కెసిఆర్ ను గద్దె దించాలన్నదే నా లక్ష్యం : వివేక్ వెంకటస్వామి
బీజేపీ పార్టీ భారీ షాక్ తగిలింది. బీజేపీ నేత మాజీ ఎంపీ వివేక్ వెంకట స్వామి కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో బుధవారం నాడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. తన కుమారుడు వంశీకి చెన్నూర్ అసెంబ్లీ టికెట్ ను కేటాయించాలన్న హామీ పై హస్తం పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… సోనియా, మల్లిఖార్జున్ నాయకత్వం బలోపేతం కోసం వివేక్ పార్టీలో చేరారని చెప్పారు. కీలక సమయంలో వివేక్ పార్టీలో చేరారన్నారు. వారి చేరికతో వెయ్యి ఏనుగుల బలం చేకూర్చిందని వ్యాఖ్యానించారు.
రేపు జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వివేక్ చేరిక తెలంగాణకు మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేసీఆర్ ను గద్దె దించాలనే లక్ష్యంతోనే తాను కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుగా వివేక్ వెంకటస్వామి ప్రకటించారు.
తెలంగాణ సాధన కోసం ఆనాడు కాంగ్రెస్ ఎంపీలు పోరాటం చేసినట్టుగా ఆయన గుర్తు చేశారు.కేసీఆర్ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. అందరం కలిసికట్టుగా కేసీఆర్ ను గద్దె దింపాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. తామంతా కలిసికట్టుగా ఈ పోరాటంలో పాల్గొంటామని వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు...
Nov 01 2023, 15:18