టిఆర్ఎస్ ఫస్ట్ లిస్టులో మార్పులు ఉంటాయా?
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తోన్న వేళ అధికార బీఆర్ఎస్ పార్టీ అందరికంటే ముందే అభ్యర్థులను ప్రకటించి దూకుడు ప్రదర్శించిన విషయం తెలిసిందే. మొత్తం 115 మందితో తొలి జాబితాను వెల్లడించారు.
దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలకే తిరిగి సీట్లు కేటాయించారు. అయితే ఈ జాబితాలో కేవలం ఏడుగురు మహిళలకే అవకాశం కల్పించారు. దీంతో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన ఎమ్మెల్సీ కవితపై విపక్షాల నుంచి సోషల్ మీడియా నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.
పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్పడం కాదు.. ముందు మీ పార్టీలో మహిళలకు ఎన్ని సీట్లు కేటాయించారో చూడు’ అంటూ సెటైర్లు వేశారు. అంతేకాదు.. ఢిల్లీ లిక్కర్ కేసు నుంచి తప్పించుకోవడానికి, ఈ కేసు నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే ఇలాంటి 33శాతం మహిళా రిజర్వేషన్ నినాదం ఎత్తుకుందని. ఢిల్లీ రిజర్వేషన్ పోరాటం పెద్ద డ్రామా అని సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు.
ఇదిలా ఉండగా.. తాజాగా మహిళా రిజర్వేషన్ బిల్లుకు ప్రధాని నరేంద్ర మోడీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనిని ఇవాళ మంగళవారం సభలో ప్రవేశపెట్టనున్నారు. 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రభుత్వం తీసుకువస్తుందని చెబుతున్నారు.
ఇప్పుడు ఈ బిల్లు ఆమోదం పొందితే లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించబడతాయి. ఇదే జరిగితే రానున్న ఎన్నికల్లో ఇప్పటికే చాలా ప్లాన్‌లు వేసుకున్న చాలా రాష్ట్రాల లెక్కలు తారుమారు కానున్నాయి.
ఇందులో భాగంగా ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో మార్పులు అనివార్యంగా మారింది. అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం సీట్లు అంటే దాదాపు 40 సీట్ల వరకు కేటాయించాల్సి ఉంది. దీంతో తప్పక బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్‌లో మార్పులు చేయాల్సి ఉంది...
Sep 19 2023, 12:52