Sidharth Luthra: సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా మరో ట్వీట్
అమరావతి: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా తాజాగా ఎక్స్ (ట్విటర్) వేదికగా మరో పోస్ట్ పెట్టారు..
'ప్రతి రాత్రి తర్వాత ఉషోదయం ఉంటుంది. అది మన జీవితాల్లోకి కొత్త వెలుగులను మోసుకొస్తుంది' అంటూ ఆయన శుక్రవారం ట్వీట్ చేశారు.
చంద్రబాబు తరఫున హైకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్‌ను కొట్టేసిన నేపథ్యంలో లూథ్రా ఈ ట్వీట్ చేయడం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది.
చంద్రబాబు కేసును వాదిస్తునప్పటి నుంచి లూథ్రా వరుస ట్వీట్లు చేస్తున్నారు.
తమకు ఎదురవుతున్న అవమానాలను, అపహాస్యాన్ని పట్టించుకోవద్దన్న స్వామి వివేకానంద వ్యాఖ్యలను ఓ పోస్ట్‌లో ప్రస్తావించారు.
అన్ని ప్రయత్నాలూ చేసినా న్యాయం కనుచూపుమేర కనిపించనప్పుడు కత్తి పట్టడమే సరైందని, పోరాటమే శరణ్యం అంటూ లూథ్రా చేసిన ట్వీట్ కూడా ఆసక్తిని రేకెత్తించింది..
SB NEWS








SB NEWS



. bit.Iy/368vgEt











Sep 23 2023, 08:22
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
14.7k