నేడు తెలంగాణకు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ రాక?

తెలంగాణలో ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. విస్తృత పర్యటన చేస్తూ రోజుకు రెండు మూడు బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు.
ఇక కాంగ్రెస్ పార్టీ కూడా బహిరంగ సభలు, రాహుల్, ఖర్గేలతో కార్నర్ మీటింగ్‌లో సభలు ఏర్పాటు చేస్తున్నారు. ఇవాళ ప్రియాంకగాంధీ తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
ఇక బీజేపీ కూడా ఇటీవల కేంద్ర అమిత్ షాతో సూర్యాపేటలో సభ నిర్విహించింది. పూర్తి స్థాయి అభ్యర్థుల ప్రకటన తర్వాత అగ్రనేతలు, కేంద్ర మంత్రులతో సభలకు ప్లాన్ చేస్తుంది.
ఇక ఎన్నికలకు సరిగ్గా నెల రోజులు మాత్రమే సమయం ఉండటంతో కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని చూస్తుంది. అందులో భాగంగా ఆయనకు పార్టీ తరపున హెలికాప్టర్‌ను కేటాయించినట్లు తెలిసింది
బీజేపీ తెలంగాణ స్టార్ క్యాంపెయినర్ హోదాలో ఆయనకు ఈ అవకాశం కల్పించినట్లు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా బండి సంజయ్‌కి ఉన్న ఫాలోయింగ్‌ను పార్టీకి ఉపయోగపడేలా అధిష్టానం ప్రణాళిక రచించినట్లు అర్థమవుతోంది.
రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో జీహెచ్‌ఎంసీతో పాటు దుబ్బాక, హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో విజయాలు సాధించిన క్రెడిట్ సంజయ్‌కి ఉంది. కార్యకర్తల్లోనూ ఆయన మాస్ ఇమేజ్ ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే పలు బహిరంగ సభల్లో బండి సంజయ్ పాల్గొనేందుకు త్వరగా సభలకు చేరుకునేందుకు ఆయనకు హెలికాప్టర్ కేటాయించింది.
సంజయ్‌తో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్‌తో పాటు మరొకరికి కూడా హెలికాప్టర్లు కేటాయించినట్లు సమాచారం.
Nov 01 2023, 15:16
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
13.8k