ముస్లిం యువకుడు వినాయకుడి భక్తి
ముస్లిం యువకుడు వినాయకుడి భక్తి
అభివృద్ధిని కలియ గలుపుతూ వినాయక చవితి వృత కల్పం రూప కల్పన
అభిమాన నేత అభివృద్ధిని వ్రతకల్పంలో ఇంటింటికి చేర్చిన ముస్లిం యువకుడు
గంగా,జమునా, తాహజీబ్ కు నిలువెత్తు నిదర్శనం
#వినాయక చవితి రోజున ప్రత్యేక ఆకర్షణగా ముస్లిం యువకుడి వినాయక చవితి వ్రత కల్ప విధానం
పుస్తకాన్ని చూసి మంత్ర ముగ్దులైన మంత్రి జగదీష్ రెడ్డి దంపతులు
మట్టి విగ్రహంతో పాటు పట్టణ ప్రజలకు వ్రత కల్ప విధానం అందజేత
హిందువులు సంప్రదాయంగా జరుపుకునే వినాయక చవితి ప్రాశస్త్యం తెలుపుతూ వ్రత కల్ప విధానాన్ని పుస్తకం రూపంలో ఓ ముస్లిం యువకుడు అందించిన వైనం ఇప్పుడు సూర్యపేటలో హల్ చల్ సృష్టిస్తుంది.అసలే వినాయక చవితి ఆపై ముస్లిం కుటుంబానికి చెందిన యువకుడు వినాయక చవితి వ్రత కల్పవిధానం పేరుతో ప్రచురించిన పుస్తకాలు సూర్యపేటలో ఇంటింటికి చేరుతుండడంతో ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం పజ్జురుకు చెందిన యస్ కే మాజిద్ 2001 లో టి ఆర్ యస్ ఆవిర్భావం నుండి మంత్రి జగదీష్ రెడ్డికి అనుంగు అనుచరుడిగా ఉన్నాడు.
ఉద్యమ సమయంలో అధినేత జగదీష్ రెడ్డి చేపట్టిన ప్రతి కార్యక్రమంలో ముందుండడం ఆనవాయితీగా మారింది. ఆయానే కాదు వాళ్ళ కుటుంబం యావత్ గులాబీ బాటలో నడుస్తోంది. ఆయన సోదరుడు యస్ కె మోయిజ్ ఆ గ్రామానికి ప్రస్తుతం సర్పంచ్ గా ఉన్నారు.మిగితా ఇద్దరు సోదరులు ఎలిక్ట్రికల్ విభాగంలో కాంట్రాక్టర్ల గా స్థిర పడినారు.ఈ క్రమంలో అభిమాన నేత మంత్రి జగదీష్ రెడ్డి కొరకు వినూత్నమైన పద్ధతిలో తనకు చేతనైన తోడ్పాటు అందించాలనుకున్నారు.అందుకు అనుగుణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో జిల్లా కేంద్రంగా రూపాంతరం చెందిన సూర్యపేట పట్టణంలో జరిగిన అభివృద్ధిని ఇంటింటికి చేర్చాలని నిర్ణయించారు. అందుకు అనువైన మార్గం హిందువులు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే వినాయక చవితి ని ఎంచుకున్నారు.శ్రీశ్రీశ్రీ వినాయక చవితి రోజున హిందువులందరికి చేరే విదంగా పట్టణాభివృద్ధి ప్రతిబింబింప చేయడంతో పాటు శ్రీశ్రీశ్రీ వినాయక చవితి వ్రత కల్ప విధానం పుస్తకాన్ని అందజేయాలని సంకల్పంతో నిర్ణయం తీసుకున్నారు .నిర్ణయానికి అనుగుణంగా క్యాలిటి,క్వానీటి లలో ఎక్కడా రాజీ లేకుండా కలకలానికి గుర్తుండి పోయేలా పుస్తకాన్ని రూపుదిద్దుకుంది .
ఈ పుస్తకం ఈ వినాయక చవితికి ప్రజల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పుస్తకాన్ని చూసిన మంత్రి జగదీష్ రెడ్డి,సునీతా జగదీష్ రెడ్డి దంపతులు మంత్ర ముగ్దులు కావడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు గాను ప్రతి సంవత్సరం అందిస్తున్నట్లుగానే భక్తులకు మట్టి వినాయకుడి ప్రతిమలను అందించిన మంత్రి జగదీష్ రెడ్డి సతీమణి శ్రీమతి సునీతా జగదీష్ రెడ్డి ఈ సంవత్సరం ముస్లిం యువకుడు యస్ కే మాజిద్ రూపొందించిన శ్రీశ్రీశ్రీ వినాయక చవితి వ్రత కల్ప విధానం పుస్తకాన్ని అందించి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం గంగా జమునా తాహజీబ్ కు తార్కాణమని నిరూపించారు.
Sep 19 2023, 13:15