మూడుసార్లు వేతనాలు పెంచింది తెలంగాణ సర్కార్ కాదా? మంత్రి సత్యవతి రాథోడ్
సమ్మెను విరమించి వెంటనే విధుల్లో చేరాలని రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్
పిలుపునిచ్చారు.
అంగన్‌వాడీ సంఘాలు చేస్తున్న సమ్మెపై బుధవారం మంత్రి అధికారులతో చర్చించారు. దేశంలో ఏ రాష్ట్రమూ తీసుకోని సాహసోపేత నిర్ణయాలను సీఎం కేసీఆర్ తీసుకొని అంగన్‌వాడీలకు అండగా నిలిచారని గుర్తు చేశారు.
అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల వేతనాలను గతంలో ఎన్నడూలేని విధంగా పెంచింది రాష్ట్ర ప్రభుత్వమేనని చెప్పారు. అంగన్‌వాడీల సమ్మెతో సమాజంలో ఎకువగా ఉన్న బలహీనవర్గాల వారు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని పరిషరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని తెలిపారు. సమ్మెతో సమస్యలు పరిషారం కావని, సంప్రదింపులు, చర్చల ద్వారా, వినతిపత్రాల ద్వారా పరిషరిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఇప్పటికే పలు అంగన్‌వాడీ యూనియన్లు కృతజ్ఞతలు తెలిపిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు.
ఇవి నిజాలు కావా?
చరిత్రలో ఎన్నడూలేని విధంగా విజ్ఞప్తులు లేకుండానే సీఎం కేసీఆర్ మూడుసార్లు వేతనాలు పెంచింది నిజం కాదా? మెయిన్ అంగన్‌వాడీ టీచర్లకు నెలకు రూ.13,650, మినీ అంగన్ వాడీ టీచర్లు, ఆయాలకు రూ.7,800 చెల్లిస్తున్నది నిజం కాదా? దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఇలా చెల్లిస్తున్నదా?
అంగన్‌వాడీ టీచర్లకు, ఆయాలకు 50 ఏండ్లలోపు వారికి రూ.2 లక్షల జీవితబీమా, 50 ఏండ్ల నుంచి 65 ఏండ్ల వరకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించే జీవో ఇటీవల ఇచ్చింది నిజం కాదా? దురదృష్టవశాత్తు మరణిస్తే టీచర్లకు రూ.20 వేలు, ఆయాలకు రూ.10 వేలు చెల్లించే జీవోను విడుదల
Sep 21 2023, 10:19