పేదలను బ్రహ్మాండంగా ఆదుకోవాలని కేసీఆర్ ఆలోచన చేస్తున్నారు.. ఆ విషయాలను తొందరలోనే సీఎం చెబుతారు మంత్రి కేటీఆర్
పేదలను బ్రహ్మాండంగా ఆదుకోవాలని కేసీఆర్ ఆలోచన చేస్తున్నారు.. ఆ విషయాలను తొందరలోనే సీఎం చెబుతారు మంత్రి కేటీఆర్
ఢిల్లీ, బెంగళూరు నంచి వచ్చి వచ్చే హామీలను నమ్మి మోసపోవద్దని ప్రజలకు మంత్రి కేటీఆర్ సూచించారు. దుండిగల్‌లో రెండో విడత డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.
ఢిల్లీ, బెంగళూరు నంచి వచ్చి వచ్చే హామీలను నమ్మి మోసపోవద్దని ప్రజలకు మంత్రి కేటీఆర్ సూచించారు. దుండిగల్‌లో రెండో విడత డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. పనితో గెలవలేక.. ఇదివరకు ఏం చేసిండ్రో చెప్పలేక.. కొత్త రూపాల్లో వస్తున్నారని.. ఇష్టమొచ్చిన హామీలు ఇస్తున్నారని తెలిపారు. వాళ్లు ఇచ్చి హామీలు నమ్మి మోసపోదామా? అని ప్రశ్నించారు. ప్రజలు తొందరపడొద్దని.. ప్రజలు, రైతులపై కేసీఆర్ కంటే ఎక్కువ ప్రేమ ఉన్న నాయకులు భారతదేశంలో ఎవరైనా ఉన్నారా అని ఆలోచించుకోవాలని సూచించారు.
వాళ్లు చెప్పినదానికంటే ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు చేయాలని కేసీఆర్‌కు కూడా ఉందని అన్నారు. తప్పకుండా వాళ్లు చెప్పినదానికంటే బ్రహ్మాండగా పేదలను ఆదుకోవాలని కేసీఆర్ ఆలోచన చేస్తున్నారని తెలిపారు.
ఆ విషయాలను తొందరలోనే సీఎం కేసీఆర్ చెబుతారని పేర్కొన్నారు. కొత్తగా రాష్ట్రం ఏర్పాటైనప్పటికీ ఈ తొమ్మిదేండ్లలో అభివృద్ధి, సంక్షేమంలో జోడెద్దుల మాదిరిగా తెలంగాణ రాష్ట్రం ప్రగతి బాటలో ముందుకెళ్తున్నదని అన్నారు. ‘ ఒకప్పుడు హైదరాబాద్‌లో ఏ బస్తీకి పోయినా మంచి నీళ్ల కోసం లొల్లి. ఖైరతాబాద్ జలమండలి ముందు నుంచి వెళ్దామంటే భయం. ఎప్పుడు చూసినా ఖాళీ బిందెలు, ఖాళీ కుండలు పెట్టి ధర్నాలు చేసేవాళ్లు. కరెంటు గోస చెప్పక్కర్లేదు. అపార్ట్‌మెంట్ కిందకు వెళ్తే డీజిల్ కంపుతో ముక్కులు పగిలిపోయేవి. ఇన్వర్టర్లు, జనరేటర్లు లేకపోతే జ్యూస్ స్టాల్, జిరాక్స్ సెంటర్లు నడుపుకోలేని అవస్థ. గణేశ్ పండగ వచ్చిందంటే వారం రోజులు కర్ఫ్యూ కంపల్సరీ.’ ఉండేవని గుర్తుచేశారు.
ఇవాళ ఆ పరిస్థితులు ఉన్నాయా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగున్నాయని.. మంచినీళ్ల సవులత్ మంచిగైందని.. రోడ్లు బాగైనయని.. పేదలకు కడుపు నిండా పింఛన్ వస్తున్నదని.. డబుల్ బెడ్రూం ఇండ్లు వస్తున్నాయని తెలిపారు. ఇన్ని పనులు చేసుకుంటూ ముందుకుపోతున్న ఈ ప్రగతి చక్రాలను ఆపేందుకు.. వాటికి అడ్డుకట్ట వేసేందుకు ఎన్నికల ముందు కొంతమంది వస్తున్నారని తెలిపారు. సంక్రాంతికి గంగిరెద్దు వచ్చినట్టుగా ఎన్నికల ముందు ఇష్టమొచ్చినట్టు మాటలు చెప్పే వాళ్లు వస్తున్నారని ఎద్దేవా చేశారు.
అలాంటి వాళ్ల మాటలకు మోసపోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.అర్హులందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చే బాధ్యత మాదే.. ఎవరికీ ఒక్క రూపాయి ఇవ్వొద్దు: కేటీఆర్
Sep 21 2023, 16:53