Chiranjeevi: తెలుగు సినిమా బతికినంత వరకు ప్రేక్షకుల మనసుల్లో ఆయన ఉంటారు: చిరంజీవి
హైదరాబాద్: ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానాన్ని సొంతం చేసుకున్నారు నటుడు అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswararao)..
నేటి నుంచి ఆయన శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అన్నపూర్ణ స్టూడియోస్‌లో నాగేశ్వరరావు విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు.
సినీ ప్రముఖులంతా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి ఏఎన్నార్‌ను గుర్తు చేసుకుంటూ ట్వీట్ చేశారు.
'అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆప్యాయంగా, గౌరవపూర్వకంగా ఆ మహానటుడికి నివాళులర్పిస్తున్నాను. ఆయన తెలుగు సినిమాకే కాదు.. భారతీయ సినీ చరిత్రలోనే ఓ దిగ్గజ నటుడు.
ఆయన వందలాది చిత్రాల్లో నటించి.. తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు. తెలుగు సినిమా బతికినంత వరకు నాగేశ్వరరావు ప్రేక్షకుల మనుసుల్లో నిలిచి ఉంటారు.
ఆ మహానుభావుడి శతజయంతి సందర్భంగా అక్కినేని కుటుంబంలోని ప్రతి ఒక్కరికి, నా సోదరుడు నాగార్జునకు.. అలాగే నాగేశ్వరరావును అభిమానించే కోట్లాది మంది సినీ ప్రేమికులకు నా హృదయ పూర్వక శుభాకాంక్షలు' అని చిరంజీవి (chiranjeevi) ట్వీట్‌లో పేర్కొన్నారు.
Sep 20 2023, 12:05