/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz Womens Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లు.. లోక్‌సభలో ప్రారంభమైన చర్చ Yadagiri Goud
Womens Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లు.. లోక్‌సభలో ప్రారంభమైన చర్చ

దిల్లీ: చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్‌ బిల్లు లోక్‌సభ ముందుకొచ్చిన విషయం తెలిసిందే.

నారీ శక్తి వందన్‌ అభియాన్‌ పేరుతో ఈ బిల్లును కేంద్రం మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది..

దిగువ సభ దీనిపై బుధవారం చర్చ ప్రారంభించింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ ఈ బిల్లుపై మాట్లాడుతున్నారు.

SB NEWS

SB NEWS

SB NEWS

అక్టోబర్ 6 న తెలంగాణలో ఎన్నికల నగారా?

తెలంగాణ రాష్ట్ర శాసన సభ ఎన్నికలకు అక్టోబరు 6న షెడ్యూల్‌ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్‌, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు విడివిడిగా జరుగుతాయని ఇప్పటికే స్పష్టమైంది.

దాంతో.. ప్రస్తుత శాసనసభ గడువు ముగిసేలోపే ఎన్నికల ప్రక్రియ పూర్తవ్వాలి. అంటే.. 2018లో.. డిసెంబరు 7న ఎన్నికలు జరిగాయి. జనవరి 16న శాసనసభ తొలి సమావేశం జరిగింది. దీన్ని బట్టి.. 2024 జనవరి 17లోపు కొత్త శాసనసభ కొలువుదీరాలి.

అందుకు అనుగుణంగా ఈ ఏడాది అక్టోబరు మొదటి వారంలో షెడ్యూల్‌ విడుదలవ్వాలి. ఆ తర్వాత.. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ, పోలింగ్‌, కౌంటింగ్‌ ప్రక్రియలకు కనీసం రెండు నెలల సమయం అవసరం. మంత్రి కేటీఆర్‌ కూడా అక్టోబరు 10లోపు షెడ్యూల్‌ విడుదలవ్వాలి. అంతకు మించి ఆలస్యం జరిగితే.. ఎన్నికల నిర్వహణకు ఇబ్బందులు తలెత్తుతాయి’’ అంటూ ఈ మధ్య ఎక్స్‌ వేదికగా అభిప్రాయపడ్డారు.

ఈ నేపథ్యంలో అక్టోబరు మొదటి వారంలోనే షెడ్యూల్‌ విడుదల అయ్యే అవకాశాలున్నట్లు స్పష్టమవుతుంది. భారత ఎన్నికల సంఘం ఈసీఐ తరఫున రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్ల పరిశీలనకు ప్రత్యేక బృందం రానుంది. అక్టోబరు 3, 4, 5 తేదీల్లో ఈ బృందం రాష్ట్రంలో పర్యటించనుంది.

రాష్ట్రంలో ఓటర్ల జాబితా, పోలింగ్‌ కేంద్రాలు, ఎన్నికల్లో పాల్గొనే సిబ్బంది, పోలీసు బందోబస్తు వంటి పలు అంశాలను పరిశీలించనుంది. ఈ పరిశీలన పూర్తయిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రత్యేక నివేదికను సమర్పించనుంది. ఆ నివేదిక అందిన వెంటనే ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం అక్టోబరు 6న ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒక వేళ ఆ తేదీన కుదరకపోతే.. అక్టోబరు 10వ తేదీలోపు షెడ్యూల్‌ను జారీ చేస్తారని భావిస్తున్నారు. షెడ్యూల్‌ జారీ అయిన నెల తర్వాత నోటిఫికేషన్‌ను విడుదల అవుతుంది. ఆ తర్వాత.. అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. నామినేషన్ల పర్వం ప్రారంభమైన నెల రోజుల్లో ఎన్నికల ప్రక్రియను ముగించాలి.

కేంద్ర బృందం పర్యటనకు సంబంధించి రాష్ట్ర అధికారులు ఇప్పటికే ఏర్పాట్లను పూర్తిచేశారు. అటు ఓటర్ల జాబితా రెండో సవరణలో భాగంగా అభ్యర్థనలు, అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియను మంగళవారం ముగించారు....

చంద్రబాబు చుట్టు స్కామ్ ల ఉచ్చు

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు జగన్‌ సర్కార్‌ మరో షాక్‌ ఇచ్చింది.గతంలో సీఐడి దర్యాప్తు చేపట్టిన ఫైబర్‌ నె ట్‌ స్కాం కేసు మళ్లీ తెర మీదకు వచ్చింది.

ఈ కేసులనూ చంద్రబాబు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వందల కోట్ల రూపాయలు గోల్‌మాల్‌ జరిగినట్లు గుర్తించిన సీఐడి అందుకు ప్రధాన కారణం చంద్రబాబేనని అభియోగాలు మోపింది. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నిబంధనలకు విరుద్ధంగా టెరా సాప్ట్‌ కంపెనీకి ఫైబర్‌ నెట్‌ కాంట్రాక్ట్‌ ఇచ్చారనేది చంద్రబాబుపై ప్రధాన ఆరోపణ. .

దీంతో ఇప్పటికే స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టయి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్‌ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న చంద్రబాబును ఫైబర్‌ నెట్‌ కేసులో అరెస్టు చేసేందుకు సీఐడి సిద్ధమవుతోంది. ఇందుకోసం విజయవాడ ఏసీబీ కోర్టులో మంగళవారం పీటీ వారెంట్‌ దాఖలు చేసింది.

అటు స్కిల్‌ కేసులో రిమండ్‌లో ఉంటుండగానే చంద్రబాబుపై సీఐడి అధికారులు ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ స్కాం కేసులో అరెస్టు చేసేందుకు ఇప్పటికే ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్‌ దాఖలు చేశారు.

అది పెండింగ్‌లో ఉంది. ఈ కేసులోనే చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో మంగళవారం విచారణ జరగ్గా ఈనెల 21కి వాయిదా పడింది.

అయితే చంద్రబాబును టార్గెట్‌ చేసిన సీఐడి ఫైబర్‌ నెట్‌ స్కాం కేసు తెర మీదకు తీసుకువస్తూ తాజాగా పీటీ వారెంట్‌ దాఖలు చేయగా విచారణకు న్యాయమూర్తి స్వీకరించారు. ఫైబర్‌ కేసులో చంద్రబాబును ప్రధాన నిందితుడు ఏ1గా సీఐడి పేర్కొంది...

తిరుపతి లో తగ్గిన భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ గణనీయంగా తగ్గింది.

నేడు బుధవారం తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు 2 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు.స్వామివారి సర్వదర్శనానికి 2 గంటల సమయం పడుతోంది.

ఇక మంగళవారం శ్రీవారిని 67,267 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.2.58 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

SB NEWS

SB NEWS

SB NEWS

రేపే పార్లమెంటు ముందుకు మహిళా రిజర్వేషన్ బిల్లు

మహిళా రిజర్వేషన్ బిల్లు బుధవారం పార్లమెంటు ముందుకు రానుంది. బిల్లు ఆమోదం పొందే సమయానికి భారీగా వేడుకలకు సన్నాహాలు చేస్తున్నారు.

ఢిల్లీ పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కృతజ్ఞతలు చెప్పేందుకు భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలోని నేతలతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

చర్చించారు. ఢిల్లీ సమీప ప్రాంతాల నుంచి భారీగా మహిళల సమీకరణకు నిర్ణయించారు.

బీజేపీ బుధవారం లేదా ఒక రోజు తర్వాత ఢిల్లీలో లేదా ఢిల్లీకి ఆనుకుని ఉన్న రాజస్థాన్‌లోని ఏదైనా నగరంలో భారీ మహిళా సదస్సు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. ఆ సదస్సులో ప్రధాని మోదీ స్వయంగా పాల్గొని ప్రసంగించనున్నట్టు సమాచారం.

కాగా దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం సాయంత్రం ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ భేటీలో.. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

రేపు బుధవారం కొత్త పార్లమెంట్ భవనంలో ఈ బిల్లునను ప్రవేశపెట్టనున్నారు. ఒకవేళ ఈ బిల్లు ఆమోదం పొందితే.. పార్లమెంట్, రాష్ట్ర అసెంబ్లీలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించడానికి వీలవుతుంది. దీంతో పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న మరికొన్ని బిల్లులకు సైతం కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని సమాచారం.......

అభివృద్ధికి అడ్డాగా నారాయణఖేడ్: మంత్రి హరీష్ రావు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి అవకాశం వస్తే తెలంగాణపై విషం చిమ్ముతారని మంత్రి హరీష్‌రావు వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు నారాయణఖేడ్ లో లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ..రాష్ట్ర విభజన జరిగితే తెలంగాణలో సంబరాలు చేసుకోలేదని అనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.

నారాయణఖేడ్ అంటే ఒకప్పుడు కొట్లాటలతో గంజాయి సాగుతో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేదని ఇన్నాళ్లు పరిపాలించిన కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు దీనికి కారణమని మంత్రి అన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక అభివృద్ధికి అడ్డాగా నారాయణఖేడ్ మారిందన్నారు.

మనకి రావాల్సిన ప్రాజెక్టును ఆంధ్రకు తీసుకుపోయారు.

బీజేపీవి అన్ని అబద్ధాలే.. మాకు జాతీయ ప్రాజెక్టు ఇచ్చారా.. తెలంగాణపై విష ప్రచారాలు మానుకోవాలని అన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కర్ఫ్యూ ఉంటుంది.. ఏం నిర్ణయం తీసుకోవాలన్న కాంగ్రెస్ నేతలు హై కమాండ్ పర్మిషన్ తీసుకోవాలని మంత్రి హరీష్‌రావు సెటైర్లు వేశారు..

ఫలించనున్న ఎమ్మెల్సీ కవిత పోరాటం: మంత్రి సత్యవతి రాథోడ్

మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లు అమలు చేయాలని పోరాడిన ఎమ్మెల్సీ కవిత పోరాటానికి కేంద్రం తగ్గిందని, మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.

చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్‌ కోసం పోరాడుతున్న బీఆర్‌ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత పోరాటం ఫలించనుందనిఆమె అన్నారు.

ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. ఈ నెల 20వ తేదీన ఈ బిల్లుపై చర్చ జరుగనున్నట్లు తెలుస్తోంది.

పార్లమెంట్‌లో ఈరోజు ప్రత్యేక సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. రేపటి నుంచి కొత్తగా నిర్మించిన భవనంలో ఈ సమావేశాలు జరుగనున్నాయి.

పార్లమెంట్‌లో మహిళా బిల్లు ప్రవేశపెట్టాలని ఎమ్మెల్సీ కవిత ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. దేశంలోని కోట్లాది మహిళల పక్షాన ఆమె ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్ష కూడా చేపట్టారు.

అంతేకాదు ఈ బిల్లుకు మద్దతు పలకాలని దేశంలోని 49 రాజకీయ పార్టీలను కోరారు. అందుకోసం రాజకీయ విభేదాలను పక్కన పెట్టాలని, అందరూ ఒక్క మాటపై నిలబడి మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఒత్తిడి తేవాలని ఆమె ఆయా పార్టీలను అభ్యర్థించారు.......

నేడు ఏసీబీ కోర్టులో చంద్రబాబు కేసు విచారణ

ఎసిబి కోర్టులో మరో మూడు పిటిషన్‌లపైనా చంద్రబాబు నాయుడు విచారణ ఎదుర్కొనున్నారు.

విజయవాడ ఎసిబి కోర్టుల్లో నేడు బాబు కేసుల విచారణ జరగనుంది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జైలులో ఉన్నారు.

చంద్రబాబు దాఖలు చేసిన క్యాష్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరగనుంది. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ కేసులో హైకోర్టులో విచారణ చేయనున్నారు.....

SB NEWS

SB NEWS

SB NEWS

చంద్రబాబు అరెస్టుకు అమెరికాలో ఎన్ఆర్ఐ ల నిరసన

టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అరెస్టుకు నిరసనగా అమెరికాలో ఎన్‌ఆర్‌ఐలు నిరసన చేపట్టారు.బే ఏరియాలో ప్రవాసాంధ్రులు నిరసన వ్యక్తం చేశారు.

చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని ప్రవాసాంధ్రులు డిమాండ్ చేశారు.

ఆధారాలు లేకుండా చంద్రబాబును ఎలా అరెస్టు చేశారని ఎన్‌ఆర్‌ఐలు ప్రశ్నించారు. సైకో పోవాలి… సైకిల్ రావాలంటూ నినాదాలు చేశారు.

వియ్‌ఆర్‌విత్ సిబిఎన్ నినాదంతో ప్రవాసాంధ్రులు ర్యాలీ చేపట్టారు.

హైదరాబాద్ లో చంద్రబాబు క్షేమం కోరుతూ కూకట్‌పల్లిలో మంగళవారంఉదయం పూజలు చేశారు.

వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఆయన అభిమానులు సుదర్శన హోమం చేశారు. సుదర్శన హోమంలో నందమూరి సుహాసిని పాల్గొన్నారు.

హీరో నవదీప్ కోసం పోలీసులు గాలింపు?

మాదాపూర్ డ్రగ్స్ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న హీరో నవదీప్ ఇంట్లో నార్కోటిక్ బ్యూరో పోలీ సులు మంగళవారం ఉదయం సోదాలు నిర్వహించింది.

పోలీసులు సోదాలు చేసే సమయంలో నవదీప్ ఇంట్లో లేరని తెలుస్తోంది. తనను అరెస్టు చేయవద్దు అంటూ నవదీప్ ఇప్పటికే కోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకున్నారు.

దీంతో ఈరోజు మంగళవారం వరకు నవ దీప్‌ను అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు ఆదే శాలు జారీ చేసింది. డ్రగ్స్ కేసులో నవదీప్ మరో సారి హైకోర్ట్‌లో పిటిషన్ దాఖలు చేశారు.

నవదీప్ పిటిషన్‌పై నార్కోటిక్ పోలీసులు కౌంటర్ దాఖలు చేయ నున్నారు.

పోలిసులు వెళ్ళిన సమయంలో నవదీప్ ఇంట్లో లేకుండా పోయారు. మాదాపూర్ డ్రగ్స్ కేసులో 37, వ నిందితుడిగా నవ‌దీప్‌ను నార్కోటిక్ బ్యూరో పోలీసులు చూపెడుతున్నారు .

తన మిత్రుడు రామ్ చందు దగ్గర నుంచి డ్రగ్స్ తీసుకున్నట్లుగా పోలీసుల వద్ద ఆధారాలు ఉన్నాయి. ఇప్పటికే నవదీప్ స్నేహితుడు రామచంద్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే....