గవర్నర్‌గా మీరు ఫిట్టా.. బీజేపీ అధ్యక్షురాలిగా పనిచేసి గవర్నర్ ఎలా అయ్యారు?: మంత్రి కేటీఆర్ ఆగ్రహం
గవర్నర్‌గా మీరు ఫిట్టా.. బీజేపీ అధ్యక్షురాలిగా పనిచేసి గవర్నర్ ఎలా అయ్యారు?: మంత్రి కేటీఆర్ ఆగ్రహం
ఆనేక ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్న దా సోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణను ఎమ్మెల్సీలుగా నియమించకుండా గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ ఎలా తిరస్కరిస్తారని ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.
బీజేపీ అధ్యక్షురాలిగా ఉండి గవర్నర్ ఎలా అయ్యారు?
సర్కారియా సిఫారసులకు ఎలా తిలోదకాలిచ్చారు!: కేటీఆర్
బీజేపీ, కాంగ్రెస్ నాయకులను ఎమ్మెల్సీలుగా నియమించలేదా?
ఉద్యమకారులను తిరస్కరిస్తారా?
బడుగు, బలహీనవర్గాల గొంతుకలు వినిపించకూడదా?
గవర్నర్‌పై మంత్రి కేటీఆర్ ఆగ్రహం
అనేక ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్న దా సోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణను ఎమ్మెల్సీలుగా నియమించకుండా గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ ఎలా తిరస్కరిస్తారని ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. సర్కారియా కమిషన్ సిఫారసులను తుంగలో తొక్కి మీరు గవర్నర్ ఎలా అయ్యారని తమిళిసైని సూటిగా ప్ర శ్నించారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
క్యాబినెట్‌లో చర్చించి ఆమోదించిన పంపిన సిఫారసులను గవర్నర్ ఎలా తిరస్కరిస్తారని నిలదీశారు. 'దాసోజు శ్రవణ్ ఉన్నత విద్యావంతుడు, ప్రొఫెసర్. తెలంగాణ ఉద్యమంతోసహా అన్ని ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్న వ్యక్తి. మా మీద కోపమున్నా శ్రవణ్‌పై గవర్నర్‌కు కోపం ఉండదని అనుకు న్నాం. గిరిజన సామాజిక వర్గానికి చెందిన కుర్రా సత్యనారాయణ జాతీయ కార్మిక ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్న నాయకుడు. సంగారెడ్డి వంటి జనరల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన నేత. ఈ ఇద్దరి నేపథ్యాలను గవర్నర్ మనసుతో ఆలోచిస్తే తక్షణం ఆమోదించి ఉండేవారు' అని అన్నారు.
వారు.. గవర్నర్ పోస్టుకు ఫిట్టా?
మోదీ అప్రజస్వామిక విధానాలను అనుసరిస్తున్నట్టే ఆయన ఏజెంట్లయిన గవర్నర్లు అంతకంటే అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. 'రాజకీయాల్లో ఉన్నవాళ్లను ఎమ్మెల్సీ వంటి పదవుల్లోకి తీసుకురావద్దని గవర్నర్ పేర్కొనటం హాస్యాస్పదం. క్రీయాశీల రాజకీయాల్లో ఉన్నవాళ్లను గవర్నర్లుగా నియమించకూడదని సర్కారియా కమిషన్ సిఫారసులు చేసినా మీరు గవర్నర్ కా లేదా? ఆ సిఫారసులను తుంగలో తొక్కిన మో దీ అన్‌ఫిట్టా? గవర్నర్ పదవిని చేపట్టేనాటికి ఒ క్కరోజు ముందు కూడా రాజకీయాల్లో ఉన్న మీ రు అన్‌ఫిట్టా?' అని తమిళిసైని ప్రశ్నించారు. ఎ వరు ఫిట్.. ఎవరు అన్‌ఫిట్ అనే అంశాన్ని ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామని చెప్పారు.
వాళ్లు ఫిట్.. మావాళ్లు అన్‌ఫిట్టా?
ఎమ్మెల్సీగా పనిచేయటానికి బీజేపీ వాళ్లు ఫిట్ కానీ, తెలంగాణ ఉద్యమంలో పనిచేసినవాళ్లు అన్‌ఫిట్టా? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీకి ఒక విధానం, బీఆర్‌ఎస్‌కు మరో విధానమా? అని నిలదీశారు. రాజ్యసభ సభ్యులుగా, ఆయా రాష్ర్టాల ఎమ్మెల్సీలుగా ఉన్న బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఫిట్.. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉద్యమకారులైన బడుగు, బలహీనవర్గాలకు చెందిన వారిని ఎమ్మెల్సీగా ఎంపిక చేస్తే అన్‌ఫిట్టా? ప్రభుత్వం ప్రతిపాదించిన పేర్లను తిరస్కరించాలని గవర్నర్‌కు పై నుం చి ఆదేశాలు వచ్చి ఉంటాయి. అందుకే వాటిని తిరస్కరించారు' అని మండిపడ్డారు.
కాంగ్రెస్‌లో పనిచేసి బీజేపీలో చేరిన జ్యోతిరాధిత్యసింధియాను, రంజన్ గొగోయ్‌ని బీజేపీ రాజ్యసభకు నామినేట్ చేయలేదా?
యూపీలో బీజేపీ అధ్యక్షుడిగా చేసిన బ్రజ్ క్షేత్రాను ఎమ్మెల్సీగా నామినేట్ చేయలేదా?
గుజరాత్‌లో బీజేపీ నాయకుడు రాంసూరజ్ రాజధర్ అసెంబ్లీకి పోటీచేసి ఓడిపోతే ఎమ్మెల్సీగా నామినేట్ కాలేదా?
యూపీలో ఆదిత్యనాథ్ తానా అంటే తం దానా అనే బీజేపీ నేత సాకేత్ మిశ్రాను ఎమ్మెల్సీగా నామినేట్ చేయలేదా?
బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు లాల్జీ నిర్మల్ ఎమ్మెల్సీ కాలేదా?
బీజేపీ వారణాసి అధ్యక్షుడు హన్స్‌రాజ్ ఎమ్మెల్సీగా నామినేట్ కాలేదా?
కర్ణాటక కాంగ్రెస్ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ ఎస్పీ సుధాందాస్, మరో కాంగ్రెస్ నేత సీతారాంను ఇటీవలే ఎమ్మెల్సీగా అక్క డి బీజేపీ గవర్నర్ ఎట్లా ఆమోదించారు?
కర్ణాటకలో ఉమాశ్రీని గవర్నర్ ఎలా నామినేట్ చేశారు? అని కేటీఆర్ ప్రశ్నించారు.
కిషన్‌రెడ్డి అసమర్థ కేంద్ర మంత్రి
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అంబర్‌పేటలో వచ్చే ఎన్నికల్లో ఏ అర్జున అవార్డీని రంగంలోకి దింపుతారో వేచిచూద్దామని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీలుగా అర్జున అవార్డు గ్రహీతను చేయాల్సి ఉండేదని కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యపై మంత్రి స్పందిస్తూ 'వచ్చే ఎన్నికల్లో కిషన్‌రెడ్డి ఏ అర్జున అవార్డీని దింపుతారో చూద్దాం' అని పేర్కొన్నారు. దేశంలో అత్యంత అసమర్థ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అని ఆరోపించారు. సొంత నియోజకవర్గంలో కనీసం ఒక ఫ్లై ఓవర్‌ను కూడా పూర్తి చేయలేని వ్యక్తి గురించి మాట్లాడటం దండుగ అని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.
గవర్నర్ల వ్యవస్థ అవసరమా?
వలసవాదానికి గుర్తుగా ఉన్న గవర్నర్ల వ్యవస్థ దేశానికి అవసరమా? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. 'తమిళనాడు గవర్నర్ ఆ రాష్ట్ర పేరునే మారుస్తామంటున్నారు.
మరో రాష్ట్ర గవర్నర్ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వంతో సంబంధం లేకుండా నిర్ణయం తీసుకుంటున్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలకు విలువ లేకపోతే ఈ ప్రభుత్వాలెందుకు? దేశంలో ఇంకా వలసవాద వాసనలు వస్తున్నాయి కనుక రాజ్‌పథ్ పేరు తీసేసి కర్తవ్యపథ్ పెడ్తున్నా అని ప్రధాని మోదీ అన్నారు. వలసవాదులు ఏలినప్పుడు పెట్టిన వైస్రాయ్‌లే నేటి గవర్నర్లు కదా? అలాంటప్పుడు ఈ గవర్నర్ల వ్యవస్థ అవసరమా? ఈ విషయాన్ని ప్రజలు ఆలోచించాలి' అని సూచించారు.
Oct 13 2023, 16:57