రష్యా ఇస్లామిక్ బ్యాంకింగ్‌ను అవలంబిస్తుంది..
రష్యా ఇస్లామిక్ బ్యాంకింగ్‌ను అవలంబిస్తుంది
సల్మాన్ హైదర్
రష్యా ప్రధానంగా నాలుగు ముస్లిం తూర్పు ప్రాంతాలలో -చెచ్న్యా, డాగేస్తాన్, బాష్కోర్టోస్తాన్ మరియు టాటర్స్తాన్ (Chechnya, Dagestan, Bashkortostan, and Tatarstan) లో ఇస్లామిక్ బ్యాంకింగ్ పద్ధతులను అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది.
రష్యన్ స్టేట్ డూమా(పార్లమెంట్) లో, రష్యాలో ఇస్లామిక్ ఫైనాన్స్‌ను ప్రోత్సహించడానికి ఉద్దేశించిన కొత్త బిల్లు ఇప్పటికే ఆమోదించబడింది. బిల్లు ప్రకారం భాగస్వామ్య ఫైనాన్సింగ్ సంస్థలు ముస్లిం తూర్పు ప్రాంతాలలో అభివృద్ధి చెందుతాయి. బ్యాంక్ ఆఫ్ రష్యా మార్కెట్‌ను నియంత్రిస్తుంది మరియు కంపెనీల రిజిస్ట్రీని నిర్వహిస్తుంది
ఖతారీ నాన్-ప్రాఫిట్ మీడియా అవుట్‌లెట్ మిడిల్ ఈస్ట్ మానిటర్ (MEMO), కథనం ప్రకారం రష్యా లో ఇస్లామిక్ బ్యాంకింగ్ అనేది ఉక్రెయిన్ విషయం లో రష్యా పట్ల విధింపబడిన పాశ్చాత్య ఆంక్షలకు ప్రతిస్పందన. ముస్లిం ప్రపంచంలో మరింత లాభదాయకమైన వాణిజ్యం కోసం, రష్యా మధ్యప్రాచ్యం మరియు ఆసియా వైపు చూస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిక్ బ్యాంకులు ఉన్నాయి. ది ఎకనామిస్ట్ యొక్క 2014 నివేదిక ప్రకారం, షరియా చట్టానికి కట్టుబడి ఉన్న ఆర్థిక సంస్థలు ప్రపంచ ఆస్తులలో 1% కలిగి ఉన్నాయి. ముస్లిం మరియు ముస్లిం మెజారిటీ దేశాలలో షరియా-అనుకూల బ్యాంకులు క్రమంగా విస్తరిస్తున్నాయి.
2004లో, ముస్లిమేతర దేశంలో మొట్టమొదటి ఇస్లామిక్ బ్యాంక్ లండన్‌లో ప్రారంభించబడింది మరియు 2013లో, J.P మోర్గాన్ వినియోగదారులకు ఇస్లామిక్ బ్యాంకింగ్ ఎంపికలను అందించడం ప్రారంభించినది. ఇస్లామిక్ బ్యాంకింగ్ ఇప్పుడు ప్రతిచోటా ప్రజలకు ఒక ఎంపికలాగా మారింది.
రష్యన్ స్టేట్ డూమా ఆర్ధిక కమిటీ అధిపతి అనటోలీ అక్సాకోవ్ ప్రకారం "ఆసియా దేశాల నుండి- మలేషియా, ఇండోనేషియా మరియు అరబ్ దేశాల నుండి నిధులను ఆకర్షించే అంశం డూమా ఎజెండాలో ఉంది, ,."
ఇస్లామిక్ బ్యాంకింగ్ మరియు వాణిజ్య ఆచరణలో రష్యా యొక్క తాత్కాలిక ప్రవేశం పూర్తిగా ఊహించనిది కాదు. 2017 US స్టేట్ డిపార్ట్‌మెంట్ సర్వే ప్రకారం, రష్యా మొత్తం జనాభాలో ముస్లింలు దాదాపు 10% ఉన్నారు. వందల సంవత్సరాలుగా, రష్యా ఉత్తర కాకసస్‌లోని కొన్ని భాగాలను పాలించింది. చెచ్న్యా, డాగేస్తాన్, బాష్కోర్టోస్తాన్ మరియు టాటర్‌స్తాన్‌లలో గణనీయమైన ముస్లిం జనాభా ఉన్నందున, రష్యా ఇప్పుడు ఐరోపాలో అతిపెద్ద ముస్లిం జనాభాను కలిగి ఉంది.
Sep 18 2023, 19:34