కాంగ్రేస్ పార్టీని విమర్శించే స్ధాయి నీకు లేదు కేటీఆర్! కడెం ప్రాజెక్ట్ గేట్లఫై నుండి నిమిషానికి ఆరు లక్ష క్యూసెక్కుల నీరు ప్రవహించిన ఏమికాలే
కాంగ్రేస్ పార్టీని విమర్శించే స్ధాయి నీకు లేదు కేటీఆర్!
కడెం ప్రాజెక్ట్ గేట్లఫై నుండి నిమిషానికి ఆరు లక్ష క్యూసెక్కుల నీరు ప్రవహించిన చెక్కు చెదరలేదు!
ఓటమి భయంతో మేకపోతు గంభీర్యాని ప్రదర్శిస్తున్న డ్రామా రావు!
మండిపడ్డ
జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్
తేది: 29-10-2023 ఆదివారం
చిన్నకోడూర్ న్యూస్
బి.ఆర్.ఎస్ పార్టీ ఒడిపోతుందనే భయంతో కేటీఆర్ పిచ్చెక్కి మాట్లాడుతున్నాడని నేషనల్ కాంగ్రేస్ వర్కర్స్ రాష్ట్ర కార్యానిర్వహన అధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు.
ఆదివారం రోజు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో జంగిడి శ్రీనివాస్ ముదిరాజ్ మాట్లాడుతూ 70 సంవత్సరాల క్రితం నిర్మించిన కడెం ప్రాజెక్టు డేంజర్ జోన్ లో గేట్ల పై నుండి నిమిషానికి ఆరు లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహించిన చెక్కుచెదరలేదని మీరు నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ ఐదు సంవత్సరాలకి కుప్పకూలుతుంది కనపడతలేదని కాంగ్రెస్ కట్టడాలకు మీ కట్టడాలకు ఎంత తేడా ఉందో తన్ను కనపడతలేవా అని మండిపడ్డారు.
దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి 11 సార్లు అవకాశం ఇస్తే భారతదేశాన్ని అభివృద్ధిలో నిలపడానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు వ్యవసాయ భూమిని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా గరీబ్ హటావో అని నినాదంతో కూడు గూడు గుడ్డ కాంగ్రెస్ పార్టీ కాదా రైతులకు సబ్సిడీ కింద విత్తనాలు పనిముట్లు ఎరువులు అందించింది కాంగ్రెస్ పార్టీ కాదా పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా పేద ప్రజలకు ఆరోగ్యశ్రీనిచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా 108 అంబులెన్స్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా సంవత్సరానికి లక్ష ఉద్యోగాలు ఇస్తూ ఉపాధి కల్పించింది కాంగ్రెస్ పార్టీ కాదా ఏక కలంలో రైతులకు లక్ష రూపాయలు రుణమాఫీ చేయలేదా చివరికి కెసిఆర్ కు ముఖ్యమంత్రి పదవి వచ్చిందంటే అందుకు కారణం కాంగ్రెస్ కాదా అమెరికాలో బతకనికి పోయిన నువ్వు నీ చెల్లె రాష్ట్రాన్ని ఏలుతున్నారంటే అది కాంగ్రెస్ బిక్ష కాదా పది సంవత్సరాలు కెసిఆర్ ను నమ్మి ఓట్లు వేస్తే ఒక్క ఉద్యోగం ఇవ్వక పోతిరి అది కాకుండా వీఆర్వో వీఆర్ఏ తీసేతిరి హౌసింగ్ కార్పొరేషన్ తీసేస్తేరి నిరుద్యోగ భృతి ఈయకనే పోతిరి మాయల ఫకీర్ వలె మాటలు మారుస్తూ మల్ల గద్దెనెక్కలని అనుకుంటున్నారమో కేటీఆర్ ఇగ మీ పప్పులు ఉడకవు రాబోయేది కాంగ్రేస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు ప్రజలకు అందించేది కాంగ్రేస్ ప్రభుత్వం గుర్తు పెట్టుకో రైతుల రెండు లక్షల రుణమాఫీ చేస్తూ ఎకరానికి పదిహేను వేల రైతు భందు ఇచ్చేది కాంగ్రేస్ ప్రభుత్వం మీ అవినీతిని బైటకు తీసి మిమ్ములను జైల్లో పెట్టేది కాంగ్రేస్ ప్రభుత్వం అందుకే మీ ఎన్నులో వణుకు పుట్టి నువ్వు నీ నాయిన మతిభ్రమించ్చిన మాటలు మాట్లాడుతున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు మ్యాకల ఎల్లం, బి.సి సెల్ మండల అధ్యక్షుడు బంక చిరంజీవి యాదవ్, యూత్ కాంగ్రేస్ షోషల్ మీడియా కోర్డినేటర్ సామల సంతోష్, ఏర్వా సత్యం, గొడుగు దిలీప్ తదితరులు ఉన్నారు.
Oct 31 2023, 17:21