విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కూళ్లకు భారీగా దసరా సెలవులు... ఎన్ని రోజులంటే...
విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కూళ్లకు భారీగా దసరా
సెలవులు.. ఎన్ని రోజులంటే..
ఏపీ, తెలంగాణలోని స్కూళ్లు, కాలేజీలకు దసరా సెలవులు ఈ సారి భారీ సంఖ్యలో రానున్నాయి. ఏ రాష్ట్రంలో ఎన్ని రోజులు సెలవులు ఉంటాయో ఇక్కడ తెలుసుకోండి.
సెలవులు.. విద్యార్థులకు ఎంతో ఆనందాన్నిచ్చే పదం. ఎక్కువగా పండగలకు సెలవులు వస్తుంటాయి. దానిలో వరుస సెలవులు వస్తే.. విద్యార్థులు ఎగిరి గంతేస్తారు. అలాంటి సందర్భం అక్టోబర్ నెలలో వచ్చేస్తోంది. ఏ తేదీన సెలవు వస్తున్నాయో పూర్తి వివరాలు తెలుసుకోండి.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సెలవు దినాలనేవి.. ప్రభుత్వ పాఠశాలలు, CBSE పాఠశాలలు, ICSE పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, సంబంధిత ఉపాధ్యాయులు, లెక్చరర్లు, అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది, విద్యార్థులకు అనుగుణంగా ఉంటాయి.
తెలంగాణ ప్రభుత్వం 2023 ఏడాదికి సంబంధించిన సెలవులను ఇప్పటికే ప్రకటించింది. ఆ లెక్క ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయానికి 28 సాధారణ సెలవులు, 24 ఐచ్ఛిక సెలవులను ప్రకటించింది.
ఆదివారం, రెండో శనివారాల్లో రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు ఎలాగో మూతపడతాయి. ప్రభుత్వ ఉద్యోగులు సాధారణ హాలిడేస్ తోపాటుగా ఉన్నతాధికారుల అనుమతితో 5 ఆప్షనల్ సెలవులు పొందే అవకాశం కూడా ఉందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
జూన్ 12 నుంచి ప్రారంభమైన 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి.. 1 నుంచి 10వ తరగతులకు సంబంధించిన అకడమిక్ క్యాలెండర్‌ను తెలంగాణ ప్రభుత్వం జూన్ 6న విడుదల చేసిన విషయం తెలిసిందే.
ఈ అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం.. ఈ విద్యాసంవత్సరంలో మొత్తం 229 రోజులు స్కూళ్లు పని చేస్తాయి. స్కూళ్లు జూన్ 12న ప్రారంభమై.. ఏప్రిల్ 23, 2024న ముగియనున్నాయి. అంటే.. ఈ అకాడమిక్ ఇయర్లో మొత్తం 229 రోజులపాటు పాఠశాలలు పనిచేయాల్సి ఉందన్నమాట. (ప్రతీకాత్మక చిత్రం)6/ 8
ఈ అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం.. ఈ విద్యాసంవత్సరంలో మొత్తం 229 రోజులు స్కూళ్లు పని చేస్తాయి. స్కూళ్లు జూన్ 12న ప్రారంభమై.. ఏప్రిల్ 23, 2024న ముగియనున్నాయి. అంటే.. ఈ అకాడమిక్ ఇయర్లో మొత్తం 229 రోజులపాటు పాఠశాలలు పనిచేయాల్సి ఉందన్నమాట.
2024 ఏప్రిల్ 24 నుంచి 2024 జూన్ 11 వరకు అంటే 49 రోజులు వేసవి సెలవులు ఉంటాయి. ఇక ఈ ఏడాది (2023) దసరా సెలవుల విషయానికి వస్తే.. అక్టోబర్ 13 నుంచి 25వ తేదీ వరకు 13 రోజుల పాటు ఉంటాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఏపీలో అక్టోబర్ 11వ తేదీ నుంచి 16 వరకు దసరా సెలవులు ప్రకటించారు. 17వ తేదీ ఆదివారం కావడంతో 18వ తేదీన పునఃప్రారంభమవుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)7/ 8
2024 ఏప్రిల్ 24 నుంచి 2024 జూన్ 11 వరకు అంటే 49 రోజులు వేసవి సెలవులు ఉంటాయి. ఇక ఈ ఏడాది (2023) దసరా సెలవుల విషయానికి వస్తే.. అక్టోబర్ 13 నుంచి 25వ తేదీ వరకు 13 రోజుల పాటు ఉంటాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఏపీలో అక్టోబర్ 11వ తేదీ నుంచి 16 వరకు దసరా సెలవులు ప్రకటించారు. 17వ తేదీ ఆదివారం కావడంతో 18వ తేదీన పునఃప్రారంభమవుతాయి.
అలాగే సంక్రాంతి సెలవులు 2024 జనవరి 12 నుంచి 17వ తేదీ వరకు మొత్తం 6 రోజులు ఉంటాయని వెల్లడించింది. ఇదిలా ఉంటే.. ఈ నెలలోనే ఆదివారాలు మినహా 28-09-2023 గురువారం-మిలాద్ ఉన్ నబీ(మహ్మద్ ప్రవక్త జన్మదినం) సందర్భంగా పాఠశాలలకు సెలవు ప్రకటించనున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)8/ 8
అలాగే సంక్రాంతి సెలవులు 2024 జనవరి 12 నుంచి 17వ తేదీ వరకు మొత్తం 6 రోజులు ఉంటాయని వెల్లడించింది. ఇదిలా ఉంటే.. ఈ నెలలోనే ఆదివారాలు మినహా 28-09-2023 గురువారం-మిలాద్ ఉన్ నబీ(మహ్మద్ ప్రవక్త జన్మదినం) సందర్భంగా పాఠశాలలకు సెలవు ప్రకటించనున్నారు.
Sep 21 2023, 11:22