మహిళా హక్కుల రక్షణ, భద్రతా భరోసా కొరకు చలో ఢిల్లీ జయప్రదం చేయండి.
మహిళా హక్కుల రక్షణ, భద్రతా భరోసా కొరకు చలో ఢిల్లీ జయప్రదం చేయండి.
పాలడుగు ప్రభావతి ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పిలుపు
మహిళా హక్కుల రక్షణ భద్రత భరోసా కై అక్టోబర్ 5న చలో ఢిల్లీ కార్యక్రమం జయప్రదం చేయాలని ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పాలడుగు ప్రభావతీ పిలుపునిచ్చారు
శనివారం రోజున నల్లగొండ భాస్కర్ టాకీస్ వద్ద జీపు ప్రచార జాత సభను ప్రారంభించి మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభావతి మాట్లాడుతూ ఎన్నో పోరాటాల ఫలితంగా సంవత్సరాలు గా కాలయాపన చేసి నేడు మహిళా రిజర్వేషన్ 33% బిల్లును ఆమోదించారని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం మానుకోవాలని చిత్తశుద్ధితో జరిగే అసెంబ్లీ తదుపరి పార్లమెంటు లో అమలు చేయాలన్నారు.
బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో మహిళలపై ఆకృత్యాలు ఎక్కువ అయ్యాయని అన్నారు. మహిళలపై రోజురోజుకు హింస, లైంగిక దాడులు, అత్యాచారాలు తీవ్రతరమైపోతున్నాయని భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటినా మహిళల రక్షణకై మార్పు రాలేదన్నారు. పార్లమెంటు వేదికగా మహిళా రక్షణ కోసం అనేక చట్టాలు రూపొందిస్తున్నా ఆచరణలో ప్రభుత్వాలు అమలు చేయడం లేదన్నారు. బేటి బచావో బేటి పడావో అని చెప్తున్న బిజెపి ప్రభుత్వం నేరగాళ్లకే కొమ్ముకాస్తుందన్నారు. అత్యాచారాలకు లైంగిక వేధింపులకు పాల్పడేవారిలో బిజెపి ఎంపీ బ్రిజ్ భూషణ్ లాంటి వారే అగ్రస్థానంలో ఉన్నారన్నారు. మహిళల పై జరుగుతున్న వివిధ రకాల దాడులను నివారించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. ఉపాధి హామీ పనులు సంవత్సరానికి ₹200 రోజులు కల్పించి 600 వేతనాలు ఇవ్వాలన్నారు కేరళ తమిళనాడు ప్రభుత్వాల మాదిరిగా ప్రభుత్వ రేషన్ దుకాణాల ద్వారా 14 రకాల సరుకులు సబ్సిడీ ధరలకు అందించాలని కోరారు ఇంటి జాగాలేని పేదలకు 125 గజాల భూమి ఇచ్చి ఇంటి నిర్మాణానికి కేంద్రం 10 లక్షలు రాష్ట్ర 5 లక్షలు ఇవ్వాలని కోరారు.
మహిళా హక్కుల కోసం పోరాడుతున్న అతిపెద్ద మహిళా సంఘంగా ఐద్వా క్రియాశీలక పాత్ర పోషిస్తూ మహిళల పట్ల జరుగుతున్న వివిధ సంఘటన పట్ల ఎప్పటికప్పుడు స్పందిస్తూ మహిళల ను రక్షించుకోవడం కోసం,మరిన్ని హక్కులను సాధించుకోవడం బలమైన ఉద్యమాలను నిర్మించింది అన్నారు. అందులో బాగంగానే అక్టోబర్ 5 న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున మహిళలను సమీకరించి నిర్వహిస్తున్నామని ఇందుకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు పెద్ద ఎత్తున కదిలి రావాలని ప్రభావతి పిలుపునిచ్చారు.
ఐద్వా జిల్లా అధ్యక్షురాలు పోలే బోయిన వరలక్ష్మి మాట్లాడుతూ మాట్లాడుతూ మహిళా స్వేచ్ఛా స్వాతంత్యాలను కాపాడడం కంటే వారి హక్కులను ఏలా కాలరాయాలో బిజెపి ప్రభుత్వం శతవిధాల ప్రయత్నం చేస్తుందన్నారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందని నిత్యావసర సరుకుల ధరలు రోజురోజుకు చుక్కలంటాయని గ్యాస్ పెట్రోలు డీజిల్ ధరలు పెరిగిపోయాయి అన్నారు. ధరలను అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం చెందిందని అన్నారు.
ఈ జీపు ప్రచార జాత కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యురాలు కొండ అనురాధ ఉపాధ్యక్షురాలు తుమ్మల పద్మ సహాయ కార్యదర్శి భూతం అరుణకుమారి పాతూరి గోవర్ధన జిల్లా కమిటీ సభ్యురాలు గోలి వెంకటమ్మ బొల్లేపల్లి మంజుల ఎండి సుల్తానా జంజిరాల ఉమా చిన్నపాక మంజుల తదితరులు పాల్గొన్నారు.
Sb news
Sb news telangana
Sep 24 2023, 20:50