తెలంగాణలో కారు స్పీడ్ పెంచుతున్న హరీష్ రావు కేటీఆర్
రాష్ట్రంలో ‘కారు’ స్పీడ్ పెంచింది. ప్రజలకు మరింత చేరువ కావడానికి కారును మరింత వేగంగా ప్రజల చెంతకు తీసుకువెళుతున్నారు.అధికార బిఆర్‌ఎస్ పార్టీ ఒక పక్క అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభిస్తూనే, మరో పక్క పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ ఎన్నికలకు సిద్ధమవుతోంది.
ఏ క్షణమైనా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాలతో మంత్రులు, ఎంఎల్‌ఎలు వారి వారి నియోజకవర్గాలలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తూ ప్రజలకు మరింత చేరువ కావడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఒక్కొక్క రోజు 15 నుంచి 25కు పైగా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
ప్రతిపక్షాలు అభ్యర్థులను ప్రకటించి నియోజకవర్గాలకు ప్రచారం కోసం వచ్చేవరకు సమస్యలను అన్నింటినీ పరిష్కరించుకొని ఎన్నికలకు సిద్ధం కావాలన్న లక్ష్యంతో మంత్రులు, ఎంఎల్‌ఎలు ఉన్నారు.
కెటిఆర్, హరీష్ రావు సుడిగాలి పర్యటనతో కార్యకర్తలు ఫుల్ జోష్ తో ఉన్నట్లు తెలుస్తుంది
రాష్ట్రంలో బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్, బిఆర్‌ఎస్ కీలక నాయకులు, మంత్రి హరీశ్‌రావులు జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.
బిఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు కీలక నేతలు నియోజకవర్గాల్లో పర్యటిస్తుండటంతో పార్టీ కేడర్‌లో జోష్ పెరుగుతోంది. మంత్రులు కెటిఆర్, హరీశ్‌రావులు ఒక్కపక్క అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ప్రారంభిస్తూనే మరో పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటూ కేడర్‌లో భరోసా నింపుతున్నారు.
ఇద్దరు నేతలు హెలికాప్టర్‌లో జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తూ ఒక్కో రోజు దాదాపు 5 నుంచి 10కిపైగా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. బలంగా అసమ్మతి ఉన్న నియోజకవర్గాలలో ఇప్పటికే సంప్రదింపులు జరిపి అసమ్మతిని చల్లార్చింది.
అసమ్మతి ఉన్న నియోజకవర్గాలలో అభ్యర్థుల విషయంలో పార్టీ కేడర్‌కు స్పష్టతనిస్తూ అభ్యర్థిని గెలిపించేలా నాయకులు, కార్యకర్తలు కృషి చేసేందుకు సమాయత్తం చేస్తున్నారు....
Oct 08 2023, 20:46