నేడు సత్యసాయి జిల్లాలో తెలుగుదేశం బృందం పర్యటన

ఉమ్మడి అనంతపురం జిల్లాలో తెలుగుదేశం బృందం సోమవారం పర్యటించనుంది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో దెబ్బతిన్న పంటలను పరిశీలించడానికి రాష్ట్ర టీడీపీ వ్యవసాయ కమిటీ బృందం నిర్ణయించింది.
వివరాలు
సోమవారం ఉదయం 10:40 గంటలకు ఉరవకొండ నియోజకవర్గం, కూడేరు మండలం, ఇప్పేరు సమీపంలో వేరుశనగ, ఉలవ పంటలను పరిశీలించనున్నారు. మధ్యాహ్నం 1:30 గంటలకు శ్రీసత్యసాయిజిల్లా పెనుకొండ నియోజకవర్గంలో పర్యటిస్తారు. 2:30 గంటలకు రొద్దం మండలం, చోళేమర్రి క్రాస్‌లో వేరుశనగ పొలం పరిశీలిస్తారు.
సాయంత్రం 3:30 గంటలకు మడకశిర మండలం, కోడిగానిపల్లి సమీపంలో పంటలను పరిశీలించి.. వసల వెళ్ళిన వ్యవసాయ కూలీల కుటుంబసభ్యులతో టీడీపీ బృందం సమావేశమై.. వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు.
కాగా అనంత ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌లో కరువు పరిశీలించేందుకు ఆదివారం రాత్రి జిల్లాకు వచ్చిన టీడీపీ రాష్ట్ర బృందం నాయకులకు ఘన స్వాగతం లభించింది.
ఆ బృందంలో మాజీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు, సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ఉన్నారు.
స్థానిక మాసినేని హోటల్ వద్ద టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి, గంజే నాగరాజు, నాయకులు సరిపూటి రమణ, నారాయణస్వామి యాదవ్, బ్రహ్మయ్య, షణ్ముఖ, రజాక్, సరిపూటి శ్రీకాంత స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.
Nov 07 2023, 13:01
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
15.5k