తెలంగాణ లో పోలీసుల ముమ్మర తలిఖీలు పట్టుబడిన 5 లక్షల
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఫలితంగా.. ఎన్నికల కోడ్ కూడా నిన్నటి నుంచే అమల్లోకి వచ్చింది. ఇంకేముంది.. ఓవైపు ఎన్నికల ఏర్పాట్లు చకచకా జరిగిపోతుంటాయి. షెడ్యూల్ ప్రకారం ఎలక్షన్ ప్రక్రియ కొనసాగుతుంటుంది. ఇదంతా ఒకవైపు మాత్రమే.. ఇంకోవైపు రాజకీయ నాయకుల ప్రచారాలు, వ్యూహాలు నడుస్తూనే ఉంటాయి.
ఈ నేపథ్యంలోనే అక్రమ మద్యం, నగదు పెద్ద ఎత్తున తరలిస్తుంటారు. కాగా.. ఈ ఎన్నికల్లో ఇలాంటి వాటికి ఏమాత్రం చోటివ్వకుండా కఠిన బందోబస్తు ఏర్పాటు చేసినట్టు అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే ఎన్నికల కోడ్ అమలు కావటంతో.. తనిఖీలు కూడా మొదలుపెట్టేశారు అధికారులు. అంతేనా.. ఎన్నిక కోడ్ అమల్లోకి వచ్చిన కొద్ది సేపటికే తనిఖీల్లో బోణీ నమోదైంది.
రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు తనిఖీలు మొదలుపెట్టారు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి.. అనుమానం వచ్చిన ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే.. ఖమ్మం జిల్లాలోని వైరాలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు.. ఓ కారును ఆపి చెక్ చేశారు. కాగా.. ఆ కారులో రూ.5 లక్షల రూపాయలు పట్టుబడ్డాయి. ఆ నగదుకు సంబంధించి సరైన పత్రాలు లేకపోవటంతో పోలీసులు కేసు నమోదు చేసి ఆ డబ్బును స్వాధీనం చేసుకున్నారు .
ఆంధ్రప్రదేశ్‌లో వెస్ట్ గోదావరి జిల్లాకు చెందిన టీడీపీ నాయకురాలు మాజీ జిల్లా పరిషత్ ఛైర్మన్‌కు ఇమ్మని రాజేశ్వరి తన వ్యవసాయ భూమికి చెందిన 5 లక్షల రూపాయలు తీసుకొని కారులో హైదరాబాద్ వెళ్తుండగా వైరా రింగ్ రోడ్ సెంటర్‌లో వైరా ఎస్సై మేడ ప్రసాద్ వాహనాలు చెకింగ్ చేస్తుండగా.. ఎలాంటి అనుమతి పత్రాలు లేవని నగదు స్వాధీనం చేసుకున్నారు.
స్వాధీనం చేసుకున్న 5 లక్షల రూపాయల నగదును ఐటీ అధికారులకు అప్పగిస్తామని తెలిపారు
ఇదిలా ఉంటే.. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఈసీ అధికారుల ఆదేశాల మేరకు పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.
షెడ్యూల్ విడుదలకు ముందే.. సుమారు 14 వేల లీటర్లకు పైగా అక్రమ మద్యాన్ని ఎక్సైజ్ శాఖ అధికారులు స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. అయితే.. ఇదంతా అక్టోబర్ 5 న జరిగిన సమీక్షా సమావేశం తర్వాత నుంచి చేసిన తనిఖీల్లోనే ఇంత మద్యాన్ని పట్టుకున్నారు. అంతేకాదు 170 కిలోల గంజాయి కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు...
Oct 12 2023, 16:19