మైనంపల్లి ఇంటికి కాంగ్రెస్ నేతల క్యూ
మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఇంటికి సోమవారం ఉదయం కాంగ్రెస్ నేతలు వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ అంజన్ కుమార్ యాదవ్ మల్లురవి తదితరులు వెళ్లనున్నారు.
ఈ సందర్భంగా మైనంపల్లిని కాంగ్రెస్‌లోకి ఆహ్వానించనున్నారు. దూలపల్లిలోని మైనంపల్లి ఇంటికి ఈ ఉదయం 9 గంటలకు కాంగ్రెస్ నేతలు వెళ్లనున్నారు.
కాగా బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్‌లో చేరడం దాదాపుగా ఖరారైంది. ఇప్పటికే ఢిల్లీ స్థాయిలో ఆ పార్టీ అగ్రనేతలతో ఆయన సంప్రదింపులు పూర్తయ్యాయి.
ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే సమక్షంలో మైనంపల్లి హనుమంతరావు, ఆయన కుమారుడు రోహిత్ కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఇందుకు ఈనెల 27న ముహూర్తం కుదిరిందని మైనంపల్లి సన్నిహిత వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
వాస్తవానికి మెదక్ సీటును తన కుమారుడు రోహిత్‌కు కేటాయించాలంటూ గతంలో బీఆర్‌ఎస్ అధిష్ఠానం ముందు మైనంపల్లి ప్రతిపాదన పెట్టారు.
అయితే మైనంపల్లిని మల్కాజిగిరి అభ్యర్థిగా ప్రకటించిన సీఎం కేసీఆర్.. మెదక్ సీటును సిటింగ్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డికే ఇచ్చారు. ఈ పరిణామంతో తీవ్ర అసంతృప్తికి లోనైన మైనంపల్లి.. మంత్రి హరీశ్‌రావుపైన, పార్టీ పైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
తాజాగా బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి.. మల్కాజిగిరి టికెట్‌నూ నిరాకరిస్తున్నట్లు ప్రకటించారు.ఇదే క్రమంలో మైనంపల్లి తో కొద్దిరోజులుగా కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు సంప్రదింపులు జరుపుతున్నారు.
తనకు మల్కాజిగిరితో పాటుగా తన కుమారునికి మెదక్ సీటునూ కేటాయించాలంటూ మైనంపల్లి ప్రతిపాదించారు....
Sep 25 2023, 12:25