ఖైరతాబాద్‌కు పొటెత్తిన భక్తులు
ఖైరతాబాద్ గణేష్ పండుగ దేశంలోనే గణేష్ నవరాత్రుల ఉత్సవాలను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహిస్తారు.
మరోవైపు నగరంలో ఖైరతాబాద్ వినాయకుడికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ సారి దశమహా విద్యా గణపతిగా ఖైరతాబాద్ గణేషుడు కోలువైనాడు.
63 అడుగుల ఎత్తులో పూర్తి మట్టి విగ్రహంగా వరల్డ్ రికార్డ్ కూడా సృష్టించాడు. ఈ వినాయుకుడు ప్రతిష్టించిన దగ్గర నుంచి భారీగా భక్తులు దర్శనానికి వస్తుంటారు.
కాగా, ఇవాళ ఆదివారం కావడంతో భారీగా భక్తులు తరలివస్తున్నారు
ఉదయం నుంచి కూడా భక్తి శ్రద్ధలతో గణేషుడిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు. మరోవైపు లంబోధరుడితో సెల్ఫీలు తీసుకుంటున్నారు.
దీంతో ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. సెక్యూరిటీ చెకింగ్స్.. ఒక పక్క భక్తులను లైన్‌లో పంపడం, మరో పక్క ట్రాఫిక్ కంట్రోల్ చేయడంలో పోలీసులు తిప్పలు పడుతున్నారు........
SB NEWS
Streetbuzz News
Sep 24 2023, 16:53