2000 Note: 2000 నోట్ల మార్పిడికి ముగుస్తున్న డెడ్‌లైన్.. తర్వాత ఏంటి?
రెండు వేల రూపాయల నోట్ల మార్పిడికి (2000 Note exchange) ఆర్‌బీఐ (RBI) ఇచ్చిన గడువు దగ్గర పడింది. సెప్టెంబర్ 30తో గడువు తీరబోతోంది..
ఒకవేళ ఇప్పటికీ మీ దగ్గర రూ.2 వేల నోట్లు ఉంటే.. మార్చుకోవడానికి ఇంకా మూడు రోజులే గడువు ఉంది. అయితే, డెడ్‌లైన్ తర్వాత రూ.2 వేల నోట్ల పరిస్థితి ఏంటి?
ఆర్‌బీఐ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందన్నది? ఆసక్తిగా మారింది. దీనిపై ఇప్పటి వరకు ఆర్‌బీఐ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు..
పెద్ద నోట్ల రద్దు అనంతరం 2016లో రూ.2 వేలు నోట్లను ఆర్‌బీఐ అందుబాటులోకి తెచ్చింది. 'క్లీన్ నోట్ పాలసీ'లో భాగంగా ఈ ఏడాది మే నెలలో ఉప సంహరించుకుంది.
నోట్లను రద్దు చేయలేదు. అంటే ఇప్పటికీ లీగల్ టెండర్‌గానే (నోట్లకు చట్టబద్ధత) రూ.2వేల నోటు కొనసాగుతోంది. అయితే, ఇప్పటికే పలు దుకాణాలు, పెట్రోల్ బంకులు రూ.2 వేల నోట్లను తీసుకోవడానికి నిరాకరిస్తున్నాయి.
వాస్తవానికి నోట్ల మార్పిడికి ఆర్‌బీఐ దాదాపు 4 నెలల గడువు ఇచ్చింది. సెప్టెంబర్ 1 నాటికే దాదాపు 93 శాతం నోట్లు వెనక్కి వచ్చినట్లు ఆర్‌బీఐ గణాంకాలు చెప్తున్నాయి.
ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 30 తర్వాత కూడా రూ.2 వేల నోట్ల మార్పిడికి బ్యాంకుల్లో మరో అవకాశం ఇవ్వకపోవచ్చని తెలుస్తోంది. అయితే, నిర్దిష్ట గడువులోగా ఉపసంహరణ లక్ష్యం నెరవేరకపోతే లీగల్ టెండర్‌గా కొనసాగిస్తామని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఇప్పటికే ఓ సందర్భంలో చెప్పారు..
Streetbuzz News
![]()
Streetbuzz News







SB NEWS





















Oct 04 2023, 12:03
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
59.2k