/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz అసెంబ్లీ సాక్షిగా మీసం మెలేసిన బాలకృష్ణ! Yadagiri Goud
అసెంబ్లీ సాక్షిగా మీసం మెలేసిన బాలకృష్ణ!

ఏపీ అసెంబ్లీ సమావేశాలు తొలిరోజు వాడి వేడిగా ప్రారంభమయ్యాయి, టిడిపి సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలిపారు.

టీడీపీ అధినేత చంద్రబాబుపై మోపిన స్కిల్ అక్రమ కేసు పెద్ద ఎత్తున దుమారం రేపింది. స్పీకర్ పోడియంను టీడీపీ ఎమ్మెల్యేలు చుట్టుముట్టారు.

ఈ క్రమంలోనే వైసీపీ ఎమ్మెల్యేలు పోడియం వద్దకు వెళ్ళబోయారు. హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణపై అంబటి ఫైర్ అయ్యారు. మీసాలు తిప్పడం వంటివి సినిమాల్లో చూపించుకోవాలని బాలకృష్ణను అంబటి అన్నారు.

దీంతో ఫైర్ అయిన బాలకృష్ణ చూసుకుందాం రా’ అంటూ అంబటికి సవాల్ విసిరారు. అంబటి సైతం ‘రా చూసుకుందాం’ అని ప్రతి సవాల్ విసిరారు.

అంబటి సవాల్‌కు బాలకృష్ణ మీసం మెలేసి తొడిగొట్టారు. దీంతో తామూ మెలేస్తాం అని అధికార పార్టీ ఎమ్మెల్యేలు అన్నారు.

ఒకరిపై ఒకరు సవాళ్లు, ప్రతిసవాళ్లలో సభలో తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది..

SB NEWS

అంగన్‌వాడీ కార్యకర్తలను రెచ్చగొడుతున్నదెవరు?

ఉమ్మడి రాష్ట్రంలో రోజుల తరబడి సమ్మెచేసినా అంగన్‌వాడీలకు ప్రభుత్వాలు ఒక్క రూపాయి వేతనం పెంచలేదు.

కానీ, నేడు ఏ వినతిపత్రం ఇవ్వకపోయినా మూడుసార్లు వేతనం పెంచిన తెలంగాణ సర్కార్‌ మీదికి అంగన్‌వాడీలను ఉసిగొల్పుతున్నది ఎవరు?

తమ ఉనికిని కాపాడుకోవటం కోసం రెండు సంఘాలు ఈ పని చేస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అక్కున చేర్చుకొని అండగా నిలిచిన సర్కారుపై విషం చిమ్మే కుట్రలో భాగంగానే అంగన్‌వాడీలతో బలవంతపు సమ్మె చేయిస్తున్నారనే వాదనకు ఆదిలాబాద్‌ ఘటన నిదర్శనమనే వాదన వినిపిస్తున్నది.

అంగన్‌వాడీ కేంద్రం ప్రభుత్వ ఆస్తి.. ప్రభుత్వ ఆస్తిని సొంత ఆస్తిగా భావించి వాటికి తాళాలు వేసి, ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు భంగం కలిగించి తద్వారా ప్రభుత్వంపై తమ అక్కసును కొన్ని సంఘాలు వెళ్లగక్కుతున్నాయి.

అదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట మహిళా ఎస్సై పై దాడి కి పాల్పడిన అంగన్వాడి కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు.అక్కడ విధులు నిర్వహిస్తున్న,తలమడుగు ఎస్ ఐ ధనశ్రీ,వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా అంగన్వాడి టీచర్లు ఆమెపై దాడికి పాల్పడ్డారు జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లారు.

భౌతికంగా వారు దాడికి పాల్పడ్డారు. దాడికి పాల్పడిన అంగన్వాడీ టీచర్లపై కేసు నమోదు చేశామని పోలీసు చెబుతున్నారు...

మంచు లక్ష్మి కాషాయ కండువా కప్పుకోవడం ఫిక్సేనా?

మోహన్ బాబు కూతురు పొలిటికల్ ఎంట్రీ కి గ్రౌండ్ వర్క్ చేసుకుంది.మోదీకి మంచు కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉండగా గతంలో మోదీ, మోహన్ బాబు చాలాసార్లు కలిసిన సందర్భాలు అయితే ఉన్నాయి. అయితే

బీజేపీలోకి మంచు లక్ష్మిని ఆహ్వానించటానికి ప్రధానమంత్రి ఆఫీస్ నుండి మంచు లక్ష్మికి పిలుపు అందిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.2024 ఎన్నికల సమయానికి తెలుగు రాష్ట్రాల్లో పుంజుకోవాలని బీజేపీ భావిస్తుండటం గమనార్హం.

తెలంగాణలో బీజేపీ పరిస్థితి కొంచెం మెరుగ్గానే ఉన్నా ఏపీలో మాత్రం దారుణంగా ఉంది.మంచు లక్ష్మి బీజేపీలోకి నిజంగా ఎంట్రీ ఇస్తారేమో చూడాల్సి ఉంది.

మంచు లక్ష్మి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తే రాజకీయాల్లో సంచలనాలు సృష్టించడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

మంచు లక్ష్మి ఢిల్లీ పర్యటన ఊహాగానాలను తావిస్తుండగా ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.మహిళా బిల్లును కేంద్రం ఆమోదించిన నేపథ్యంలో పేరున్న ఎంతోమంది మహిళలను పిలిపించి మాట్లాడనున్నారని అందులో భాగంగా మంచు లక్ష్మికి ఆహ్వానం అందిందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.

మంచు లక్ష్మి ఢిల్లీకి వెళ్లి మోదీని కలిసిన తర్వాత మాత్రమే ఇతర విషయాలకు సంబంధించి పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు...

మూడుసార్లు వేతనాలు పెంచింది తెలంగాణ సర్కార్ కాదా? మంత్రి సత్యవతి రాథోడ్

సమ్మెను విరమించి వెంటనే విధుల్లో చేరాలని రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్

పిలుపునిచ్చారు.

అంగన్‌వాడీ సంఘాలు చేస్తున్న సమ్మెపై బుధవారం మంత్రి అధికారులతో చర్చించారు. దేశంలో ఏ రాష్ట్రమూ తీసుకోని సాహసోపేత నిర్ణయాలను సీఎం కేసీఆర్‌ తీసుకొని అంగన్‌వాడీలకు అండగా నిలిచారని గుర్తు చేశారు.

అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల వేతనాలను గతంలో ఎన్నడూలేని విధంగా పెంచింది రాష్ట్ర ప్రభుత్వమేనని చెప్పారు. అంగన్‌వాడీల సమ్మెతో సమాజంలో ఎకువగా ఉన్న బలహీనవర్గాల వారు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని పరిషరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని తెలిపారు. సమ్మెతో సమస్యలు పరిషారం కావని, సంప్రదింపులు, చర్చల ద్వారా, వినతిపత్రాల ద్వారా పరిషరిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఇప్పటికే పలు అంగన్‌వాడీ యూనియన్లు కృతజ్ఞతలు తెలిపిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు.

ఇవి నిజాలు కావా?

చరిత్రలో ఎన్నడూలేని విధంగా విజ్ఞప్తులు లేకుండానే సీఎం కేసీఆర్‌ మూడుసార్లు వేతనాలు పెంచింది నిజం కాదా? మెయిన్‌ అంగన్‌వాడీ టీచర్లకు నెలకు రూ.13,650, మినీ అంగన్‌ వాడీ టీచర్లు, ఆయాలకు రూ.7,800 చెల్లిస్తున్నది నిజం కాదా? దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఇలా చెల్లిస్తున్నదా?

అంగన్‌వాడీ టీచర్లకు, ఆయాలకు 50 ఏండ్లలోపు వారికి రూ.2 లక్షల జీవితబీమా, 50 ఏండ్ల నుంచి 65 ఏండ్ల వరకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించే జీవో ఇటీవల ఇచ్చింది నిజం కాదా? దురదృష్టవశాత్తు మరణిస్తే టీచర్లకు రూ.20 వేలు, ఆయాలకు రూ.10 వేలు చెల్లించే జీవోను విడుదల

తిరుపతి లో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది

తిరుమలలో భక్తుల రద్దీ సర్వ సాధారణంగానే ఉంది. నేడు గురువారం శ్రీవారి దర్శనం కోసం భక్తులు 4 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు.

శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.89 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

కాగా... తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు 4వ రోజు వైభవంగా కొనసాగుతున్నాయి.

నేడు శ్రీవారికి కల్పవృక్ష, సర్వభూపాల వాహన సేవలు జరగనున్నాయి.........

SB NEWS

SB NEWS

SB NEWS

2029 ఎన్నికలలోనే మహిళల రిజర్వేషన్ అమలు : అమిత్ షా..

ఢిల్లీ:మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్ చరిత్రలో సువర్ణాధ్యాయం అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్ సభలో చర్చ సందర్భంగా మాట్లాడిన అమిత్ షా..

మహిళా సాధికారత అనేది కొన్ని పార్టీలకు రాజకీయ అజెండాగా ఉందని.. ఎన్నికల్లో గెలిచేందుకు రాజకీయ అస్త్రంగా వాడుకుంటాయని ధ్వజమెత్తారు.

కానీ బీజేపీకి, నరేంద్ర మోడీకి మాత్రం ఈ బిల్లు రాజకీయ అంశం కాదు అన్నారు. ప్రధాని నరేంద్ర చొరవతోనే మహిళా బిల్లు సాధ్యం అవుతున్నదన్నారు.

'నారీ శక్తి వందన్ అధినియం'పై కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియాగాంధీ మాట్లాడిన అనంతరం బీజేపీ ఎంపీ నిశికాంట్ దూబే ప్రసంగించేందుకు నిలబడ్డారు.

ఆ వెంటనే మహిళా రిజర్వేషన్ బిల్లుపై మాట్లాడేందుకు ప్రభుత్వం ఒక మహిళా ఎంపీని నామినేట్ చేయాలని అధీర్ రంజన్, ఇతర ఎంపీలు డిమాండ్ చేశారు.

దీంతో సభలో కొద్దిసేపు గందరగోళం తలెత్తింది. దీంతో అమిత్షా జోక్యం చేసుకున్నారు.

డూబే ప్రసంగాన్ని అడ్డుకోవడంపై నిలదీస్తూ, మొదటిగా ప్రసంగించేందుకు అవకాశం ఇవ్వకపోవడంతో అధీర్ రంజన్ అసూయపడుతున్నట్టు కనిపిస్తోందని 2029 ఎన్నికలలోనే మహిళల రిజర్వేషన్ అమలు అవుతందని అన్నారు..

Hyderabad: సాగర తీరంలో నిమజ్జనాల సందడి.. ఏర్పాట్లను పరిశీలించిన సీపీ సీవీ ఆనంద్‌

హైదరాబాద్‌: గణపతి నిమజ్జనాలకు పలు శాఖ అధికారులతో కలిసి పోలీసులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.

గణపతి ఉత్సవాల్లో బుధవారం మూడో రోజు కావడంతో నిమజ్జనానికి సాగర తీరానికి విగ్రహాలు తరలివస్తున్నాయి..

ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులతో కలిసి హుస్సేన్‌ సాగర్‌ పరిసర ప్రాంతాల్లో హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ పర్యటించారు.

సాగర్‌తో పాటు జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న చెరువుల్లో సుమారు 50వేల విగ్రహాలు నిమజ్జనం అవుతాయని భావిస్తున్నట్టు తెలిపారు.

తెలుగు తల్లి ఫ్లైఓవర్‌, ఎన్టీఆర్‌ మార్గ్‌, పీపుల్స్‌ ప్లాజా ప్రాంతాల్లో మార్పులు రావడంతో అధికారులకు దిశానిర్దేశం చేశారు.

సచివాలయం, అంబేడ్కర్‌ విగ్రహం, అమరవీరుల స్మారకం రావడంతో ఆయా మార్గాల్లో స్వల్ప మార్పులు ఉంటాయని తెలిపారు.

హుస్సేన్‌ సాగర్‌కు వచ్చే రహదారుల్లో యూటర్న్‌లు, వంతెనల ఎత్తులు, ఎత్తుల వారీగా విగ్రహాల అనుమతిపై సమీక్షించిన సీపీ.. క్రేన్ల ఏర్పాట్లపై కూడా అధికారులతో చర్చించారు. నిమజ్జనం ప్రశాంతంగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు..

చంద్ర‌బాబు క‌స్ట‌డీపై ఏసిబి కోర్టులో ముగిసిన వాదనలు: రేపు తుదితీర్పు

టీడీపీ అధినేత చంద్రబాబు కస్టడీని కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో బుధవారం వాదనలు ముగిశాయి. తీర్పును రేపు ఉద‌యం వెలువ‌రించ‌నున్నారు..

కాగా,చంద్రబాబును పూర్తి ఆధారాలతో అరెస్ట్ చేశామని, ఆయనను విచారించడం కోసం ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ త‌రుపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి, వాదనలు వినిపించారు.

అయితే ఆయనను సిట్ కార్యాలయంలోనే విచారించారని, అసలు ఆధారాలు లేకుండా అరెస్ట్ చేశారని, కాబట్టి కస్టడీ పిటిషన్‌ను తిరస్కరించాలని చంద్ర‌బాబు త‌రుపు న్యాయ‌వాది సిద్ధార్థ లూద్రా కోర్టును కోరారు .

నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ అధినేత అరెస్ట్ జరిగిందన్నారు. ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేకపోయినప్పటికీ కస్టడీని కోరుతున్నారన్నారు. చంద్రబాబుకు సీఐడీ కస్టడీ అవసరం లేదన్నారు. ఆయన అవినీతికి పాల్పడినట్లు ఎక్కడా ఆధారాలు లేవన్నారు.

నాలుగేళ్లుగా ఎవరిని అరెస్ట్ చేసినా నిధుల దుర్వినియోగం అంటున్నారన్నారు. చంద్రబాబు అరెస్ట్ రాజకీయ కుట్రతో కూడుకున్నదన్నారు. చంద్రబాబుకు అక్రమాలతో ఎలాంటి సంబంధం లేదన్నారు.

ఆయన అవినీతికి పాల్పడినట్లుగా ఆధారాలు కూడా చూపించలేదన్నారు. ఎఫ్ఐఆర్‌లో చంద్రబాబు పేరు లేకుండానే అరెస్ట్ చేశారని కోర్టుకు తెలిపారు. ఎన్ఎస్జీ సెక్యూరిటీ ఉన్న చంద్రబాబును జైల్లో పెట్టారన్నారు.

అరెస్ట్ ప్రక్రియ నిబంధనలకు విరుద్ధంగా జరిగిందన్నారు. ఎన్ఎస్జీ సెక్యూరిటీ ఉన్న ఆయనను రెండు రోజుల పాటు విచారణ పేరుతో ఇబ్బందికి గురి చేశారన్నారు. ఆధారాలు లేకుండా కస్టడీని ఎలా అడుగుతారని ప్రశ్నించారు. ఆయనను అరెస్ట్ చేసిన సమయంలోనే సిట్ కార్యాలయంలో విచారించారన్నారు. కస్టడీ పిటిషన్‌ను తిరస్కరించాలన్నారు...

మహిళలు రాజకీయ ల్లోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది: మంత్రి కేటీఆర్

మహిళా రిజర్వేషన్‌ బిల్లును తాను పూర్తిగా స్వాగతిస్తున్నానని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. మహిళలు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

మహిళా కోటాలో తన సీటు వదులుకోవడానికి కూడా సిద్ధమేనని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో అంతర్జాతీయ టెక్‌పార్క్‌ను బుధవారం మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. మన జీవితాలు చాలా చిన్నవని,తన పాత్ర తాను పోషించానని పేర్కొన్నారు.పెట్టుబడులకు హైదరాబాద్‌ అనువైన ప్రాంతమని మంత్రి కేటీఆర్‌ అన్నారు.

ప్రపంచానికి వ్యాక్సిన్లు ఉత్పత్తి చేసే స్థాయికి హైదరాబాద్ మహానగరం చేరుకుందని హర్షం వ్యక్తం చేశారు.

దేశంలో 40 శాతానికి పైగా ఫార్మారంగ ఉత్పత్తులు ఇక్కడి నుంచే వస్తున్నాయని తెలిపారు. పెట్టుబడులతో ముందుకొచ్చే కంపెనీలకు అండగా నిలబడతామని భరోసా ఇచ్చారు.

హైదరాబాద్‌ లైఫ్‌సైన్సెస్‌ హబ్‌గా మారుతుందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

హైదరాబాద్‌ చాలా అందమైన నగరమని.. ఇక్కడ టాలెంట్‌కు కొరత లేదని అన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే ఇక్కడ ఖర్చు కూడా తక్కువేనని తెలిపారు....

అభ్యర్థుల ఎంపికపై స్క్రీనింగ్ కమిటీ కసరత్తు!!

ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో స్క్రీనింగ్ కమిటీ సమావేశం కానుంది. పార్లమెంట్ సమావేశాల అనంతరం నేడు, రేపు స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరగనుంది.

ఈ భేటీకి స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్, సభ్యులు బాబా సిద్ధికి, జిగ్నేష్ మేవాని, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తంకుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క,

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్ రావు ఠాక్రే తదితరులు హాజరవుతారు. ప్రదేశ్ ఎన్నికల కమిటీ సిఫారసు చేసిన జాబితాను స్క్రీనింగ్ కమిటీ వడపోయనుంది.

ఇప్పటికే సర్వే నివేదికలను తెప్పించుకున్న స్క్రీనింగ్ కమిటీ.. వడపోత అనంతరం తమ నివేదికను పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి సిపారసు చేయనుంది.

సింగిల్, డబుల్ నేమ్ ప్రతిపాదనలతోపాటు ముగ్గురు, నలుగురు నాయకులు పోటీపడుతున్నట్లు పీఈసీ ప్రతిపాదనలు చేసింది.

సర్వేలు, సామాజిక, స్థానిక రాజకీయ స్థితిగతుల ఆధారంగా చేసుకుని అభ్యర్థులను స్క్రీనింగ్ కమిటీ ఎంపిక చేయనుంది.....

SB NEWS