/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz CBN Health Condition: చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యుల ఆందోళన.. Yadagiri Goud
CBN Health Condition: చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యుల ఆందోళన..

రాజమండ్రి:తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu Naidu) ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు..

శనివారం నాడు చంద్రబాబుతో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, నారా భువనేశ్వరి, తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ములాఖత్ అయ్యారు. ములాఖత్ అనంతరం మీడియాతో మాట్లాడకుండానే నారా లోకేష్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఈసందర్భంలో చంద్రబాబును చూసి నారా భువనేశ్వరి, లోకేష్ భావోద్వేగానికి గురయ్యారు. మానసికంగా చంద్రబాబు స్ట్రాంగ్‌గా ఉన్నా....ఆరోగ్య సమస్యలపై కుటుంబ సభ్యుల ఆందోళన చెందుతున్నారు. అక్టోబర్ 6 తేదీ నుంచి ములాఖత్‌లో ఆరోగ్యంగా కనిపించిన చంద్రబాబు.. నేడు వీక్‌గా కనిపించడంపై కుటుంబ సభ్యులు బాధ పడుతున్నారు. గత ములాఖత్ నాటికి, నేటికి చంద్రబాబులో చాలా మార్పు వచ్చినట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు..

చంద్రబాబు ఆరోగ్యం ఆందోళనకరంగా ఉంది: కాసాని జ్ఞానేశ్వర్

చంద్రబాబు ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని కాసాని జ్ఞానేశ్వర్( Kasani Gnaneswer) తెలిపారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై మాజీ మంత్రులు జవహర్, పీతల సుజాత మీడియాతో మాట్లాడారు. జైలులో ఉన్న చంద్రబాబు ఆరోగ్యం క్షీణించందన్న ఆవేదనతోనే లోకేష్, భువనేశ్వరిలు మీడియాతో మాట్లాడలేదు. చంద్రబాబుకు ఏదైనా హాని జరిగితే ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు..

జైలులో చంద్రబాబుకు వైద్య పరీక్షలు..

చంద్రబాబు కు వైద్య పరీక్షల కోసం రాజమండ్రి సెంట్రల్ జైలుకి ప్రభుత్వ ఆస్పత్రి చర్మ వ్యాధుల నిపుణులు డాక్టర్లు సూర్యనారాయణ, సునీతాదేవి చేరుకున్నారు. చంద్రబాబుకు జైలులో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు..

తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ శుభాకాంక్షలు: సీఎం కేసీఆర్

పూలనే దేవతగా కొలిచే బతుకమ్మ పండుగ తెలంగాణ ఆత్మగౌరవానికి, ప్రత్యేక సాంసృతిక అస్తిత్వానికి ప్రతీకగా నిలిచిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.

శనివారం బతుకమ్మ పండుగ ప్రారంభం ఎంగిలిపూల బతుకమ్మ సందర్భంగా రాష్ట్రంలోని ఆడబిడ్డలందరికీ సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు.

బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా జరుపుకొంటూ, తెలంగాణ సంసృతీ సంప్రదాయాలను రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా గౌరవిస్తున్నదని చెప్పారు.

ఎంగిలి పూల బతుకమ్మతో మొదలై, ఉత్సవాల ముగింపు రోజైన సద్దుల బతుకమ్మ దాకా తొమ్మిది రోజులపాటు ఆడబిడ్డలంతా ఆటా పాటలతో కోలాటాలతో కలిసికట్టుగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.

ప్రకృతితో మమేకమైన తెలంగాణ సంసృతి, సంప్రదాయాల ఔన్నత్యాన్ని బతుకమ్మ పండుగ విశ్వ వ్యాప్తంగా చాటుతుందని తెలిపారు.

మహిళా సంక్షేమం, అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలు మహిళా సాధికారతను పెంపొందిస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచాయని స్పష్టంచేశారు.

తెలంగాణ ప్రజలందరి బతుకుల్లో వెలుగులు నింపుతూ, మరింతగా సుఖ సంతోషాలతో జీవించేలా దీవించాలని ప్రకృతి మాతను సీఎం కేసీఆర్‌ ప్రార్థించారు...

విద్యార్థిని ప్రవళిక ఆత్మహత్యపై స్పందించిన గవర్నర్

తెలంగాణలో సంచలనం సృష్టించిన గ్రూప్-2 అభ్యర్థి ప్రవళిక ఆత్మహత్య ఘటనపై గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ప్రవళిక మృతిపై 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని సీఎస్, డీజీపీ, టీఎస్ పీఎస్సీ కార్యదర్శికి ఆదేశించారు.

నిన్న రాత్రి అశోక్ నగర్ హాస్టల్ లో ప్రవళిక ఆహత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే...

ఎన్నాళ్లీ తెలుగుదేశం పార్టీ నాటకాలు: విజయసాయి రెడ్డి

ఢిల్లీ: చంద్రబాబుకు ఇంటి భోజనం అందుతోందని వైయస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. జైలులో ప్రత్యేక గది కేటాయించారని తెలిపారు..

ప్రతిరోజు మూడుసార్లు ముగ్గురు డాక్టర్లు చెక్ అప్ చేస్తున్నారని వెల్లడించారు. 8 మంది పోలీసులు కాపలాగా ఉంటున్నారని స్పష్టం చేశారు. నేరాలకు తగిన శిక్ష అనుభవించేందుకు చంద్రబాబు పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని ట్వీట్ చేశారు.

'నెలరోజులు జైలులో ఉండేసరికి పూర్తి విశ్రాంతితో చంద్రబాబు గారు కిలో బరువు పెరిగారు. ఇతరత్రా ఆరోగ్య సమస్యలు కూడా దూరమై సంతోషంగా ఉన్నారని జైలు అధికారులే చెప్పారు.

స్కామ్స్ లో బెయిల్ రాకపోయేసరికి అలజడి సృష్టించేందుకు దుష్ప్రచారం చేస్తున్నట్లు రుజువైంది. ఎన్నాళ్లీ తెలుగుదేశం పార్టీ డ్రామాలు' అంటూ విజయసాయి రెడ్డి దుయ్యబట్టారు.

భారీగా తరలివచ్చిన చంద్రబాబు అభిమానులు... మెట్రో స్టేషన్ల వద్ద అప్రమత్తమైన పోలీసులు..

హైదరాబాద్‌: తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు హైదరాబాద్‌లో వినూత్న కార్యక్రమానికి పిలుపునిచ్చారు..

'లెట్స్‌ మెట్రో ఫర్‌ సీబీఎన్‌' పేరుతో కార్యక్రమం తలపెట్టారు. ఈ క్రమంలో మెట్రో స్టేషన్ల వద్ద హైదరాబాద్‌ పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రవేశాల వద్ద బందోబస్తు నిర్వహిస్తూ నల్ల చొక్కాలు ధరించిన వారిని లోనికి అనుమతించడం లేదు.

చంద్రబాబు అభిమానులు భారీగా తరలిరావడంతో.. మియాపూర్ మెట్రో స్టేషన్‌ను సిబ్బంది కాసేపు తాత్కాలికంగా మూసివేశారు. ఆ తర్వాత ప్రయాణికులను అనుమతించారు. మరోవైపు ఎల్బీనగర్ మెట్రోస్టేషన్‌ వద్ద నల్ల టీషర్ట్ వేసుకొని వచ్చిన యువకులను అడ్డుకోవడంతో.. పక్కనే ఉన్న డీ - మార్టులోకి వెళ్లి ఇతర రంగు టీషర్ట్‌లు కొనుగోలు చేసి వస్తున్నారు.

శనివారం ఉదయం 10.30 - 11.30 గంటల మధ్య మియాపూర్‌ నుంచి ఎల్బీనగర్‌ వరకూ నల్ల టీషర్టులు ధరించి మెట్రోలో ప్రయాణించాలని చంద్రబాబు అభిమానులు పిలుపునిచ్చారు. మెట్రో ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఈ శాంతియుత నిరసన చేపట్టాలని నిర్ణయించారు..

Purandeswari: మద్యం కంపెనీల యజమానుల పేర్లు ప్రజాక్షేత్రంలో పెట్టగలరా?: పురందేశ్వరి

విజయవాడ: ఏపీలో మద్యం తయారీ కంపెనీల యజమానుల పేర్లు ప్రజాక్షేత్రంలో పెట్టగలరా? అని రాష్ట్ర భాజపా అధ్యక్షురాలు పురందేశ్వరి ప్రశ్నించారు. ఇవాళ సాయంత్రానికల్లా కంపెనీ యజమానుల పేర్లు బయట పెట్టాలని డిమాండ్ చేశారు..

విజయవాడలో మీడియాతో ఆమె మాట్లాడారు. ఆ కంపెనీల యజమానులంతా వైకాపా వాళ్లేనని వేరే చెప్పనవసరం లేదని దుయ్యబట్టారు.

ధైర్యం ఉంటే మద్యం కంపెనీల యజమానుల పేర్లన్నీ బయటపెట్లాని సవాల్‌ విసిరారు. మద్యం తయారు చేసినా.. అమ్మినా ఏడేళ్ల జైలు శిక్ష విధించాలని గతంలో సీఎం జగన్‌ చెప్పారని ఈ సందర్భంగా పురందేశ్వరి గుర్తుచేశారు..

CPI Ramakrishna: చంద్రబాబు ఆరోగ్యంపై ఎగతాళిగా మాట్లాడతారా?: సీపీఐ రామకృష్ణ

విజయవాడ: తెదేపా అధినేత చంద్రబాబు ఆరోగ్యంపై రాజకీయం చేయడం సరికాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఆయన ఆరోగ్యం బాలేదంటే ఎగతాళిగా మాట్లాడతారా?అని మండిపడ్డారు..

ఆరోగ్యంపై వైద్యులు చెప్పాలి గానీ.. డీఐజీ ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో రామకృష్ణ మాట్లాడారు.

మరోవైపు, ఏపీలో నీటిపారుదల ప్రాజెక్టులను వైకాపా ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. ''కృష్ణా జలాల అంశంపై హర్షం వ్యక్తం చేస్తూ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సదస్సు పెడుతున్నారు. ప్రధానికి ధన్యవాదాలు తెలుపుతూ తెలంగాణలో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు.

కేంద్ర కేబినెట్‌ పునఃపంపిణీ నిర్ణయం తీసుకున్నప్పుడు సీఎం జగన్‌ దిల్లీలోనే ఉన్నారు. దిల్లీలో ఉండి మరీ దీనిని అడ్డుకోవడంలో జగన్‌ విఫలమయ్యారు. తెలంగాణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు'' అని సీపీఐ రామకృష్ణ విమర్శించారు..

తెలంగాణ లో గ్రూప్-2 పరీక్షల వాయిదా.. మనస్తాపంతో వరంగల్ యువతి ఆత్మహత్య.. అర్ధరాత్రి వరకు ఉడికిపోయిన హైదరాబాద్..

•నిన్న సాయంత్రం హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకున్న ప్రవళిక

•విషయం తెలిసి హాస్టల్‌కు చేరుకున్న వందలాదిమంది గ్రూప్స్ అభ్యర్థులు

•ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు

•అర్ధరాత్రి వరకు మృతదేహం తరలింపును అడ్డుకున్న వైనం

•విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్

•అర్ధరాత్రి దాటాక ప్రవళిక మృతదేహం తరలింపు

•కేసీఆర్‌కు రోజులు దగ్గరపడ్డాయని పొన్నం ప్రభాకర్ హెచ్చరిక

గ్రూప్-2 పరీక్షలు వాయిదా పడడంతో మనస్తాపం చెందిన ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అశోక్‌నగర్‌లో జరిగిన ఈ ఘటన తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది. వరంగల్ జిల్లా బిక్కాజీపల్లికి చెందిన మర్రి ప్రవళిక (23) అశోక్‌నగర్‌లోని హాస్టల్‌లో ఉంటూ గ్రూప్-2 పరీక్షలకు సన్నద్ధమవుతోంది. నవంబరు 2,3 తేదీల్లో పరీక్షలు జరగాల్సి ఉండగా.. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వచ్చే ఏడాది జనవరి 6, 7 తేదీలకు వాయిదా వేస్తూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాయిదా వేసింది.

పరీక్షల కోసం కోచింగ్ తీసుకుంటున్న ప్రవళిక వాయిదా పడడంతో మనస్తాపానికి గురైంది. నిన్న సాయంత్రం హాస్టల్‌లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

ఆత్మహత్యకు ముందు ప్రవళిక తల్లిదండ్రులకు రాసినట్టుగా ఉన్న లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయింది. తనను క్షమించాలని, తానో నష్టజాతకురాలినని ఆ లేఖలో ప్రవళిక ఆవేదన వ్యక్తం చేసింది. ‘నా వల్ల మీరెప్పుడూ బాధపడుతూనే ఉన్నారు. మీకు పుట్టడం నా అదృష్టం అమ్మా. నన్ను కాళ్లు కిందపెట్టకుండా చూసుకున్నారు. మీకు నేను చాలా అన్యాయం చేస్తున్నా. నన్ను ఎవరూ క్షమించరు. ఏడవకండి అమ్మా. మీ కోసం నేను ఏమీ చేయలేకపోతున్నా. నాన్న జాగ్రత్త’ అని ఆ లేఖలో ప్రవళిక పేర్కొంది. కాగా, ప్రవళిక కుటుంబ వివరాలు తెలియాల్సి ఉంది. ఆమె ఆధార్‌కార్డు ప్రకారం తండ్రి లింగయ్య అని మాత్రం తెలుస్తోంది.

లాఠీ చార్జీ చేసి మృతదేహం తరలింపు

ప్రవళిక ఆత్మహత్యతో అశోక్‌నగర్‌లో అర్ధరాత్రి వరకు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆమె కుటుంబానికి న్యాయం జరిగే వరకు కదలబోమని గ్రూప్స్ అభ్యర్థులు భీష్మించుకున్నారు. అర్ధరాత్రి వరకు నిరసన తెలిపారు. పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. దీంతో పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లించాల్సి వచ్చింది. చివరికి అర్ధరాత్రి తర్వాత అభ్యర్థులపై పోలీసులు లాఠీచార్జీ చేసి చెదరగొట్టారు. దీంతో అభ్యర్థులు పోలీసులపై రాళ్లు రువ్వారు. చివరికి అర్ధరాత్రి దాటిన తర్వాత 1.30 గంటల సమయంలో ప్రవళిక మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

అభ్యర్థులతో కలిసి ఆందోళనకు దిగిన సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడు అనిల్‌కుమార్ యాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

రోజులు దగ్గరపడ్డాయి బిడ్డా

ప్రవళిక ఆత్మహత్యపై కాంగ్రెస్ నేత, కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు. ప్రవళిక ఆత్మహత్య బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. నియంత కేసీఆర్ కుటుంబం బాగుంటే సరిపోదని పేర్కొన్నారు. వందలాదిమంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న కేసీఆర్‌కు రోజులు దగ్గరపడ్డాయి బిడ్డా అని హెచ్చరించారు. నిరుద్యోగ అక్కాచెల్లెళ్లు, అన్నాతమ్ముళ్లు అధైర్యపడొద్దని.. తొందరపాటు చర్యలు వద్దని హితవు పలికారు. వచ్చేది మన ప్రభుత్వమేనని, మన నియామకాలు మనమే చేసుకుందామని, ఈ దొంగ దొరను తరిమి కొడదామని పిలుపునిచ్చారు.

Bathukamma Festival 2023 : నేటి నుంచే పూల సంబురం.. ఎంగిలి పూల బతుకమ్మతో పండుగ ప్రారంభం..

తెలంగాణ ప్రజలకు బతుకమ్మ పండుగ ఎంతో ప్రత్యేకమైనది. పల్లె పట్నం అని తేడా లేకుండా.. రాష్ట్రమంతటా తొమ్మిది రోజులపాటు అంగరంగ వైభవంగా ఈ ఉత్సవాలను జరుపుకుంటారు..

నేటి నుంచి బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం అవుతున్నాయి. తొలిరోజు ఎంగిలి పూల బతుకమ్మతో మొదలయ్యే పండుగ.. చివరి రోజు సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి.

దేవునికి పూలను పెట్టి పూజిస్తాం. కానీ పూలనే పూజించే విశిష్ఠమైన సంప్రదాయం బతుకమ్మ. తంగేడు, గునుగు, కట్ల, గుమ్మడి మొదలైన పూలతో.. బతుకమ్మలను అందంగా తయారు చేయడం ఈ పండుగ ప్రత్యేకత..

SB NEWS

Streetbuzz News

STREETBUZZ NEWS

SB NEWS

SI Mains Exam: నేడు, రేపు ఎస్సై మెయిన్స్‌ పరీక్షలు..

ఈ రోజు, రేపు.. ఈ నెల 14, 15 తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌ ఎస్సై పోస్టుల భర్తీకి సంబంధించిన మెయిన్స్‌ పరీక్షలు జరగనున్నాయి.. ఈ పరీక్షల నిర్వహణ కోసం రాష్ట్రంలో నాలుగు కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు..

విశాఖపట్నం, ఏలూరు, గుంటూరు, కర్నూలులో శనివారం, ఆదివారం రెండు రోజుల పాటు మెయిన్‌ పరీక్షలు నిర్వహించనున్నారు.. మొత్తం నాలుగు పేపర్లుగా ఈ పరీక్ష ఉండగా.. ఆబ్జెక్టివ్‌ విధానంలో రెండు పేపర్లు, డిస్క్రిప్టివ్‌ విధానంలో మరో రెండు పేపర్లు ఉండనున్నాయి.. కాగా, ఇప్పటి వరకు నిర్వహించిన పరీక్షల్లో మెయిన్‌ పరీక్షకు మొత్తం 31,193 మంది అర్హత సాధించారు. వీరిలో 27,590 మంది పురుష అభ్యర్థులు.. 3,603 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు..

ఈ రోజు పేపర్‌-1 అంటే డిస్క్రిప్టివ్‌ విధానంలో జరిగే పరీక్ష నిర్వహించనున్నారు.. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు.. పేపర్‌-2 మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరగనుండగా.. రేపు ఆబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహించే పేపర్‌-3 ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు..

పేపర్‌-4 మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల నిర్వహించనున్నారు.. ఇక, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించే ఎస్సై పరీక్షలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే.. అభ్యర్థుల ఎత్తు కొలిచే పరికరాల్లో తప్పిదం వల్ల వేలాది మంది విద్యార్థులు అర్హత కోల్పోవడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది.

2019లో అర్హత సాధించిన అభ్యర్థులు 2023లో ఎలా అనర్హతకు గురవుతారని ధర్మాసనం ప్రశ్నించింది. ఎత్తు విషయంలో తమకు అర్హత వున్నప్పటికీ తమని అన్యాయంగా అనర్హతకు గురి చేశారని దాఖలైన పలు పిటిషన్లు మీద హైకోర్టు విచారణ చేపట్టింది. రెండు సైటేషన్లను అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అనర్హత పొందిన అభ్యర్థులు అందరికీ మళ్లీ శరీర ధారుడ్యం పరీక్షలకు అనుమతించాలని కోర్టు ఆదేశించింది..