తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యులకు, ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు..
![]()
తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యులకు, ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు.. అనర్హులను సభ్యులుగా నియమించడం పై అభ్యంతరం
శివ శంకర్. చలువాది
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి ఆలయాన్ని నిర్వహించే సంస్థ టీటీడీ.. ఈ సంస్థ ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశ్యం స్వామివారి ఆలయం బాగోగులు చూడడమే..
అంతేకాదు దేశం నలువైపులా వివిధ సామజిక, ధార్మిక, సాంస్కృతి వంటి అనేక రకాల కార్యక్రమాలను నిర్వహిస్తూ హిందూ ధర్మాన్ని విస్తరింపజేస్తుంది.
ఈ నేపథ్యంలో టీటీడీ సంస్థ నిర్వహణ కోసం చైర్మన్, బోర్డు మెంబర్ ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అయితే కొత్తగా టీటీడీ సభ్యులను ప్రభుత్వం నియమించింది.
వారికీ, ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. నేర చరిత్ర ఉన్నవారిని బోర్డు సభ్యులుగా నియమించడంపై అభ్యంతరం తెలిపింది. కౌంటర్ దాఖలు చేయాలంటూ ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది హైకోర్టు.
![]()
టీటీడీలో ఏర్పాటు చేసిన కొత్త పాలకమండలి సభ్యుల్లో కొందరికి నేర చరిత్ర ఉందని హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేసారు. ఈ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు స్పందించింది. ఏపీ ప్రభుత్వానికి హైకోర్ట్ నోటీసులు జారీచేసింది. ఎమ్మెల్యే సామినేని ఉదయ భాను, కేతన్ దేశాయ్, శరత్ చంద్రారెడ్డికి పర్సనల్ నోటీసులు జారీ చేసింది హైకోర్టు. వీరి నియామకాన్ని సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో పిల్ ధాఖలు చేశారు విజయవాడకి చెందిన మాజీ రైల్వే ఉద్యోగి చింతా వెంకటేశ్వర్లు.. మంచి నడవడిక లేని, అనర్హులను, నేర చరిత్ర ఉన్నవారిని టీటీడీ సభ్యులుగా నియమించడం చట్ట వ్యతిరేకమని హైకోర్టుకు విన్నవించారు.. పిటిషన్‌ను విచారించిన చీఫ్ జస్టిస్, జస్టిస్ రఘునందన రావు ధర్మాసనం.. ప్రభుత్వాన్ని వివరణ కోరింది. శిక్ష ఇంకా విధించని కారణంగా వారు నేరస్థులుగా పరిగణించలేదని ప్రభుత్వం తరుపు న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపించారు.
మరోవైపు.. ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం మెడికల్ కౌన్సిల్ ఇండియా సభ్యత్వం నుండి తొలగింప బడిన కేతన్ దేశాయ్‌ను టీటీడీ సభ్యుడిగా నియమించారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు చింతా వెంకటేశ్వర్లు తరపు న్యాయవాది శ్రావణ్.ఇదిలావుండగా.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో శరత్ చంద్రారెడ్డి విచారణ ఎదుర్కొన్నారని, సామినేని ఉదయభానుపై క్రిమినల్ కేసులు వున్నాయని పిటిషనర్ వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం కౌంటర్ దాఖలు చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది హైకోర్టు.


ఈ సందర్భంగా జిల్లా పరిషత్తులో గ్రామ సర్పంచ్ పబ్బతిరెడ్డి రవీందర్ రెడ్డిని , కార్యదర్శి ఉపేందర్ ను జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి , కలెక్టర్ ఆర్ వి. కర్ణన్ లు సన్మానించారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ , జడ్పీ సిఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి , ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి , ఎంపీవో మాధవరెడ్డిలు ఉన్నారు.
ఈ కార్యక్రమంలో బిసి మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మామిడి పద్మ మత్స్యకారుల రాష్ట్ర అధ్యక్షులు లోకనబోయిన వెంకటరమణ ముదిరాజ్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు మున్నా ప్రసన్న కుమార్ యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు మేకల యాదన్న యాదవ్ ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల శ్రీనివాస్ బెస్త సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుండు వెంకటేశ్వర్లు బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి కర్నాటి యాదగిరి మార్గం సతీష్ కుమార్ యువజన సంఘం ప్రధాన కార్యదర్శులు భరత్ మల్లె పోయిన సతీష్ యాదవ్ మార్గం సతీష్ పగిళ్ల కృష్ణ చిలుకూరి శ్రీనివాస్ వలకీర్తి శ్రీనివాస్ సుజాత వనం లలిత రుద్ర లక్ష్మీనారాయణ రవీంద్ర చారి వెంకటాచారి దుడుకు తిరుపతయ్య ఉజ్వల్ తదితరులు పాల్గొన్నారు.
ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 272 కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది మార్చి 8న ప్రభుత్వం ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని ప్రారంభించింది...
Sep 14 2023, 13:43
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
9.1k