ప్రగతిభవన్ ను ముట్టడించిన ఉపాధ్యాయులు
తమ సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్‌తో ప్రగతి భవన్ ముట్టడికి 317 జీవో ద్వారా ఇబ్బందులు పడుతున్న నాన్ స్పౌజ్ ఉపాధ్యాయులు ప్రయత్నించారు.
దీంతో ప్రగతి భవన్ పరిసరాలు అట్టుడికి పోయాయి. నాన్ స్పౌస్ ఉపాధ్యాయ బాధితులు తమను స్థానిక జిల్లాలకు పంపించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కు వినతి ఇచ్చేందుకు ప్రగతి భవన్ వద్దకు వెళ్లినట్టు పలువురు టీచర్లు చెబుతున్నారు.
వినతిపత్రం ఇవ్వడానికి పలు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రగతి భవన్‌కు బయలుదేరారు. పోలీసుల బారికేడ్లను కూడా ఛేదించుకుని ప్రగతి భవన్ సమీపం వరకు చేరుకున్నారు.
దీంతో పోలీసులు వారిని అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ పూరిత వాతావరణం ఏర్పడింది.
పోలీసులు అడ్డుకోవడంతో టీచర్లు రోడ్డుపైనే బైఠాయించి నిరసనలు తెలిపారు. పలువురు కేసీఆర్ మాస్కులను ధరించి మూకుమ్మడిగా ప్రగతి భవన్ రోడ్లపైకి వచ్చిన నిరసన తెలిపారు.
స్థానికత పునాదుల మీద ఏర్పడిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో స్థానికత అనే అంశమే పరిహాసంగా మారిందని టీచర్లు ఆవేదన వ్యక్తంచేశారు...
Sep 25 2023, 12:19