భూ వివాదంలో నాగార్జున సోదరి పై కేసు నమోదు
ప్రముఖ టాలీవుడ్ హీరో నాగార్జున సోదరి నాగ సుశీలపై కేసు నమోదయ్యింది.శ్రీజ ప్రకృతి దర్శపీఠం ఆశ్రమంపై దాడి చేశారని బాధితులు ఫిర్యాదు చేయడంతో మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈనెల 12న నాగసుశీల మరికొంత మంది కలిసి శ్రీనివాసరావు ఇంటిపై దాడి చేశారని ఆరోపిస్తూ బాధితులు ఫిర్యాదు చేశారు.
ఈ ఘటనపై మొయినాబాద్ పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.
కాగా, గతంలో నాగసుశీల తన వ్యాపార భాగస్వామి అయిన నిర్మాత చింతలపూడి శ్రీనివాసరావుతో కొన్నేళ్లుగా భూ వివాదాలు ఉన్నట్టు సమాచారం, కేసు కు సంబంధించిన మరికొన్ని వివరాలు తెలియవలసి ఉంది..
SB NEWS
SB NEWS











Sep 18 2023, 16:59
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
12.4k