నల్లగొండ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవం
నల్లగొండ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవం
వీరనారి చాకలి ఐలమ్మ 128వ జయంతి సందర్భంగా నల్లగొండ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సాగర్ రోడ్ లో ఉన్నటువంటి చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలతో ఘనంగా నివాళులర్పించడం జరిగింది బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ...
భూమి కోసం భుక్తి కోసం వ్యక్తి చాకిరి కోసం ఉద్యమించినటువంటి గొప్ప వీరనారి చాకలి ఐలమ్మ వరంగల్ జిల్లాలో పుట్టి తాను ఆనాడు నిజాం ప్రభులకు విష్ణు రామచంద్రరావు తో పోరాటం చేసినటువంటి గొప్ప వీరనారి వారి జయంతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేయడం బీసీ సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం చేశారు.
కానీ బడుగు బలహీన వర్గాలు రాజ్యాధికారంలో వాటా పంచుకోనంతవరకు ఈ రాష్ట్రం బంగారు తెలంగాణ కాదని గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పటికైనా మహిళా రిజర్వేషన్లు బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని స్థానిక సంస్థల్లో 33 శాతం ఉన్నటువంటి దాన్ని 18 శాతాన్ని గుద్దిస్తూ ఎన్నికలకు పోయినటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని చట్టసభల్లో 50% రిజర్వేషన్ ఇవ్వాలని అదేవిధంగా జనాభాలో లో కులగన జరపాలని నలగొండ బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు వంగూరి నారాయణ యాదవ్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు మున్నాస ప్రసన్నకుమార్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మామిడి పద్మ బిసి సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి యాదగిరి జిల్లా కార్యదర్శి మార్గం సతీష్ కుమార్ యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భరత్ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రచార కార్యదర్శి కల్లూరు సత్యం గౌడ్ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పగిళ్ల కృష్ణ బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షురాలు ఖమ్మం పార్టీ దుర్గ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయం చేసినారు.
sb news
sb news telangana
SB NEWS TELANGANA
Sep 26 2023, 22:16