నేడు నాలుగు నియోజకవర్గాల్లో కెసిఆర్ పర్యటన
ఉమ్మడి పాలమూరు జిల్లాలో సోమవారం ఒకే రోజు బీఆర్ఎస్ నాలుగు నియోజకవర్గాలలో ఎన్నికల ప్రచార సభలు నిర్వహించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఇప్పటికే ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొదటి దఫా ఎన్నికల ప్రచారం పూర్తి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ రెండవ విడతగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో రెండవసారి పర్యటనకు రానున్నారు.
ఈ మేరకు దేవరకద్ర, గద్వాల, మక్తల్, నారాయణపేట అసెంబ్లీ నియోజకవర్గాలలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనలు ఖరారు అయ్యాయి. కేసీఆర్ రాక సందర్భంగా స్థానిక ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ అభ్యర్థులు ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
ఉమ్మడి పాలమూరు జిల్లా దేవరకద్ర, గద్వాల, మక్తల్, నారాయణపేట అసెంబ్లీ నియోజకవర్గాలలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనల సందర్భంగా ఎమ్మెల్యేలు సభ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశారు.
ఈ సభలకు ఊహించని విధంగా జనాలను సేకరించేలా ఇప్పటికే ఎమ్మెల్యేలు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేశారు. దేవరకద్రలో జరిగే కార్యక్రమాలను ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు.
ఉదయం 11 గంటల ప్రాంతంలో జరిగే ఈ సభకు జనాన్ని భారీగా తరలించేలా ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఆయా మండలాల ప్రజాప్రతినిధులు పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలకు ఆదేశాలు జారీ చేశారు.
గద్వాలలో ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, మక్తల్‌లో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, నారాయణపేటలో ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి సారథ్యంలో ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఎన్నికల సమయంలో పరిస్థితులను తమకు పూర్తిగా అనుకూలంగా మలుచుకునే విధంగా ఎమ్మెల్యేలు సన్నద్ధం అయ్యారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనే సభలకు జనాన్ని భారీగా తీసుకువచ్చేలా ఇప్పటికే ముఖ్య నాయకులు కార్యకర్తలకు ఎమ్మెల్యేలు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం జరగనున్న సభలను దిగ్విజయం చేయాలన్న సంకల్పంతో ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు...















Nov 06 2023, 10:34
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
12.1k