చంద్రబాబు చుట్టు స్కామ్ ల ఉచ్చు
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు జగన్ సర్కార్ మరో షాక్ ఇచ్చింది.గతంలో సీఐడి దర్యాప్తు చేపట్టిన ఫైబర్ నె ట్ స్కాం కేసు మళ్లీ తెర మీదకు వచ్చింది.
ఈ కేసులనూ చంద్రబాబు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వందల కోట్ల రూపాయలు గోల్‌మాల్ జరిగినట్లు గుర్తించిన సీఐడి అందుకు ప్రధాన కారణం చంద్రబాబేనని అభియోగాలు మోపింది. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నిబంధనలకు విరుద్ధంగా టెరా సాప్ట్ కంపెనీకి ఫైబర్ నెట్ కాంట్రాక్ట్ ఇచ్చారనేది చంద్రబాబుపై ప్రధాన ఆరోపణ. .
దీంతో ఇప్పటికే స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టయి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబును ఫైబర్ నెట్ కేసులో అరెస్టు చేసేందుకు సీఐడి సిద్ధమవుతోంది. ఇందుకోసం విజయవాడ ఏసీబీ కోర్టులో మంగళవారం పీటీ వారెంట్ దాఖలు చేసింది.
అటు స్కిల్ కేసులో రిమండ్‌లో ఉంటుండగానే చంద్రబాబుపై సీఐడి అధికారులు ఇన్నర్ రింగ్ రోడ్ స్కాం కేసులో అరెస్టు చేసేందుకు ఇప్పటికే ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేశారు.
అది పెండింగ్‌లో ఉంది. ఈ కేసులోనే చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో మంగళవారం విచారణ జరగ్గా ఈనెల 21కి వాయిదా పడింది.
అయితే చంద్రబాబును టార్గెట్ చేసిన సీఐడి ఫైబర్ నెట్ స్కాం కేసు తెర మీదకు తీసుకువస్తూ తాజాగా పీటీ వారెంట్ దాఖలు చేయగా విచారణకు న్యాయమూర్తి స్వీకరించారు. ఫైబర్ కేసులో చంద్రబాబును ప్రధాన నిందితుడు ఏ1గా సీఐడి పేర్కొంది...
Sep 20 2023, 09:59