మంచిర్యాల జిల్లా మాజీ మంత్రి కాంగ్రెస్ కు రాజీనామా?
ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి బోడ జనార్దన్ ఆదివారం కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేశారు.రాజీనామా లేఖను పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కి ఫ్యాక్ ద్వారా పంపారు.
మంచిర్యాల జిల్లా మందమర్రిలో ఈనెల 7న జరిగే బహిరంగ సభలో బిఆర్ఎస్ అధినేత,ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షములో గులాబీ కండువా కప్పుకోనున్నారు.
ఈ విషయమై జనార్దన్ ను మీడియా ప్రతినిధిలు సంప్రదించగా వాస్తవమేనన్నారు. బిఆర్ఎస్ లో రాష్ట్ర అభివృద్ధి కోసమే చేరుతున్నానన్నారు. పదవులపై ఎలాంటి ఆశ లేదన్నారు.కాంగ్రెస్ పార్టీ నుంచి అయన రాజకీయ భవిష్యత్తు పై స్పష్టమైన హామీ రాకపోవడంతోనే పార్టీ కి రాజీనామా చేసినట్టు తెలిసింది.
ముందుగా చెన్నూర్ టికెట్ పై హామీ ఇవ్వడం జరిగిందని, ఆ తరువాత వివేక్ చేరిన తరువాత పెద్దపల్లి పార్లమెంట్ స్తానం పై కూడా పార్టీ నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడంతోనే పార్టీ నుంచి వైదొలుగుతున్నట్టు సమాచారం..
రెండు నెలల పాటు వివేక్ చేరికపై మంతనాలు జరిగాయి.చర్చలు జరుగుతున్న నేపథ్యంలో కూడా జనార్దన్ కె చెన్నూర్ టికెట్ ఇస్తున్నట్టుగా కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలుచెప్పడం ఫలించిన మంతనాలు.
ఈ నెల 1న చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్,మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకార్ రావ్లు స్వయంగా మంచిర్యాల లోని మాజీ మంత్రి బోడ జనార్దన్ ఇంటికి వెళ్లి పార్టీలో చేరాలని ఆహ్వానించారు.
సుమారు నాలుగు గంటలకు పైగా చర్చలు జరిపారు.మరుసటి రోజు ఉదయం అల్పహారం సమయంలో బాల్క సుమన్ జనార్దన్ ఇంటికి వెళ్లి సుమారు రెండు గంటల పాటు మరోసారి మంతనాలు జరిపారు.
వీరితోపాటు బెల్లంపల్లి ఎమ్మెల్యే,జనార్దన్ రాజకీయ శిష్యుడు దుర్గం చిన్నయ్య,పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేతలు సైతం జనార్ధన్ తో పార్టీ లో చేరాలని ఆహ్వానించారు. నలుగురు నేతలు జరిపిన మంతనాల నేపథ్యంలో జనార్దన్ ఎట్టకేలకు గులాబీ తీర్థం పుచ్చుకోబోతున్నారు...
Nov 06 2023, 09:57