తెలంగాణలో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోడీ
ప్రధాని మోడీ మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. అక్టోబరు 1న హైదరాబాద్‌తోపాటు మహబూబ్‌నగర్ జిల్లాల్లో ప్రధాని మోడీ పర్యటించాల్సి ఉంది.
ముందస్తు షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్‌లో ఆయన పలు అభివృద్ధి పనులకు బేగంపేట ఎయిర్‌పోర్టులోనే శంకుస్తాపన చేయాల్సి ఉంది.
అయితే మారిన షెడ్యూల్ మేరకు ప్రధాని బేగంపేట ఎయిర్‌పోర్టుకు కాకుండా ప్రత్యేకంగా విమానంలో నేరుగా శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు.
అక్టోబరు 1న మధ్యాహ్నం 1.30 కు ప్రధాని శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 1.35 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్‌లో మహబూబ్‌నగర్‌కు బయల్దేరి వెళతారు.
2.10గంటలకు మహబూబ్‌నగర్‌కు చేరకుని 2.50 గంటల వరకు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారు.
అనంతరం 3 గంటల నుండి 4 గంటల వరకు బహిరంగసభలో ప్రసంగిస్తారు. అనంతరం 4.10 నిమిషాలకు మహబూబ్‌నగర్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వస్తారు. సాయంత్రం 4.50గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ కి తిరిగి వెళ్లనున్నారు...
![]()
Streetbuzz News





















SB NEWS



Sep 28 2023, 09:22
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
8.8k