గురుకులాల్లో చేపల కూర.. దసరా తర్వాత అమలు
బీసీ గురుకులాల్లోని విద్యార్థులకు భోజనంలో చేపల కూర అందించాలని ఫిష్ ఫెడరేష న్ నిర్ణయించింది. దసరా తర్వాత అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నది.
ప్రస్తుతానికి ఈ పథకాన్ని కేవలం ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని నిర్ణయించినట్టు ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ తెలిపారు.
జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల పరిధిలోని 33 బీసీ గురుకులాల్లో 15 వేల మందికి లబ్ధి చేకూరనున్నది. ప్రతి బుధవారం చేపల కూరను అం దించనున్నట్టు తెలిపారు.
ఒ క్కో విద్యార్థికి 150 గ్రాముల చొప్పున, 15 వేల మందికి ప్రతివారం సుమారు 22 క్వింటాళ్ల చేపలు అవసరం కానున్నాయి. ముళ్లు లేని చేపలను విద్యార్థులకు అందించనున్నారు.
పాఠశాలల్లో చేపలు శుభ్రం చేయాల్సిన అవసరం లేకుండా రెడీ టు కుక్ విధానంలో అందించనున్నారు. ఇప్పటికే చేపల సరఫరాదారులతోనూ అధికారులు సమావేశమై చర్చించారు.
చేపల వంటకాన్ని రుచిగా చేసేందుకు స్కూళ్లలోని వంట మనుషులకు ఒక రోజు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు....
Oct 08 2023, 14:19