విజయనగరం రైలు ప్రమాదం లో 13కు చేరిన మృతుల సంఖ్య
AP: విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కంటకాపల్లి వద్ద ఆదివారం రాత్రి రైలు ప్రమాదం జరిగింది. విశాఖపట్నం- పలాస వెళ్తున్న ప్రత్యేక ప్యాసింజర్ రైలు కొత్త వలస మండలం అలమండ - కంటకాపల్లి వద్ద సిగ్నల్ లేకపోవడంతో పట్టాలపై ఆగి వుంది. అదే సమయంలో దాని వెనకాలే వస్తున్న విశాఖ - రాయగడ రైలు.. ఆగి ఉన్న ప్యాసింజర్ రైలు (విశాఖ -పలాస) ను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో మూడు బోగీలు పట్టాలు తప్పాయి. ఆదివారం నాటికి ఆరుగురు ప్రయాణికులు మృతి చెందారు. పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. సహాయక బృందాలు ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకొని గాయపడినవారిని ఆస్పత్రులకు తరలిస్తున్నారు.
రైళ్లు ఢీకొనడంతో ఘటనా స్థలంలో విద్యుత్ వైర్లు తెగిపోయాయి. దీంతో ఆ ప్రాంతమంతా నిన్న రాత్రి అంధకారం నెలకొంది. దీంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది.
హెల్ప్ లైన్ నెంబర్ లు:
8106053051
8106053052
8500041670
8500041671
నేడు మృతుల సంఖ్య 13 కు చేరింది సుమారు 50 మందికి పైగా గాయాలు అయ్యాయి.ఘటన స్థలంలో కొనసాగుతున్న సహాయక చర్యలు. రైలు ప్రమాదం జరగడంతో పలు రైళ్ల రాకపోకలకు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే..మృతుల కుటుంబాలకు 10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి 2.50 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి 50 వేల చొప్పున ఎక్స్గ్రేషియా ను రైల్వే శాఖ ప్రకటించింది.
Oct 30 2023, 12:34