పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని భారీ ర్యాలీ
పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని భారీ ర్యాలీ
- న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో అధికారులకు వినతి పత్రం
చర్ల
గిరిజనులు ఎంతో కాలంగా సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, ఆదివాసీలపై అటవీశాఖ అధికారులు వేధింపులు ఆపాలని చర్ల దుమ్ముగూడెం సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ సబ్ డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ డిమాండ్ చేశారు. చర్ల మండలం కలివేరు గ్రామపంచాయతీ లింగాల కాలనీలో పోడు రైతులకు పట్టాలు ఇవ్వాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో కలివేరు గ్రామం నుండి నుండి చర్ల తహశీల్దార్ కార్యాలయం వరకు ఐదు కిలోమీటర్ల మేర భారీ ర్యాలీ నిర్వహించారు.
కు
అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించి పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. అనంతరం సీపీఐ ఎం ఎల్ న్యూ డెమోక్రసీ సబ్ డివిజన్ కార్యదర్శి సతీష్ మాట్లాడుతూ గతంలో ఎంతో మంది అధికారులకు వినతి పత్రాలు ఇచ్చామని ఆయన పట్టించుకునే నాధుడు లేరన్నారు. ఇప్పటికైనా గ్రామసభ నిర్వహించి అర్హులైన వారందరికీ పోడు పట్టాలు అందజేయాని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ సబ్ డివిజన్ నాయకులు నరేష్ సమ్మక్క, రాజు,నాగలక్ష్మి రామలక్ష్మి కనక వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు
Oct 13 2023, 17:11