దసరా సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణలో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగల్లో దసరా మొదటి వరుసలో ఉంటుంది. అందుకే స్కూల్స్, కాలేజీలకు ముందుగానే సెలవులు ప్రకటించారు.
ఈ సందర్భంగా బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకొని రాష్ట్రంలోని బడులకు విద్యాశాఖ సెలవులు ప్రకటించింది. అక్టోబర్ 13వ తేదీ నుంచి అక్టోబర్ 25వ తేదీ వరకు 13 రోజుల పాటు ప్రభుత్వ, ప్రైవేట్ బడులకు సెలవులు ఉంటాయని తెలిపింది.
ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని రకాల స్కూళ్లు ఈ సెలవులను పాటించాలని సూచించింది. అలాగే తెలంగాణలోని ఇంటర్మీడియట్ కాలేజీలకు మాత్రం 19 నుంచి 25 వరకు సెలవులివ్వాలని వెల్లడించింది.
తెలంగాణలో దసరా సెలవులు గతేడాది 14 రోజులు ఉండగా.. ఈసారి మాత్రం 13 రోజులే ఇచ్చారు. తిరిగి అక్టోబర్ 26న పాఠశాలల తిరిగి తెరుచుకోనున్నాయి. తెలంగాణ ప్రజలు అక్టోబర్ 24వ తేదీన దసరా పండగ జరుపుకోనున్నారు. అక్టోబర్ 22న దుర్గాష్టమి అదే రోజు బతుకమ్మ పండుగ నిర్వహిస్తారు.
ఈ నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీలు, కార్యాలయాలకు తెలంగాణ ప్రభుత్వం ముందుగానే సెలవులు ప్రకటించింది...
Oct 06 2023, 10:01