ఈనెల 25న విద్యుత్తు ఏఈ కార్యాలయాల ముందు ధర్నాలు జయప్రదం చేయండి.
ఈనెల 25న విద్యుత్తు ఏఈ కార్యాలయాల ముందు ధర్నాలు జయప్రదం చేయండి.
100 యూనిట్లు ఉచిత కరెంట్ కై దళిత కుటుంబాల దరఖాస్తులు.
నిరుపేద దళితులకు జీవో నెంబర్ 342 ప్రకారంగా 100 యూనిట్ల ఉచిత విద్యుత్తు గృహ అవసరాలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా ఎలక్ట్రిసిటీ ఏఈ కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహించి దరఖాస్తులు ఇవ్వనున్నట్లు కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున అన్నారు ఈరోజు కెవిపిఎస్ ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణంలోని పెద్ద బండలో దళితులు చేత దరఖాస్తులు విడుదల చేయడం జరిగింది.
ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ ధనికులకు ఉద్యోగులకు ధనవంతులకు వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు వృత్తిదారులకు ఉచిత విద్యుత్తు ఇస్తూ భూమిలేని నిరుపేద దళితులకు గృహ అవసరాలకు 300 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తు ఇవ్వాలని డిమాండ్ చేశారు జిల్లాలో 100 అయినట్లు జీవో నెంబర్ 342 ప్రకారం ఇవ్వాల్సి ఉండగా ఎక్కడ అమలు కావడం లేదని ప్రతి దళిత అర్హత గల కుటుంబం కులం సర్టిఫికెట్ ఆధార్ కార్డు విద్యుత్ కనెక్షన్ జిరాక్స్ పత్రాలతో ఏఈ కార్యాలయాల ముందు ధర్నాలకు హాజరై దరఖాస్తుల సమర్పించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి గారే నరసింహ జిల్లా నాయకులు కోట సైదులు రత్నం యాదయ్య దాసరి ఆనంద్ దూలపల్లి గిరి చింత ఎల్లయ్య బచ్చలకూరి పాపయ్య తదితరులు పాల్గొన్నారు.
sb news
street buzz news
Sep 20 2023, 17:19