మహిళా రిజర్వేషన్ బిల్లుకు టీ ఎస్ కాంగ్రెస్ వ్యతిరేకమా ❓️
కాంగ్రెస్ ఎంపీలు రేవంత్, ఉత్తమ్ కోమటిరెడ్డి వెంకట్ రాజకీయ విలువలకు తిలోదకాలిచ్చారు.
లోక్ చరిత్రాత్మకమైన మహిళా రిజర్వేషన్ బిల్లు ఓటింగ్ సమయంలో ఈ ముగ్గురు ఎంపీలు బయటకు వెళ్లిపోయారు.
మహిళా బిల్లుకు మద్దతుగా ఓటు వేయకుండా తప్పించుకొన్నారు. వీళ్లు వెళ్లింది మరెక్కడికో కాదు.. పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక పంచాయితీకి.
ఓవైపు లోక్ చరిత్రాత్మకమైన బిల్లుపై ఓటింగ్ జరుగుతుంటే.. తమకేమీ సంబంధం లేదన్నట్టుగా ఈ ముగ్గురు ఎంపీలు ఓటు వేయకుండా బయటకు వెళ్లిపోవడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నది.
బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన కాంగ్రెస్ ఎంపీలపై మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
చరిత్రాత్మక మహిళా బిల్లుకు మద్దతుగా ఓటు వేయకుండా కాంగ్రెస్ ఎంపీలు రేవంత్, కోమటిరెడ్డి వెంకట్ ఉత్తమ్ కుమార్ మహిళా లోకానికి తీరని అన్యాయం, నమ్మకద్రోహం చేశారని బీఆర్ నేత డాక్టర్ దాసోజు శ్రవణ్ మండిపడ్డారు.
వీరంతా తమ విధులను నిర్వర్తించకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించి నమ్మిన ప్రజలకు వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు.
టికెట్ల పంచాయితీలో కొట్లాడుకుంటూ ఓటు వేయకుండా మహిళల పట్ల బాధ్యతలేకుండా వ్యవహరించారని దుయ్యబట్టారు.
మహిళలకు క్షమాపణ చెప్పేవరకు వారిని తెలంగాణ గడ్డపై అడుగుపెట్టనివ్వొద్దని అన్నారు.
Sep 24 2023, 10:14