మైనంపల్లి నేడు ఢిల్లీ పయనం
మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు హస్తినకు పయనం కానున్నారు. నేడు ఢిల్లీకి వెళ్లే అవకాశముందని తెలుస్తోంది.
ఈ పర్యటనలో భాగంగా ఢిల్లీలో కాంగ్రెస్ నేతలతో మైనంపల్లి భేటీ కానున్నారని సమాచారం.
శుక్రవారం రాత్రి బీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన ఆయన.. కాంగ్రెస్‌లో చేరికపై ఇవాళ కాంగ్రెస్ పెద్దలతో సంప్రదింపులు జరపనున్నారు.
ఈ నెలాఖరులోగా మైనంపల్లి హస్తం గూటికి చేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందులో భాగంగానే బీఆర్ఎస్‌కు రాజీనామా చేసినట్లు చెబుతున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేసేందుకు ఢిల్లీలో స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు రెండు రోజులపాటు జరిగాయి. ఈ సమావేశాల నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన ముఖ్యనేతలందరూ ఢిల్లీలోనే ఉన్నారు.
దీంతో మైనంపల్లి కూడా ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏఐసీసీ అగ్రనేతలతో భేటీ అనంతరం కాంగ్రెస్‌లో చేరికపై మైనంపల్లి అధికారికంగా ప్రకటన చేయనున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు.
కూత్బాల్లాపూర్ నుంచి మైనంపల్లికి, మెదక్ నుంచి ఆయన కుమారుడు రోహిత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేసే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది.
తండ్రీకొడుకులకు టికెట్ ఇస్తామని హామీ ఇవ్వడంతో మైనంపల్లి హస్తం గూటికి చేరుతున్నట్లు తెలుస్తోంది......










SB NEWS
SB NEWS






SB NEWS



. bit.Iy/368vgEt





Sep 23 2023, 09:34
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
3.3k