నార్కెట్ పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం గ్రామంలో కల్లుగీత కార్మికుల మహా ధర్నా పోస్టర్ ఆవిష్కరణ
హలో గీతన్న చలో హైదరాబాద్
నార్కెట్ పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం గ్రామంలో కల్లుగీత కార్మికుల మహా ధర్నా పోస్టర్ ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కొండ వెంకన్న వైఎస్ ఎంపీపీ కల్లూరు యాదగిరి గారితో కలిసి ఆవిష్కరించడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కొండ వెంకన్న వైస్ ఎంపీపీ కల్లూరు యాదగిరి మాట్లాడుతూ ఈనెల 22న ఇందిరాపార్క్ వద్ద జరిగే ధర్నాకు వేలాదిమంది పాల్గొని జయప్రదం చేయాలని కోరారు తెలంగాణ రాష్ట్రంలో ఐదు లక్షల కుటుంబలు కల్లుగీత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయి తాళ్లు ఎక్కే క్రమంలో ప్రమాదం జరిగి వందలాదిమంది చనిపోవడం కాళ్లు చేతులు విరగడం నడుము పడిపోవడం జరుగుతుంది.
రెండు రోజులకు ఒకరు చనిపోతున్నారు వీరి ప్రమాద నివారణ చర్యలు తీసుకోవాలని అట్లాగే వారికి సేఫ్టీ మోకులు ఇవ్వాలని సభ్యులందరికీ ద్విచక్ర వాహనాలు ఇవ్వాలని కోరారు గీత కార్మికుని కుటుంబం బతకాలంటే ఈ వృత్తి చాలా ప్రమాదమైనప్పటికీ తాళ్లు ఎక్కడం తప్పట్లేదు ఈ వృత్తిలో సంవత్సరానికి సుమారు 550 మంది చెట్టుపై నుంచి జారిపడుతున్నారు కాళ్లు చేతులు విరుగుతున్నాయి నడుములు పడిపోతున్నాయి 180 మంది చనిపోతున్నారు ఇంత ప్రమాదం ఏ వృత్తిలో లేదు.
కాబట్టి ఈ గీత కార్మికుల్ని కాపాడవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉన్నది మునుగోడు ఉప ఎన్నిక దృష్టిలో పెట్టుకొని గీత కార్మికుల ఓట్లు వేయించుకోవడానికి ఆ పార్టీ మంత్రివర్యులు కేటీఆర్ గారు లిక్కర్ షాపులను సొసైటీలకు ఇస్తామని గీత కార్మికుల ఎదుర్కొన్న సమస్యలను పరిష్కరిస్తామని ఇచ్చిన హామీలు నెరవేర్చాలని అన్నారు ఇటీవల జరిగిన లిక్కర్ షాపుల టెండర్లలో సొసైటీలకు ఇవ్వకుండా పాత పద్ధతిని కొనసాగించడం చాలా దుర్మార్గమైన చర్య అన్నారు.
ఇటీవల బీసీ కుల వృత్తుదారులకు ఇచ్చిన జీవో నెంబర్ 5 ప్రకారం కళ్ళు గీత కార్మికులందరికీ లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని సొసైటీలకు భూమి కల్లుకు మార్కెట్ నీర తాటి ఈత ఉత్పత్తుల పరిశ్రమల అభివృద్ధికి కృషి చేయాలని తదితర సమస్యలన్నీ పరిష్కరించాలని ఈ నెల 22న హైదరాబాదు ఇందిరా పార్కు వద్ద జరిగే ధర్నాకు రాష్ట్ర నలుమూలల నుండి ప్రతి గీత కార్మికుడు కదిలి ఈ ధర్నాను జయప్రదం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో అంతటి సత్యనారాయణ బొల్లు రవీందర్ దండు రవి మాడగొని సైదులు దండు శ్రీను కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
sb news
street buzz news Telangana
Sep 20 2023, 12:30