కేంద్రం ప్రవేశపెట్టిన మహిళ 33% రిజర్వేషన్ లో బీసీ ఎస్సీ ఎస్టీ సబ్ కోటాను తేల్చాలని నల్లగొండ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరసన
కేంద్రం ప్రవేశపెట్టిన మహిళ 33% రిజర్వేషన్ లో బీసీ ఎస్సీ ఎస్టీ సబ్ కోటాను తేల్చాలని నల్లగొండ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరసన
నల్లగొండ జిల్లా కేంద్రంలో మహిళా డిగ్రీ కాలేజీ నుండి క్లాక్ టవర్ జ్యోతిరావు పూలే విగ్రహం వరకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించడం జరిగింది.
బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ
పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్లు 33% ప్రవేశపెట్టడాన్ని నలగొండ బీసీ సంక్షేమ సంఘం స్వాగతిస్తూ ఉన్నాం. కానీ గత 25 సంవత్సరాల క్రితమే మహిళా రిజర్వేషన్ బిల్లును ఆనాడు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్ననాడు మహిళల రిజర్వేషన్లు సబ్ కోట ఇవ్వకుండా ప్రవేశ పెట్టవద్దని కచ్చితంగా ఆనాడు ప్రతిపక్షాలు అడ్డుకోవడం జరిగింది. ఈనాడు దేశ ప్రధాని మోడీ గారు 33% రిజర్వేషన్ పెట్టడం శుభదాయకం అయినా బీసీ ఎస్సీ ఎస్టీలకు సబ్ కోట తేల్చకుండా దాన్ని ప్రవేశపెట్టడాన్ని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణన్న ఆదేశాల మేరకు ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది.
ఇప్పటికైనా గత 75 సంవత్సరాలు 75 సంవత్సరాల కాలంలో బీసీ ఓట్లు వేసే యంత్రాలుగా ఈ పార్టీలు చూడడం జరుగుతుంది ఇప్పటికైనా సబ్ కోట ఇచ్చి రాజ్యాంగబద్ధంగా హక్కులు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
బిసి యువజన సంఘం జిల్లా అధ్యక్షులు మునాస ప్రసన్న కుమార్ మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మామిడి పద్మ ప్రసాద్ జిల్లా బీసీ మహిళ అధ్యక్షులు అధ్యక్షురాలు సింగం లక్ష్మి బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా కార్యదర్శి కర్నాటి యాదగిరి మార్గం సతీష్ కుమార్ యువజన సంఘం వైస్ ప్రెసిడెంట్ పగిళ్ల కృష్ణ యువజన సంఘం ప్రధాన కార్యదర్శి మల్లెబోయిన సతీష్ యాదవ్ టౌన్ ప్రెసిడెంట్ సదానంద్ వల్ల కీర్తి శ్రీనివాస్ చల్లేటి రవీంద్ర చారి తదితరులు పాల్గొన్నారు.
SB news
street buzz news
Sep 20 2023, 18:10