Bhuma Akhila Priya: భూమా అఖిలప్రియ నిరాహార దీక్ష భగ్నం..
నంద్యాల: తెదేపా నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రెండు రోజులుగా ఆమె నిరాహార దీక్ష చేపట్టారు..
నంద్యాలలో చంద్రబాబును అరెస్టు చేసిన ఆర్కే ఫంక్షన్ హాల్ వద్ద ఆమె దీక్షకు దిగారు. ఆమె సోదరుడు జగత్ విఖ్యాత్‌రెడ్డి సైతం నిరవధిక దీక్షలో కూర్చున్నారు.
దీంతో పోలీసులు శనివారం వేకువ జామున ఆమె దీక్షను భగ్నం చేశారు. అక్కడి నుంచి ఆమెను నంద్యాల డీఎస్పీ మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ఆళ్లగడ్డకు తరలించారు.
ఆళ్లగడ్డలోని నివాసంలోనికి వెళ్లేందుకు ఆమె నిరాకరించారు. పోలీసుల వాహనంలోనే దీక్షను కొనసాగిస్తానని ఆమె పట్టుబట్టారు.
ఈ దశలో ఆళ్లగడ్డ పోలీసులు ఆమెను, ఆమె సోదరుడు విఖ్యాతరెడ్డిని ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేసి ఆమె నివాసానికి తరలించారు..
SB NEWS



SB NEWS




. bit.Iy/368vgEt













Sep 23 2023, 08:13
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
18.0k