/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz నేడు పట్టాలెక్కిన 9వందే భారత్ రైళ్లు Yadagiri Goud
నేడు పట్టాలెక్కిన 9వందే భారత్ రైళ్లు

దేశవ్యాప్తంగా 9 వందే భారత్‌ రైళ్లు ఆదివారం పట్టాలెక్కాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా జెండా ఊపి వందే భారత్ రైళ్లను ప్రారంభించారు.

ఈరోజు మధ్యాహ్నం 12:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 9 వందే భారత్ రైళ్లను ఫ్లాగ్ చేశారు. ఈ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ.. ప్రయాణ సౌలభ్యంపై కేంద్రం దృష్టి సారించిందని

గత ప్రభుత్వాలు రైల్వేకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 25 వందే భారత్‌ రైళ్లు నడుస్తున్నాయి. ఇప్పుడు మరో 9 వందే భారత్‌ రైళ్లు ప్రారంభం అయ్యాయి.

త్వరలోనే దేశంలోని అన్ని ప్రాంతాలను అనుసంధానించే దిశగా కార్యచరన రూపొందిస్తున్నాం. భారతీయ రైల్వే బడ్జెట్‌ను కూడా కేంద్రం పెంచింది. మల్టీ-మోడల్ కనెక్టివిటీపై కూడా ప్రభుత్వం పనిచేస్తోంది.

వేగం, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలకు అనుగుణంగా వందే భారత్‌ రైళ్లు పనిచేస్తున్నాయి. కనెక్టివిటీ, మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగానికి ఇది ఒక ఉదాహరణ’ అంటూ ప్రధాని మోదీ కార్యక్రమంలో ప్రసంగించారు.

తాజాగా ప్రారంభించిన 9 వందే భారత్ రైళ్ల ద్వారా తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు వందే భారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. కాచిగూడ- యశ్వంత్‌పూర్‌, విజయవాడ-ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి.

ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, గవర్నర్ తమిళిసై కాచిగూడ రైల్వే స్టేషన్‌కు చేరుకుని కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.

ఆసియా గేమ్ లో సత్తా చాటిన భారత హాకీ జట్టు

ఆసియా కప్ లో భారత హాకీ జట్టు విశ్వరూపం చూపించింది. పూల్‌ ఏ ప్రిలిమనీ రౌండ్‌లో ఉజ్బెకిస్తాన్‌పై భారీ విజయాన్ని నమోదు చేసుకుంది.

చైనాలోని హాంగ్‌జో వేదికగా జరుగుతోన్న ఆసియా క్రీడల్లో భారత హాకీ జట్టు సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఏకంగా 16-0 తేడాతో ఉజ్బెకిస్తాన్‌పై అనూహ్య విజయాన్ని నమోదు చేసుకుంది.

ముగ్గురు భారత ఆటగాళ్లు హ్యాట్రిక్స్‌ సాధించారు. అలాగే లలిత్‌ ఉపాధ్యాయ్‌, వరుణ్‌ కుమార్‌ చెరో నాలుగు గోల్స్‌ చేయడం విశేషం.

మన్‌దీప్ సింగ్‌ మూడు గోల్స్‌ చేసి సత్తా చాటాడు. అభిషేక్‌, సుఖ్‌జీత్‌ సింగ్‌ అమిత్‌ రోహిదాస్‌, సంజయ్‌ ఒక్కో గోల్‌ చేశారు.

ఈ విజయంతో రెట్టించిన ఉత్సాహంతో ఉన్న భారత్‌ మంగళవారం సింగపూర్‌తో జరిగే మ్యాచ్‌లో తలపడనుంది. రెగ్యులర్‌ కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ సింగ్ లేకపోయినా భారత హాకీ జట్టు చెలరేగి ఆడింది.

తొలి క్వార్టర్‌లో లలిత్‌, వరుణ్‌లు 2-0 అధిక్యంతో నిలిచారు. అనంతరం అభిషేక్‌, మన్‌దీప్‌లు 4-0తో స్కోరు సాధించారు.

ఇక రెండో క్వార్టర్‌లోనూ భారత్‌ ఆధిక్యంలో నిలిచింది. ఆపై సుఖ్‌జీత్, మన్‌దీప్‌ జోడి కట్టడంతో భారత్‌ విజేతగా నిలిచింది...

ప్రగతి భవన్ ముట్టడికి గ్రూప్ 1 అభ్యర్థుల యత్నం

గ్రూప్-1 ప్రిలిమ్స్ హైకోర్టు రద్దు చేయడంతో ఆదివారం అభ్యర్థులు ప్రగతి భవన్ వైపు దూసుకొచ్చారు. గ్రూప్-1 అభ్యర్థులను పోలీసులు అదుపులోకి తీసుకొని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.

గ్రూప్-1 పరీక్షలలో అవకతవకలు జరగడానికి ప్రభుత్వం అలసత్వం కారణమని అభ్యర్థులు ఆరోపణలు చేస్తున్నారు. గ్రూప్-1 పరీక్షలు నిర్వహించడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడుతున్నారు.

రెండు మూడు సంవత్సరాల నుంచి గ్రూప్-1 కోసం ప్రిపేర్ అవుతున్నామని, ఇప్పటికే రెండు సార్లు పరీక్ష రద్దు కావడంతో అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

టిఎస్ పిఎస్సీని రద్దు చేయాలని నిరసన తెలియజేస్తున్నారు. పరీక్షలు సరిగా నిర్వహించని ప్రభుత్వం ఎందుకు అని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు.

నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటుందని దుమ్మెత్తిపోస్తున్నారు.

ఇప్పటికే పలు పరీక్షలు పేపర్లు లీక్ కావడంతో ప్రభుత్వంపై నిరుద్యోగులు విరుచుకపడుతున్నారు......

Nara Brahmani: నారా బ్రాహ్మణితో సమావేశమైన జనసేన నేతలు

రాజమహేంద్రవరం: తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో ఆయన కోడలు నారా బ్రాహ్మణిని జనసేన నేతలు కలిశారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నాయకులు ఆమెతో సమావేశమై సంఘీభావం తెలిపారు..

అనంతరం రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. జనసేన నేత కందుల దుర్గేష్‌, మాజీ మంత్రి చినరాజప్ప ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది.

చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ రెండు పక్షాలు ఉమ్మడిగా కలిసి నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఈ సందర్భంగా నిర్ణయించారు..

Nara Lokesh: వచ్చేవారం నారా లోకేశ్‌ 'యువగళం' తిరిగి ప్రారంభం..!

రాజోలు: తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో నిలిపివేసిన యువగళం పాదయాత్రను ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌.. వచ్చేవారం నుంచి ప్రారంభించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది..

చంద్రబాబు అరెస్టుతో పాదయాత్ర నిలిచిన ఉమ్మడి తూ.గో. జిల్లా రాజోలు నియోజకవర్గం పొదలాడ నుంచే యువగళాన్ని తిరిగి ప్రారంభించనున్నారు.

చంద్రబాబు అరెస్టు, తదనంతర పరిణామాలపై పార్టీ ముఖ్యనేతలతో నారా లోకేశ్‌ ఇవాళ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ మద్దతుగా నిలుస్తున్న వివిధ వర్గాలకు ఆయన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలిపారు..

ఖైరతాబాద్‌కు పొటెత్తిన భక్తులు

ఖైరతాబాద్ గణేష్ పండుగ దేశంలోనే గణేష్ నవరాత్రుల ఉత్సవాలను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహిస్తారు.

మరోవైపు నగరంలో ఖైరతాబాద్ వినాయకుడికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ సారి దశమహా విద్యా గణపతిగా ఖైరతాబాద్ గణేషుడు కోలువైనాడు.

63 అడుగుల ఎత్తులో పూర్తి మట్టి విగ్రహంగా వరల్డ్ రికార్డ్ కూడా సృష్టించాడు. ఈ వినాయుకుడు ప్రతిష్టించిన దగ్గర నుంచి భారీగా భక్తులు దర్శనానికి వస్తుంటారు.

కాగా, ఇవాళ ఆదివారం కావడంతో భారీగా భక్తులు తరలివస్తున్నారు

ఉదయం నుంచి కూడా భక్తి శ్రద్ధలతో గణేషుడిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు. మరోవైపు లంబోధరుడితో సెల్ఫీలు తీసుకుంటున్నారు.

దీంతో ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. సెక్యూరిటీ చెకింగ్స్.. ఒక పక్క భక్తులను లైన్‌లో పంపడం, మరో పక్క ట్రాఫిక్ కంట్రోల్ చేయడంలో పోలీసులు తిప్పలు పడుతున్నారు........

SB NEWS

Streetbuzz News

నిఘా పర్యవేక్షణ లో హైదరాబాద్ అగ్రస్థానం

దేశంలోనే అత్యధిక సీసీ కెమెరాలతో పటిష్టమైన భద్రత వ్యవస్థను కలిగిన రెండో నగరంగా హైదరాబాద్‌ రికార్డు సాధించింది.

విశ్వవ్యాప్తంగా తొలి 50 నగరాల జాబితాలో 41వ స్థానంలో నిలిచింది. అత్యుత్తమ సర్వేలైన్స్‌ వ్యవస్థను కలిగిన తొలి 20 జాబితాలో చైనాలోని పలు నగరాలు నిలవగా..

ఉత్తమ 50 నగరాల్లో భారత్‌ నుంచి ఢిల్లీ 22వ స్థానంతోపాటు హైదరాబాద్‌ 41వ స్థానంలో ఉన్నాయి.

అంతర్జాతీయ స్థాయిలో మెరుగైన పర్యవేక్షణ వ్యవస్థను కలిగిన నగరాల జాబితాను రూపొందించిన ప్రముఖ అధ్యయన సంస్థ వరల్డ్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ సంస్థ…

తాజా జాబితాను ఎక్స్‌ ట్విట్టర్‌,లో విడుదల చేసింది. జనాభా, సీసీ కెమెరాలు, నగర విస్తీర్ణం వంటి అంశాలను పరి గణనలోకి తీసుకుని రూపొందించిన ఈ జాబితాలో హైదరాబాద్‌కు ఉత్తమ స్థానం దక్కింది...

SB NEWS

Streetbuzz News

Streetbuzz News

Streetbuzz News

ఆసియా క్రీడల్లో భారత్‌ శుభారంభం

చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్‌ పతకాల వేట ప్రారంభించింది.

మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ టీమ్‌ ఈవెంట్‌లో ఇండియాకు తొలి పతకం లభించింది.

రమిత, మొహులీ ఘోష్‌, ఆషి చౌక్సీతో కూడిన మహిళల జట్టు 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో రజత పతకం సాధించింది.

చైనా 1896.6 పాయింట్లతో గోల్డ్‌ మెడల్‌ సాధించగా, 1886 పాయింట్లతో భారత్‌ రెండో స్థానంలో నిలిచింది. ఇక 1880 పాయింట్లతో మంగోలియా జట్టు కాంస్యా పతకం గెలుచుకున్నది...

SB NEWS

Streetbuzz News

SB NEWS

Streetbuzz News

*STREETBUZZ NEWS "

మహిళా రిజర్వేషన్ బిల్లుకు టీ ఎస్ కాంగ్రెస్ వ్యతిరేకమా ❓️

కాంగ్రెస్ ఎంపీలు రేవంత్, ఉత్తమ్ కోమటిరెడ్డి వెంకట్ రాజకీయ విలువలకు తిలోదకాలిచ్చారు.

లోక్ చరిత్రాత్మకమైన మహిళా రిజర్వేషన్ బిల్లు ఓటింగ్ సమయంలో ఈ ముగ్గురు ఎంపీలు బయటకు వెళ్లిపోయారు.

మహిళా బిల్లుకు మద్దతుగా ఓటు వేయకుండా తప్పించుకొన్నారు. వీళ్లు వెళ్లింది మరెక్కడికో కాదు.. పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక పంచాయితీకి.

ఓవైపు లోక్ చరిత్రాత్మకమైన బిల్లుపై ఓటింగ్ జరుగుతుంటే.. తమకేమీ సంబంధం లేదన్నట్టుగా ఈ ముగ్గురు ఎంపీలు ఓటు వేయకుండా బయటకు వెళ్లిపోవడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నది.

బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన కాంగ్రెస్ ఎంపీలపై మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

చరిత్రాత్మక మహిళా బిల్లుకు మద్దతుగా ఓటు వేయకుండా కాంగ్రెస్ ఎంపీలు రేవంత్, కోమటిరెడ్డి వెంకట్ ఉత్తమ్ కుమార్ మహిళా లోకానికి తీరని అన్యాయం, నమ్మకద్రోహం చేశారని బీఆర్ నేత డాక్టర్ దాసోజు శ్రవణ్ మండిపడ్డారు.

వీరంతా తమ విధులను నిర్వర్తించకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించి నమ్మిన ప్రజలకు వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు.

టికెట్ల పంచాయితీలో కొట్లాడుకుంటూ ఓటు వేయకుండా మహిళల పట్ల బాధ్యతలేకుండా వ్యవహరించారని దుయ్యబట్టారు.

మహిళలకు క్షమాపణ చెప్పేవరకు వారిని తెలంగాణ గడ్డపై అడుగుపెట్టనివ్వొద్దని అన్నారు.

తిరుపతిలో ఆదివారం కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమల లో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం సెలవురోజు కావడంతో తిరుమలకు అధిక సంఖ్యలో భక్తులు చేరుకుంటున్నారు.

దీంతో శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి.

టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు వెల్లడించారు.

టైమ్ స్లాట్ దర్శనానికి 4 గంటల సమయం, రూ.300 ప్రత్యేక దర్వనానికి కూడా 3 గంటల సమయం పడుతోందని తెలిపారు.

కాగా, శనివారం 74,884 శ్రీవారిని మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

తిరుమలలో నిన్న 32,213 మంది భక్తులు నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించారు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.7కోట్లు వచ్చిందని టిటిడి అధికారులు వెల్లడించారు.

Streetbuzz News