దివ్యాంగుల కోసం వినూత్న పథకాలు: మంత్రి కొప్పుల
దివ్యాంగుల కోసం వినూత్న పథకాలు: మంత్రి కొప్పుల
ఎన్నో ముఖ్యమైన కార్యక్రమాలకు హాజరైనా కలగని ఆత్మసంతృప్తి ఈ కార్యక్రమంలో కలుగుతున్నదని మంత్రి కొప్పుల
జగిత్యాల జిల్లా//
ధర్మపురి SH గార్డెన్ లో ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించిన141మంది దివ్యాంగులకు తెలంగాణ వికలాంగుల సహకార సంస్థ ఆధ్వర్యంలో సుమారు 70 లక్షల విలువ గల ఉచిత సహాయక ఉపకరణాలను 1 బ్యాటరీ ఆపరేటర్ వీల్‌చైర్, 110 ఆపరేటర్ బ్యాటరీ ట్రైసైకిల్లు, 30 స్కూటీలు మొదలగు పరికరాలు అర్హులైన దివ్యాంగువకు పంపిణీ చేసిన సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
సమైక్య పాలనలో వికలాంగులను పట్టించుకోలేదు. వికలాంగుల శాఖ మొక్కుబడిగా ఉండేది, వారి అవసరాలను తీర్చేది కాదు,
కాంగ్రెస్ పార్టీ పాలనలో ఈ దివ్యాంగులకు 200 ఇస్తుండే, వారిని ఈ దివ్యాంగులకు ఫించన్ పెంచాలని సోయి జ్ఞానం ఉందా అని మంత్రి ప్రశ్నించారు..
దివ్యాంగులను కన్నబిడ్డల్లా అక్కున చేర్చుకున్న ఘనత సిఎం కెసిఆర్ గారిది, తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతుంది.
గతం లో కాంగ్రెస్ పార్టీ పాలనలో దివ్యాంగులకు 50 శాతం సబ్సిడీ కింద ఈ ఉపకరణాలు అందించారు, కాని తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత దివ్యాంగులకు ఈ ఉపకరణాలను ఉచితంగా అందించడం జరుగుతోంది.. కెసిఆర్ గారు ఒక మానవీయ కోణంతో ఆలోచించి, వారికి ఉచితంగా అందిస్తున్నారు
దివ్యాంగుల సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ అగ్రభాగంలో ఉన్నది. దివ్యాంగులకు బాసటగా నిలవడమే తెలంగాణ ప్రభుత్వ ఆశయం. సాటి మనిషి కష్టం, బాధ అర్థం చేసుకొని తీర్చగలిగినప్పుడే మానవ జన్మకు అర్థం, పరమార్థం ఉంటాయని సీఎం కేసీఆర్ ఎప్పుడూ చెప్తూ ఉంటారు. వారి ముఖాల్లో చిరునవ్వు ఉంటేనే ప్రభుత్వంగా మాకు ఆత్మ సంతృప్తి ఉంటుంది.
దివ్యాంగులకు వినూత్న సంక్షేమ పథకాలు అమలుచేస్తూ దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం ముందున్నదని చెప్పారు.
దివ్యాంగుల్లో ఆత్మగౌరవాన్ని పెంచడంతోపాటు.. ఎవరి సాయం లేకున్నా బతకగలమనే ఆత్మైస్థెర్యాన్ని వారిలో నింపిందని పేర్కొన్నారు.
వికలాంగులకు రూ.3016 పింఛన్ ను 4016 గా పెంచి ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు.
ఏటా దివ్యాంగులకు రూ.1,800 కోట్లు పింఛన్ ఇస్తున్నాయని మంత్రి తెలిపారు. అర్హులైనవారు ఎవరు దరఖాస్తు చేసుకున్నా పరికరాలు అందజేస్తామని చెప్పారు.
ఎన్నో ముఖ్యమైన కార్యక్రమాలకు హాజరైనా కలగని ఆత్మసంతృప్తి ఈ కార్యక్రమంలో కలుగుతున్నదని మంత్రి తెలిపారు
అన్నివర్గాలు, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ ముందుకు వెళుతున్నారని మంత్రి తెలిపారు.
Sep 18 2023, 11:57