆదివారం కూడా 'తీవ్రమైన' కేటగిరీలోనే 'వాయు నాణ్యత ఇండెక్స్' ఉంది..

ఊరూరా భోజనాలు.. నేతల బెంబేలు..!

•ప్రచారంలో రోజూ రూ.లక్షల్లో 'వడ్డింపు'

హైదరాబాద్‌: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీలకు, అభ్యర్థులకు రోజువారీ ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయి..

ప్రచార సంరంభంలో భాగంగా.. గ్రామాల నుంచి పట్టణాల దాకా రోజూ పెద్దసంఖ్యలో సామూహిక భోజనాలు వండుతున్నారు. రోజూ వీధుల్లో తిరుగుతూ ప్రచారం నిర్వహించే వారికి నాయకులే భోజనాలు సమకూరుస్తున్నారు. దాదాపు ప్రతి గ్రామం, పట్టణంలో నిత్యం వేల మందికి భోజనాలు వండి వడ్డిస్తున్నారు.

వీటి కోసం హోటళ్లు, క్యాటరింగ్‌ నిర్వాహకులు పెద్దఎత్తున సరకులు కొని నిల్వ చేస్తున్నారు. నెల క్రితం వరకూ మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ల నుంచి భారీగా కూరగాయలు, ఉల్లిగడ్డలు ఇతర సరకులు రాష్ట్రానికి వచ్చేవి. మహారాష్ట్రకు ఉత్తరాన మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లో, తూర్పున ఛత్తీస్‌గఢ్‌లోనూ అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో తెలంగాణకు కూరగాయల సరఫరా తగ్గిపోయింది. ప్రస్తుతం ఎక్కువగా ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక నుంచే వస్తున్నాయి..

నెలక్రితం వరకూ సాధారణ రోజుల్లో హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లి టోకు మార్కెట్‌కు రోజూ 21 వేల క్వింటాళ్లకు పైగా కూరగాయలు వచ్చేవి. ఇప్పుడు సగానికి సగం తగ్గిపోయినట్లు అక్కడి సిబ్బంది చెబుతున్నారు. మరోవైపు జాతీయ మార్కెట్లలో నిత్యావసరాలకు గత నెలరోజుల్లో గణనీయంగా డిమాండు ఏర్పడిందని టోకు వర్తకులు చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో ఎప్పుడూ లేనంతగా భోజనాలకే రోజూ రూ.లక్షల్లో వెచ్చించాల్సి వస్తోందని అభ్యర్థులు వాపోతున్నారు. దీనికి తోడు పెళ్లి ముహూర్తాలు, కార్తికమాసం, అయ్యప్పదీక్షలు మొదలవుతుండటంతో ఊరూరా అన్నదానాలతో సందడి వాతావరణం నెలకొంటోంది. ఇలా నిత్యావసరాలకు డిమాండ్‌ పెరగడంతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం పడుతోంది..