ట్యాంక్ బండ్ పై గణేష్ మండప నిర్వహకుల ఆందోళన
ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించిన ట్యాంక్ బండ్ పై కచ్చితంగా నిమజ్జనం చేస్తామని గణేష్ మండప నిర్వహకులు చెబుతున్నారు.
దీంతో మండపం నిర్వాహకులు ట్యాంక్ బండ్ పై ఆందోళన కూడ నిర్వహిస్తున్నారు. ఓవైపు అధికారులు మహానగరంలో ప్రతిష్టించిన పీఓపీ విగ్రహాలెన్ని అన్న విషయంపై సర్కారుకు గానీ, జీహెచ్ఎంసీకి గానీ ఎలాంటి సమాచారం లేదు.
కానీ మహానగరంలో ఒక అడుగు నుంచి మొదలుకుని 20 నుంచి 30 అడుగుల ఎత్తు వరకు కూడా ప్రతిష్టించిన పీఓపీ విగ్రహాలు లక్షల్లోనే ఉంటాయన్నది ప్రాథమిక సమాచారం.
అయిదడుగుల కన్నా ఎక్కువ ఎత్తు కల్గిన విగ్రహాలు సుమారు మూడు నుంచి మూడున్నర లక్షల వరకుంటాయని ఓ అంచనా ఉంది. వీటిని ఎక్కడ నిమజ్జనం చేయించాలన్నది ప్రస్తుతం జీహెచ్ఎంసీ ముందున్న ఓ బిగ్ ఛాలెంజ్.
హుస్సేన్ సాగర్ మినహా నిమజ్జనం నిర్వహించే మిగిలిన 32 చెరువుల వద్ద నిమజ్జనం కోసం ఏర్పాట్లు చేద్దామనుకుంటే, విగ్రహాలతో వచ్చే భారీ వాహానాలు కనీసం చెరువు వరకు చేరుకునేందుకు వీలుగా లేని పరిస్థితులున్నట్లు సమాచారం.
ప్రస్తుతం సిటీలో జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన కొలనులను ఇంకా కాస్త లోతుగా చేసి, అయిదడుగుల కన్నా ఎక్కువ ఎత్తున్న విగ్రహాలను నిమజ్జనం చేస్తూ, ఎప్పటికపుడు వ్యర్థాలను బయటకు తీసి, మరో విగ్రహాన్ని నిమజ్జనం చేసేలా ఏర్పాటు చేస్తారా? లేక ఎప్పటి లాగానే కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ ట్యాంక్ బండ్ వైపు మళ్లిస్తారా? వేచి చూడాలి..మరి
SB NEWS
Streetbuzz News
Streetbuzz News
Streetbuzz News
Sep 26 2023, 10:17